![desi mom gives great training for her son who is soon to be married - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/18/dal.JPG.webp?itok=f4sHGdIW)
సాక్షి, హైదరాబాద్: ఆ మ్యాగీ, చిప్స్ గట్రా రెండు వారాలు తినే సరికి నోరు చేవ చచ్చిపోతుంది. ఇంటి తిండి తినాలనే కోరిక పుడుతుంది. సరిగ్గా అప్పుడే చిన్న సమస్య మొదలవుతుంది. అదే ఏది కందిపప్పో, ఏది మినపప్పో తెలియకపోవడం! అంటూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న తనయుడికి ఓ తల్లికి రాసిన చిన్న సలహాల పట్టిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (నితిన్ పెళ్లి ముహూర్తం ఖరారు)
ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా దీన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. రకరకాల పప్పుదినుసులను ఓ పేపర్‌పై స్టిక్కర్లతో అంటించిన తల్లి దాన్ని కొడుక్కి పెళ్లి బహుమతిగా ఇచ్చిందట. దీపాన్షు ట్వీట్‌కు వెయ్యికి పైగా రిప్లైలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఆవిడ చేసిన పనిపై వారి అభిప్రాయాలు వెల్లడించారు.
కొందరు పెళ్లికి ముందు ఇచ్చే ‘గ్రేట్ ట్రైనింగ్’గా పేర్కొంటూ మెచ్చుకున్నారు. ఓ యూజర్ పప్పు దినుసుల్లో ఏది ఏంటో గుర్తుపట్టలేని అమ్మాయిలు కూడా ఉన్నారు సార్ అని ఓ యూజర్ పేర్కొనగా, ఈ పోస్టు వారికీ వర్తింస్తుందని దీపాన్షు రిప్లై ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment