ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? | Viral Video: This Way Roll Five Rotis Simultaneously | Sakshi
Sakshi News home page

ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ టెక్నిక్‌ ఫాలో అయితే త్వరగా చేసేయొచ్చు!

Published Thu, Jan 25 2024 1:18 PM | Last Updated on Thu, Jan 25 2024 3:14 PM

Viral Video: This Way Roll Five Rotis Simultaneously - Sakshi

రోటీలు లేదా చపాతీలు చేయడం అంటే అబ్బో పెద్దపని అనుకుంటాం. ఎందుకంటే పిండి కలపాలి కొద్దిసేపు నానివ్వాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి చక్కటి గుండ్రటి షేపులో చెయ్యడం కాల్చడం ఓ ఎత్తు. ఇక ఇంట్లో ఎక్కువ మంది జనం ఉంటే.. ఆ ఇల్లాలు వంటింట్లోనే గంటల తరబడి ఉండిపోవాల్సిందే. ఓ పట్టాన ఆ పని అవ్వదు. ఎవరైన సాయం చేస్తే ఓకే లేదంటే అంతే సంగతి. ఒకవేళ రోటీ మిషన్‌ ఏదైన ఉంటే సులువుగా అయిపోతుందనుకోండి. ఐతే అందరి వద్ద ఉండొచ్చు లేకపోవచ్చు. అలాంటప్పుడూ ఈ టెక్నిక్‌ ఫాలోకండి సులభంగా అయిపోతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఆ వ్యక్తి గోధుమ పిండిని చక్కగా ముద్దగా కలుపుకోని తనకు కావాల్సిన రోటీల సైజులో ఉండలుగా చేసుకుని పక్కన పెట్టకున్నాడు. ఆ తర్వాత ఒక్కో పిండికి ఎక్కువ మొత్తంలో పొడి పిండి అంది పక్కకు ఉంచాడు. ఇక ఐదు గోధుమ పిండి ఉండల్ని ఒక దానిపై పెట్టి చక్కగా రోల్‌ చేస్తూ గుండ్రటి షేప్‌లోకి వచ్చేలా నైపుణ్యంగా చేశాడు. అయితే ఇక్కడ ఇలా అన్నింటిని ఒకేసారి చపాతీల్లా చేసినా అవేమీ అతుక్కోలేదు. చక్కటి ఒకేసారి ఐదు రోటీలు గుండ్రటీ షేప్‌లో వచ్చేశాయి.

పైగా సెపరేట్‌గా చేసిన వాటిల్లా ఉన్నాయి కూడా. ఈ వీడియోని చేసినా నెటిజన్లు వాట్‌ ఏ జీనియస్‌ గురూ. భలే చేశావు అంటూ సదరు వ్యక్తిని ప్రశంసించగా, మరికొందరూ అలా అస్సలు కుదరదు అని కామెంట్‌ చేస్తున్నారు. అది వీడియో మాయ అని కూడా అంటున్నారు. అయితే ఇలా ఒకేసారి ఐదు రోటీలు చేయాలంటే మంచి స్కిల్‌ ఉంటేనే సాద్యం లేదంటే కష్టమే!.

(చదవండి: పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement