బీహార్‌లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ నియోజకవర్గం నుంచి 6.14 లక్షల మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. ఆయన తన తండ్రి, దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న రాజకీయనాయకుడు కూడా ఆయనే. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో హీరోగా నటించారు కూడా. అందులో హీరోయిన్ బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం.
ఇక చిరాగ్ ఒక ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన ఆహారం గురించి షేర్ చేసుకున్నారు. బిహారీ సంప్రదాయ ఫుడ్ అయిన దాల్‌చావల్ లేదా దాల్ బాత్ అంటే మహా ఇష్టమైన రెసిపీ అని చెప్పుకొచ్చారు. ఇది స్పైసీ తడ్కాతో కూడిన ఒక రకమైన భోజనం. పేరు డిఫెరెంగా ఉన్నా.. ఇది మన సాధారణ భారతీయ భోజమే. మనం తెలుగు రాష్ట్రాల్లో పప్పు అన్నం ఇష్టంగా తింటామే అదేగానీ కొంచెం వెరైటీగా ఉంటుంది.
ఇక్కడ దాల్ చావల్ అంటే దాల్ అంటే పప్పు, చావల్ అంటే ఉడికించిన అన్నం..మొత్తం కలిపి పప్పు అన్నం. అయితే కొన్ని ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు తక్కువగా ఉండటంతో కొద్దిపాటి కూరగాయలను జోడించి.. సులభంగా పోషకాలు పొందేలా రూపొందిచిన వంటకమే ఈదాల్ చావల్. అదేనండి మనం పప్పు టమాటా, దోసకాయ పప్పు ఎలా చేసుకుంటామో అలానే అన్నమాట. కాకపోతే ఇది స్పైసీగా ఉంటుంది. దీనికి ఊరగాయ, పాపిడ్‌ని జతచేసి వేడివేడి అన్నంలో తింటే దీని రుచే వేరు. ఈ దాల్ చావల్ తయారీ విధానం ఎలాగో సవివరంగా చూద్దామా..!
కావాల్సిన పదార్థాలు..
కందిపప్పు 1 కప్పు
నీళ్లు 4 కప్పులు
ఉల్లిపాయ ఒకటి
టమమోటాలు 2
పచ్చిమిర్చి 2
వెల్లుల్లి రెండు,
లవంగాలు రెండు
అల్లం ముక్క ఒకటి
ఆవాలు టేబుల్ స్పూన్
జీలకర్ర టేబుల్ స్పూన్
నూనె రెండు టేబుల్ స్పూన్లు
అలంకరణ కోసం తాజా కొత్తిమీర ఆకులు
బాస్మతి బియ్యం 1 కప్పు
నీరు 2 కప్పులు
రుచికి ఉప్పు
తయారు చేయు విధానం: పప్పు బాగా కడిగి నాలుగు కప్పులు నీళ్లు, పసుపు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేగాక, ఉల్లిపాయ ముక్కలు, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, లవంగాలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత ఈ ఉడికించిన పప్పును వేయడమే. చివరగా కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేసుకోవాలికి. దీని కోసం రెడీ చేసి పెట్టుకున్న వేడి వేడి అన్నంలో ఈ పప్పు, ఊరగాయ, పాపిడి వేసుకుని తింటే ఆ రుచే వేరేలెవెల్.
(చదవండి: అంబానీ కుటుంబం ఆ ఆవు పాలనే తాగుతారట..లీటర్ ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment