శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : కందిపప్పును అక్రమంగా నిల్వ ఉంచినవారిపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. నెల్లూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ లక్ష్మీనారయణ ఇంటిపై సోమవారం దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు అక్రమంగా దాచి ఉంచిన రేషన్(పీడీఎస్‌యూ) కందిపప్పును స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల విషయాన్ని పసిగట్టిన లక్ష్మీనారాయణ ఈ లోపే పప్పు బస్తాలను పక్కింట్లోకి తరలించడానికి ప్రయత్నిస్తుండగా.. అధికారులు అడ్డుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్పీ రామేశయ్య, డీఎస్పీ వెంకటనాథ్ రెడ్డి పాల్గొన్నారు.
కందిపప్పు అక్రమనిల్వలపై విజిలెన్స్ దాడులు
Published Mon, Oct 26 2015 3:23 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement