అప్పు చేసి పప్పు కూడు తినమన్నారు గానీ...పప్పుకు నిప్పెట్టమని చెప్పలేదు పెద్దలు. హరిద్వార్‌లోని జ్వాలానగర్‌కు చెందిన ఈ పెద్దాయన పప్పుకు నిప్పెట్టి ‘ఫైర్‌వాలీ దాల్’ పేరుతో తన హోటల్లో హాటు హాటుగా అమ్ముతుంటాడు. నెయ్యి... మొదలైన దినుసులు ఉన్న గరిటెను మండించి ప్లేట్‌లో ఉన్న పప్పుకు జస్ట్ అలా తగిలిస్తాడు...అంతే! ‘ఫైర్‌వాలీ దాల్’కు రుచికరమైన సూప్‌ను ఉచితంగా ఇస్తాడు.
ఈ ‘ఫైర్‌వాలీ దాల్’ కోసం ఎప్పుడూ వచ్చే వారితో పాటు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అంటూ వచ్చే వాళ్లు కూడా ఎక్కువే. ఆనోటా ఈ నోటా ఈ ‘ఫైర్‌వాలీ దాల్’ గురించి విన్న ఒక యువకుడు పనిగట్టుకొని దిల్లీ నుంచి హరిద్వార్‌కు వచ్చాడు. ‘ఇతడి చేతిలో ఏదో ఇంద్రజాలం ఉంది’ అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వేడి వేడిగా పోస్ట్ చేశాడు. ‘సో టెంప్టింగ్’ అంటూ స్పందించారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment