24 క్యారెట్ల బంగారంతో దాల్‌ రెసిపీ! షాక్‌లో నెటిజన్లు | Dal With 24-Carat Gold Dust At Ranveer Brar's Dubai Restaurant | Sakshi
Sakshi News home page

24 క్యారెట్ల బంగారంతో దాల్‌ రెసిపీ! షాక్‌లో నెటిజన్లు

Published Wed, Mar 6 2024 1:04 PM | Last Updated on Wed, Mar 6 2024 1:20 PM

Dal With 24-Carat Gold Dust At Ranveer Brars Dubai Restaurant - Sakshi

ఎన్నో రకాల వంటకాలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి వంటకం మాత్రం చూసి ఉండరు. గోల్డ్‌తో తయారు చేసిన కొన్ని రకాల రెసిపీలు కూడా చూసి ఉంటారు. కానీ మరీ ఇలా పప్పుని గోల్డ్‌తో వడించడం చూసి ఉండరు. గోల్డ్‌ని ఇలా ఆహారం తీసుకుంటే అరుగుతుందా అన్న డౌట్లు వచ్చేస్తుంటాయి. కానీ  ఓ రెస్టారెంట్‌ తన కస్టమర్లకు ఈ ప్రత్యేకమైన వంటకాన్ని అందిస్తుంది. పైగా ధర కూడా ఎక్కువే. 

ఎక్కడంటే..దుబాయ్‌లోని కుష్కన్‌లో పలు అవార్డులు పొందిన సెలబ్రిటీ చెఫ్‌ రణవీర్‌ బ్రార్‌కి చెందిన రెస్టారెంట్‌ బంగారంతో ప్రత్యేక వంటకాన్ని అందిస్తుంది. ఇది విశేష ప్రజాదరణ పొందిన వంటకం అని చెప్పొచ్చు. దీన్ని 'దాల్‌ కష్కన్‌' అనిపిలుస్తారు. పప్పుని 24 క్యారెట్ల బంగారపు రజనుతో తయారు చేస్తారు. దీని ధర ఏకంగా 58 దిర్హామ్‌లు (సుమారు ₹ 1,300).

మెహుల్‌ హింగు అనే ఫుడ్‌ బ్లాగర్‌ ఇన్‌స్టాగ్రామలో ఆ రెసీపీకి సంబంధించిన వీడియోని షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఒక చెక్కపెట్టేలో ప్రీమియం మసాలాలు, నెయ్యితో తయారు చేసిన పప్పును తీసుకు వస్తారు. సర్వర్‌ కస్టమర్‌కు ఆ డిష్‌ ప్రత్యేకతను వివరించడం జరగుతుంది. ఆ తర్వాత ఒక గిన్నేలోని బంగారు రజనుతో ఉన్న లిక్విడ్‌ని పప్పుపై వేసి కలపడం కనిపిస్తుంది. ఇది కష్కన్‌లో దుబాయ్‌ ఫెస్టివ్‌ సిటీ మాల్‌లోని రణ్‌వీర్‌ బ్రార్‌ రెస్టారెంట్‌ '24 క్యారెట్ల గోల్డెన్‌ తడ్కే వాలీ దాల్‌' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేశాడు మెహుల్‌ హింగు. దీన్ని చూసిన నెటిజన్లు​ బంగారాన్ని మన శరీరం శోషించుకోలేదు. అయినా దీనిలో ఏం పోషకాలు ఉంటాయని ఇలా చేస్తున్నారని, మరోకరు ఫైర్‌ అవ్వుతూ కామెంట్లతో పోస్ట్‌లు పెట్టారు. 

(చదవండి: మద్యపాన వ్యసనానికి చెక్‌పెట్టే సరికొత్త చికిత్స విధానం! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement