మంచుతో కప్పబడిన ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు, పచ్చని అడవులు స్వచ్ఛమైన గాలితో.. హిమాచల్ సోయగాలు రారమ్మని పిలుస్తుంటాయి. అక్కడి ప్రకృతి అందాలు ఎంత అబ్బురపరుస్తాయో ... íహిమాచల్ వాసుల సంప్రదాయ వంటలు విభిన్న రుచితో తినేకొద్ది తినాలనిపిస్తాయి. వాటిలో కొన్ని వంటలు ఇవి...
గోధుమ పిండి, మినప్పప్పుతో బబ్రు
కావలసినవి:
►గోధుమ పిండి – రెండు కప్పులు
►మినపప్పు – కప్పు
►ఆయిల్ – డీప్‌ఫ్రైకి సరిపడా
►ఉప్పు – రుచికి సరిపడా
తయారీ..
►మినపప్పుని శుభ్రంగా కడిగి రాత్రంతా నాన బెట్టుకోవాలి.
►నానిన పప్పుని ఉదయాన్నే నీళ్లు వంపేసి బరకగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి.
►గోధుమపిండిలో పావు టీస్పూను ఉప్పు, కొద్దిగా నీళ్లుపోసి పూరీ పిండిలా కలుపుకోవాలి.
►పిండిముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి.
►ఈ ఉండలను చిన్న పూరీలా వత్తి మధ్యలో టీస్పూను మినపప్పు మిశ్రమం వేసి మూసేయాలి.
►ఇలా అన్నీ ఉండలు చేసిన తరువాత, లోపలి మిశ్రమం బయటకు రాకుండా చిన్నచిన్న పూరీలుగా వత్తుకోవాలి
►ఆయిల్ వేడెక్కిన తరువాత పూరీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారెంతవరకు కాలనిస్తే బబ్రు రెడీ.
► చనా మద్రా లేదా, బూందీరైతాలతో బబ్రూలు చాలా బావుంటాయి.
ఎర్ర కందిపప్పుతో తుక్దియా బాత్
కావలసినవి:
►బియ్యం – కప్పు
►ఎర్రకందిపప్పు – అరకప్పు
►ఉల్లిపాయ – ఒకటి
►బంగాళ దుంప – రెండు
►చిక్కటి పెరుగు – అరకప్పు
►బిర్యానీ ఆకు – ఒకటి
►యాలుక్కాయ – ఒకటి
►నల్లయాలుక్కాయ – ఒకటి
►దాల్చిన చెక్క – అరంగుళం ముక్క
►నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా
మసాలా పేస్టు:
టొమాటో – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి, అల్లం – అంగుళం ముక్క, వెలుల్లి రెబ్బలు – ఐదు, కొత్తిమీర – చిన్నకట్ట, పచ్చిమిర్చి – రెండు, యాలుక్కాయ – ఒకటి, నల్లయాలుక్కాయ – ఒకటి, దాల్చిన చెక్క – అరఅంగుళం ముక్క, జాపత్రి – రెండు, అనాసపువ్వులు – రెండు, దగడపువ్వులు – రెండు, నాగకేసరపువ్వులు – రెండు, గసగసాలు – అరటీస్పూను, లవంగాలు – రెండు, కారం – అరటీస్పూను.
తయారీ..
►ముందుగా మసాలా పేస్టుకోసం తీసుకున్న పదార్థాలన్నీ బ్లెండర్‌లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి.
►బంగాళ దుంపలను తొక్కతీసి, అంగుళం పరిమాణంలో ముక్కలుగా తరగాలి
►బంగాల దుంపల ముక్కలను మసాలా మిశ్రమంలో వేసి కలిపి, రాత్రంతా రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి
►ఎర్రకందిపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లుపోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి
►బియ్యాన్ని కూడా కడిగి రెండు కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి
►ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ∙కుకర్ గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి.
►నెయ్యి వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, నల్ల, సాధారణ యాలుక్కాయలు, దాల్చిన చెక్క వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి
►ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
►ఉల్లిపాయలు చక్కగా వేగినాక రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి వేగనివ్వాలి
►ఈ మిశ్రమం వేగిన తరువాత పెరుగు వేసి నెయ్యి పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి.
►ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యం, ఎర్రకందిపప్పులను నీళ్లు వంపేసి వేయాలి
►∙దీనిలో మూడు కప్పుల వేడినీళ్లుపోసి కలపాలి.
►కుకర్ మూతపెట్టి పెద్ద మంటమీద రెండు విజిల్స్ రానిస్తే తుక్దియా బాత్ రెడీ.
చదవండి: Prawns Salad Sandwich In Telugu: ప్రాన్స్ సలాడ్ శాండ్‌విచ్ ఇలా తయారు చేసుకోండి!
Ulava Garelu Recipe In Telugu: ఉలవ గారెలు తిన్నారా?
Comments
Please login to add a commentAdd a comment