genius
-
ఐన్‌స్టీన్, హాకింగ్స్లనే మించాడు!
ఒక రంగంలో రాణించడాన్నే గొప్పగా చూసే రోజులివి. భారతీయ మూలాలున్న ఈ బ్రిటిష్ బాలుడు మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచి శెభాష్ అనిపించుకుంటున్నాడు. లండన్‌లోని హాన్స్లో ప్రాంతంలో నివసించే క్రిష్ అరోరాకు పియానో అంటే ఇష్టం. పియానో నేర్చుకుని ఏకంగా గ్రేడ్ 7 సరి్టఫికేట్ సాధించాడు. పియానో ఎంతబాగా వాయించగలడో చదరంగం అంతే బాగా ఆడగలడు. మానవ మేధస్సుకు కొలమానంగా చూసే ఇంటెలిజెంట్ కోషెంట్ (ఐక్యూ) పరీక్షలో ఏకంగా 162 స్కోర్ సాధించి ఔరా అనిపించాడు. ఇంతటి స్కోరు ప్రఖ్యాత భౌతిక శాస్తవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, విఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్‌కు కూడా సాధ్యపడకపోవడం విశేషం! ఈ అరుదైన ఫీట్‌తో క్రిష్ ప్రపంచంలోనే అత్యంత మేధావులైన ఒక శాతం మందిలో స్థానం సంపాదించాడని బ్రిటన్ వార్తాసంస్థ ‘మెట్రో’ పేర్కొంది. అత్యంత మేధావుల సంఘమైన ‘మెన్సా’లోనూ క్రిష్ చోటు సాధించాడు.బ్రిటన్‌లోనే అత్యుత్తమ బోధన ప్రమాణాలు పాటించే క్వీన్ ఎలిజబెత్ గ్రామర్ స్కూల్లో వచ్చే ఏడాది చేరబోతున్నాడు. ‘‘11వ క్లాస్ సిలబస్ చాలా ఈజీగా ఉంది. పై తరగతులు నా సామర్థ్యాలకు సవాళ్లు విసురుతాయనుకుంటా. ప్రైమరీ స్కూల్ బోర్ కొట్టింది. ఎప్పుడూ కూడికలు, తీసివేతలు, గుణింతాలు, వాక్య నిర్మాణాలే. ఇప్పుడిక బీజగణితం పట్టుబడతా’’ అని క్రిష్ నవ్వుతూ చెప్పాడు. క్రిష్ తండ్రి మౌళి, తల్లి నిశ్చల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నాలుగేళ్లప్పుడే తమవాడి అమోఘమైన జ్ఞాపకశక్తి, తెలివితేటలను గుర్తించామని వారు చెప్పారు. ‘‘నాలుగేళ్లకే అనర్గళంగా మాట్లాడేవాడు. తప్పుల్లేకుండా స్పెల్లింగులు చెప్పేవాడు. చక్కగా ఉచ్చరించేవాడు. ఓసారి నా పక్కన మూడు గంటలు కూర్చుని గణిత పుస్తకమంతా కంఠస్థం చేశాడు. ఏకసంథాగ్రాహి. నాలుగేళ్లకే దశాంశ స్థానాలకు లెక్కలు చేయడం మొదలెట్టి ఆశ్చర్యపరిచాడు. ఎనిమిదేళ్ల వయసులో ఒక ఏడాది సిలబస్‌ను ఒక్క రోజులో చదివేశాడు. ఏంచేసినా అత్యున్నత స్థాయి ప్రావీణ్యం చూపాలని ఆరాటపడతాడు’’ అని తల్లిదండ్రులు చెప్పారు.ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్‌లోనూ.. పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పట్టడం మాత్రమే కాదు సంగీతం అన్నా క్రిష్‌కు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పియానో నేర్చుకున్నాడు. పియానిస్ట్‌గా ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. పియానో వాయించడానికి సంబంధించి కేవలం ఆరు నెలల్లో నాలుగు గ్రేడ్లు పూర్తిచేశాడు. సంగీతానికి సంబంధించి అత్యున్నత కళాక్షేత్రంగా పేరొందిన ట్రినిటీ కాలేజ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యత్వం సాధించాడు. ప్రస్తుతం గ్రేడ్ 7 పియానో సరి్టఫికేట్ పొందాడు. తన కంటే వయసులో పెద్దవాళ్లతో పోటీపడుతూ వాళ్లను ఓడించి పతకాల పంట పండిస్తున్నాడు. వెస్ట్ లండన్‌లో ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. హిట్ సంగీతాన్ని వాయించేటప్పుడు చాలా మంది ఎదురుగా సంబంధిత నోట్‌ను రాసుకుంటారు. క్రిష్ ఎలాంటి నోట్ లేకుండానే అద్భుతంగా వాయించి ప్రేక్షకులు ప్రశంసలు పొందిన సందర్భాలు ఎన్నో. ‘‘ సంగీత పోటీల్లో నోట్స్ లేదని భయపడను. తప్పు చేయబోనని నాకు బాగా తెలుసు’’ అని క్రిష్ గతంలో చెప్పాడు. బాలమేధావి ‘యంగ్ షెల్డన్’ వెబ్ సిరీస్‌ను బాగా ఇష్టపడే క్రిష్ ఎక్కువగా పజిల్స్, పదవినోదం లాంటి వాటిని పరిష్కరించడం అలవాటు. చదరంగం మీద ఆసక్తి చూపడంతో ఒక టీచర్‌ను పురమాయించి నేరి్పంచారు. అయితే ఆ టీచర్నే తరచూ ఓడిస్తూ తన అద్భుత మేధను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు క్రిష్. – లండన్ -
జస్ట్ రూ. 150ల ప్రాజెక్టుతో నాసాకు, ఈ విద్యార్థి చాలా స్పెషల్!
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలుడు నాసాకి ఎంపికయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జస్ట్ అతడు చేసిన రూ. 150ల ప్రాజెక్టు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నిర్వహించే ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్ టీమ్‌లో సెలక్టయ్యేలా చేసింది. ఓ సాదాసీదా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటూ నాసాకి ఎంపికవ్వడమే కాకుండా తన అద్భుత మేధాతో అందర్నీ అబ్బురపరుస్తున్నాడు ఈ బాలుడు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీలోని చిన్నగ్రామమైన ఛాయ్సన్కు చెందిన 15 ఏళ్ల ఉత్కర్ష్ అనే బాలుడు నాసాకు వెళ్తున్నాడు. పదోవతరగతి చదువుతున్న ఈ ఉత్కర్ష్ జనవరిలో సైన్స్ పోటీల్లో పాల్గొన్నాడు. ఆ పోటీల్లో వివిధ పాఠశాల విద్యార్థులంతా సుమారు రూ. 25 వేల నుంచి లక్షలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ప్రిపేర్ చేస్తే, ఉత్కర్ష్ కేవలం రూ. 150ల ప్రాజెక్టుతో పాల్గొన్నాడు. అంతమంది విద్యార్థుల మందు నిలబడగలనా? అనుకున్న ఉత్కర్ష్ ..తన అద్భుత ప్రతిభతో తయారు చేసిన వైర్లెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అదికూడా తక్కువ మొత్తంలో ప్రాజెక్టుని ప్రజెంట్ చేయడంతో ఉత్కర్షని అంతా ప్రశంసలతో ముంచెత్తారు. అతడిలో ఉన్న ఆ అసాధారణ మేధస్సే నాసా హ్యుమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్(హెచ్‌ఈఆర్‌సీ) అని పిలిచే ఇంజనీర్ డిజైన్ ఛాలెంజ్ 2024లో పాల్గొనే కైజెల్ టీమ్‌లో ఉత్కర్షని భాగమయ్యేలా చేసింది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మానవ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులనే భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఇంజనీరింగ్ డిజైన్ ఛాలెంజ్‌ని నిర్వహిస్తుంది. ఆ రోవర్ ఛాలెంజ్‌లో ఉత్కర్ష్ తన బృందంతో కలసి పాల్గొననున్నాడు. ఈ ఛాలెంజ్ వచ్చే నెల ఏప్రిల్ 18 నుంచి 20, 2024 వరకు జరుగుతుంది. ఇక ఉత్కర్ష నేపథ్యం వచ్చేటప్పటికీ..ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. ఉత్కర్ష్ తన తాత సురేంద్ర సింగ్ చేసే వ్యవసాయ పనుల్లో సాయం చేస్తుంటాడు కూడా. చిన్నతనంలోనే ఉత్కర్ష్ బ్రెయిన్ హేమరేజ్కి గురయ్యి దాదాపు మూడు నెలలు వెంటిలేటర్ ఉన్నట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. "మృత్యముఖం నుంచి కాపడుకున్నా మా బిడ్డ ఈ రోజు ప్రతిష్టాత్మకమైన నాసా వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఎంపిక కావడం అన్నది మాకెంతో గర్వంగా ఉంది". అని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక ఉత్కర్ష్ తోపాటు పదోవతరగతి చదువుతున్న టౌరుకు చెందిన లోకేష్ కుమార్, గుహ, గురుగ్రామ్‌కి చెందిన పల్లవి, ఫరీదాబాద్‌కి చెందిన అరుణ్ కుమార్, పానిపట్ నుంచి రోహిత్ పాల్, నోయిడా నుంచి ఓమ్ తదితర విధ్యార్థులు ఎంపికయ్యారు. ఎంత్రీఎం ఫౌండేష్ ఈ వైఎంఆర్డీ టీమ కైజెల్కి మద్దతు ఇస్తుంది. నాసా నిర్వహించే ఈ ఇంజనీరింగ్ ఛాలెంజ్‌లో భారత్ తరుఫు నుంచి ఎనిమిది టీమ్‌లను ఎంపిక చేయగా, వాటిలో ఎన్జీవో మద్దతు గల జట్టే ఈ కైజెల్ టీమే. (చదవండి: స్నానమే ఆమెకు శాపం! చేసిందా..నరకమే..!) -
ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా?
రోటీలు లేదా చపాతీలు చేయడం అంటే అబ్బో పెద్దపని అనుకుంటాం. ఎందుకంటే పిండి కలపాలి కొద్దిసేపు నానివ్వాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి చక్కటి గుండ్రటి షేపులో చెయ్యడం కాల్చడం ఓ ఎత్తు. ఇక ఇంట్లో ఎక్కువ మంది జనం ఉంటే.. ఆ ఇల్లాలు వంటింట్లోనే గంటల తరబడి ఉండిపోవాల్సిందే. ఓ పట్టాన ఆ పని అవ్వదు. ఎవరైన సాయం చేస్తే ఓకే లేదంటే అంతే సంగతి. ఒకవేళ రోటీ మిషన్ ఏదైన ఉంటే సులువుగా అయిపోతుందనుకోండి. ఐతే అందరి వద్ద ఉండొచ్చు లేకపోవచ్చు. అలాంటప్పుడూ ఈ టెక్నిక్ ఫాలోకండి సులభంగా అయిపోతుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ వ్యక్తి గోధుమ పిండిని చక్కగా ముద్దగా కలుపుకోని తనకు కావాల్సిన రోటీల సైజులో ఉండలుగా చేసుకుని పక్కన పెట్టకున్నాడు. ఆ తర్వాత ఒక్కో పిండికి ఎక్కువ మొత్తంలో పొడి పిండి అంది పక్కకు ఉంచాడు. ఇక ఐదు గోధుమ పిండి ఉండల్ని ఒక దానిపై పెట్టి చక్కగా రోల్ చేస్తూ గుండ్రటి షేప్‌లోకి వచ్చేలా నైపుణ్యంగా చేశాడు. అయితే ఇక్కడ ఇలా అన్నింటిని ఒకేసారి చపాతీల్లా చేసినా అవేమీ అతుక్కోలేదు. చక్కటి ఒకేసారి ఐదు రోటీలు గుండ్రటీ షేప్‌లో వచ్చేశాయి. పైగా సెపరేట్‌గా చేసిన వాటిల్లా ఉన్నాయి కూడా. ఈ వీడియోని చేసినా నెటిజన్లు వాట్ ఏ జీనియస్ గురూ. భలే చేశావు అంటూ సదరు వ్యక్తిని ప్రశంసించగా, మరికొందరూ అలా అస్సలు కుదరదు అని కామెంట్ చేస్తున్నారు. అది వీడియో మాయ అని కూడా అంటున్నారు. అయితే ఇలా ఒకేసారి ఐదు రోటీలు చేయాలంటే మంచి స్కిల్ ఉంటేనే సాద్యం లేదంటే కష్టమే!. View this post on Instagram A post shared by Megha Singh🦋✨ (@hack_it_with_megha) (చదవండి: పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?) -
ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి!
ఆఫీస్ టైమ్‌లో చేసేపని కాస్త చాలెంజింగ్‌గా ఉంటే నిద్రకు అవకాశం ఉండదు. కానీ వర్క్‌లో ఎలాంటి చాలెంజ్ లేకుండా కూర్చొని చేసే కొన్ని పనుల్లో చాలాసార్లు నిద్ర వస్తూంటుంది. దాంతో ఉత్పాదకత తగ్గుతుంది. ఆఫీస్ టైమ్‌లో కొంతసేపు నిద్రపోవడానికి అవకాశమిస్తే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందని మెజార్టీ ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే జపాన్‌లో ఈ సంప్రదాయం ఉంది. పని బాగా చేయడానికి, అలసట నుంచి బయటపడేందుకు ఆఫీస్ అవర్స్‌లో కొద్ది సేపు నిద్రపోవడం ముఖ్యమని తాజాగా జీనియస్ కన్సల్టెంట్ సర్వేలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఆఫీస్ టైమ్‌లో న్యాప్ (కునుకు తీయడం) బ్రేక్ ఇవ్వడం ముఖ్యమని 94 శాతం మంది చెప్పారు. మూడు శాతం మంది మాత్రం ఇలాంటి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఆన్లైన్లో చేసిన ఈ సర్వేలో మొత్తం 1,207 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25–అక్టోబర్ 27 మధ్య ఈ సర్వే చేసినట్లు జీనియస్ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్, ఎఫ్ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, లాజిస్టిక్స్, మాన్యుఫాక్చరింగ్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఆఫీస్ అవర్స్‌లో కొంత సేపు నిద్రపోతే పని సామర్ధ్యం మెరుగవుతుందని 82 శాతం మంది చెప్పగా, 12 శాతం మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. రోజువారి పనిలో అలసట, ఆయాసం వంటివి ఎదుర్కొంటున్నామని 60 శాతం మంది చెప్పారు. మరో 27 శాతం మంది మాత్రం తమకు అలసట లేదని పేర్కొన్నారు. ఒక గంట పాటు పడుకోవడానికి టైమ్ ఇస్తే అదనపు అవర్స్‌లో పనిచేసేందుకు తమకు ఓకే అని 49 శాతం మంది వెల్లడించారు. కానీ 36 శాతం మంది మాత్రం ఈ ఆలోచన బాగోలేదన్నారు. జపాన్‌లో పాటించే ‘ఇనెమురి (ఆఫీస్ అవర్స్‌లో పడుకోవడం)’ విధానం మంచిదని, దాంతో ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవుతుందని 78 శాతం మంది పేర్కొన్నారు. ఆఫీస్ అయిపోయాక పడుకోవడానికి వీలు కలిపిస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుందని 64 శాతం మంది చెప్పగా, దీని వలన ఎటువంటి ఉపయోగం లేదని 21 శాతం మంది అన్నారు. ఇదీ చదవండి: రూ.55 వేలకోట్ల దావూద్ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే.. -
కుటుంబం మద్దతుతోనే ఉద్యోగంలో రాణింపు
ముంబై: ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం ఉద్యోగంపైనా పడుతుందని మెజారిటీ ఉద్యోగులు అంటున్నారు. ఇంట్లో సరిగ్గా లేని రోజు ఉద్యోగంలోనూ అదే మాదిరిగా ఉంటుందని జీనియస్ కన్సల్టెంట్స్ అనే మానవ వనరుల సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో మూడింట రెండొంతుల మంది చెప్పారు. చక్కని ఉద్యోగ/వృత్తి జీవితానికి, పనిలో ఉత్పాదకతకు కుటుంబం మద్దతు ఎంత ముఖ్యమో ఈ సర్వే గుర్తు చేసింది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు/అశాంతి అనేవి కార్యాలయంలో ఒత్తిడితో కూడిన వాతావరణానికి దారితీస్తాయని, ఫలితంగా సామర్థ్యం తగ్గిపోతుందని సర్వేలో 69 శాతం మంది చెప్పారు. ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య అంతర్గత అనుసంధానత ఉంటుందని, ఒక దాని ప్రభావం మరోదానిపై పడుతుందన్న అభిప్రాయం వినిపించింది. ఆగస్ట్ 20 నుంచి సెపె్టంబర్ 26 మధ్య 1,088 మంది వృత్తి నిపుణులను ప్రశ్నించి, జీనియస్ కన్సల్టెంట్స్ ఈ వివరాలు విడుదల చేసింది. బీఎఫ్ఎస్ఐ, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య, ఎఫ్ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్ఆర్ సేవలు, ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, లాజిస్టిక్స్, తయారీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా తదితర రంగాల్లో పనిచేసే వారు ఇందులో ఉన్నారు. నియమ రహితంగా, అస్తవ్యస్థంగా ఉండే వ్యక్తిగత జీవితం, పనిలోనూ అదే ధోరణికి దారితీస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. పనిలో వృత్తి నైపుణ్యాలు చూపించి, రాణించాలంటే.. వ్యక్తిగత జీవితం క్రమశిక్షణగా, నియమబద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ► కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుందని 70 శాతం మంది చెప్పారు. ► కుటుంబం మద్దతు ఉంటే పనిలో సామర్థ్యాల పెరుగుదలకు సాయపడుతుందని 15 శాతం మంది చెప్పారు. ఉద్యోగంలో ఎదుగుదలకు అనుకూలిస్తుందని 6 శాతం మంది తెలిపారు. ► పని ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఉండాలని 15 శాతం మంది చెప్పగా, పని ప్రాంతంలో గోప్యత అవసరమని 2 శాతం మంది పేర్కొన్నారు. ► మొత్తం మీద కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగంలో మెరుగ్గా రాణిస్తామని 71 శాతం మంది చెప్పారు. -
ఘనాపాటీలు! అసామాన్యమైన కళతో మతాబుల్లా వెలిగిపోతున్న చిచ్చరపిడుగులు!
సాధారణంగా పిల్లలు.. రేపటి కలలను కంటూ పెరుగుతారు. కానీ కొందరు పిల్లలు మాత్రం తమలోని కళలను బయపెడుతూ నేడే ఆ కలలను నిజం చేసుకుంటున్నారు. లక్ష్యాలు, విజయాలతో మతాబుల్లా వెలిగిపోతున్న ఆ చిచ్చరపిడుగులను పరిచయం చేసుకుందాం.. వాళ్లు సాధించిన ఘనతలేంటో తెలుసుకుందాం.. లిసిప్రియ కంగుజంమణిపూర్, బషిఖోంగ్ గ్రామంలో.. 2011లో పుట్టిన లిసిప్రియ.. ప్రపంచంలోనే అతి పిన్న పర్యావరణవేత్తల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన ఐదేళ్ల వయసు నుంచే గ్లోబల్ వార్మింగ్, నిరక్షరాస్యత వంటి సమస్యలపై గొంతెత్తింది. 2019లో స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి ‘వాతావరణ మార్పు సదస్సు’లో ప్రపంచ నాయకులతో మాట్లాడి మెప్పించింది. లిడియన్ నాదస్వరం తమిళ సంగీత దర్శకుడు వర్షన్ సతీష్ రెండో కుమారుడే ఈ లిడియన్ నాదస్వరం. సంగీతకారుడిగా, పియానిస్ట్‌గా, కీబోర్డ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న లిడియన్.. తన రెండేళ్ల వయసు నుంచి డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టాడు. 8 సంవత్సరాల వయస్సులో పియానో నేర్చుకున్నాడు. 2019లో తన 14వ ఏట.. అమెరికన్ టెలివిజన్ íసీబీఎస్ నిర్వహించిన టాలెంట్ షోలో రెండు పియానోలను ఒకేసారి అద్భుతంగా వాయించాడు. దానిలో విజేతగా నిలిచి.. 1 మిలియన్ ఫ్రైజ్ మనీ సాధించాడు. మొన్నటికి మొన్న కడప వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన 6 నెలల బాబు ప్రజ్వల్.. పలు జంతువులు, పండ్లు, వాహనాలు, నంబర్లు ఇలా చాలావాటిని గుర్తుపట్టి.. ఆశ్చర్యపరిచాడు. తన గ్రాహక శక్తితో ‘నోబుల్ వరల్డ్ రికార్డ్’ సాధించాడు. అలాగే హైదరాబాద్, మల్కాజిగిరికి చెందిన 8 నెలల పాప ఆద్యశ్రీ.. తన గ్రాహక శక్తితో నోబుల్æవరల్డ్ రికార్డ్‌లో తన పేరు నమోదు చేసుకుంది. సుమారు 300 ఫొటోలను, వస్తువులను గుర్తించగల ఆధ్య.. 30 దేశాల జాతీయ జెండాలను గుర్తించి ఈ రికార్డ్ సాధించింది. ఇలా ఎందరో పిల్లలు వయసుకు మించిన విజయాలతో దూసుకుపోతున్నారు. చరిత్ర సృష్టిస్తున్నారు. తనిష్క భూపతిరాజు ఆంధ్రప్రదేశ్, భీమవరానికి చెందిన తనిష్క.. తన ఆరేళ్ల వయసులోనే విల్లును ఎక్కుపెట్టి.. ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించింది. 16 నిమిషాల 50 సెకన్ల వ్యవధిలో 100 బాణాలను 40 సెంటీమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తాకేలా ఆర్చరీలో అద్భుతమైన ప్రతిభను చాటుకుంది. హర్పిత పాండియన్ వీరు చెన్నైకి చెందిన కవలలు. చిన్న వయసులోనే వ్యాపారవేత్తలుగా ఎదిగి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వీరు ‘స్పెల్లింగ్ బీ ట్విన్స్ ్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్మైండ్స్ అనే ఉఛీఖ్ఛీఛిజి కంపెనీని స్థాపించి.. ఎందరో విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇది ఆన్ లైన్ మౌఖిక స్పెల్లింగ్ బీ పోటీ. విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, వారి స్పెల్లింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి తర్ఫీదునిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ఈ ట్విన్స్.. తాము చేసిన విశేషకృషికి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 10కి పైగా దేశాల నుంచి వేల మంది విద్యార్థులు ఇందులో రిజిస్టర్ అవుతుంటారు. విజేతలుగా నిలుస్తుంటారు. అద్వైత్ కోలార్కర్ పుణేకి చెందిన అద్వైత్.. 8 నెలల వయసులోనే పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాడు. రెండేళ్లకే పుణేలోని ఆర్ట్2డే గ్యాలరీలో తన మొదటి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించాడు. ఇటీవల తను వేసిన ఒక పెయింటింగ్ 16,800 డాలర్లకు అమ్ముడు పోయింది. ఇప్పటి వరకూ అతడు వేసిన పెయింటింగ్స్ అన్నీ కలిపి.. 3,00,000 డాలర్లకు మించి అమ్ముడుపోయాయి. ఇప్పటికే 19కి పైగా సోలో ప్రదర్శనలు ఇచ్చి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. (చదవండి: చిన్నారులే నడుపుతున్న న్యూస్ చానెల్! వాళ్లే రిపోర్టింగ్, యాంకరింగ్..) -
చెఫ్ కాదు టెక్ జీనియస్!
కిషన్‌ని చూసినప్పుడు చాలామందికి అమెరికన్ ఇన్వెంటర్, ఇంజనీర్ చార్లెస్ కెటరింగ్ ఒకప్పుడు చెప్పిన మాట తప్పకుండా గుర్తుకు వస్తుంది. ‘ఇన్వెంటర్ అంటే చదువును మరీ సీరియస్‌గా తీసుకోని వ్యక్తి’ అంటాడు చార్లెస్ కెటరింగ్. అతడు నవ్వులాటకు అన్నాడో, సీరియస్‌గా అన్నాడో తెలియదుగానీ అస్సాంకు చెందిన కిషన్ చదువును సీరియస్‌గా తీసుకోలేదు. లక్ష్యాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. లక్ష్యం ఉన్న చోట క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయి. విజయానికి దారిచూపుతాయి. కిషన్ విషయంలోనూ ఇది నిజమైంది. ఒకప్పుడు ‘కిషన్ బగారియా’ అంటే పక్క గ్రామం వాళ్లకు కూడా తెలియదు. ఇప్పుడు అస్సాం మొత్తం సుపరిచితమైన పేరు....కిషన్ బగారియా. 26 సంవత్సరాల కిషన్ బగారియా సృష్టించిన ఆల్–ఇన్–వన్ యాప్ ‘టెక్స్.కామ్’ను అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఆటోమేటిక్ ఇంక్’ రూ. 416 కోట్లకు కొనుగోలు చేసింది...చెఫ్ కాదు టెక్ జీనియస్ అస్సాంలోని దిబ్రుగఢ్‌లో ఎనిమిది, అగ్రసేన్ అకాడమీలో తొమ్మిది, పదో క్లాస్ చదివాడు కిషన్. ఇంటర్నెట్ అతడి ప్రపంచంగా ఉండేది. రోజూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడమో, నేర్చుకోవడమో చేసేవాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే యాప్స్ తయారీపై ఆసక్తి చూపించడం మొదలు పెట్టాడు. తన వినోదం కోసం చిన్న చిన్న యాప్స్ తయారుచేసేవాడు. ‘వీడికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ప్రపంచంతో పనిలేదు’ అని నవ్వుతూ ఇతరులతో చెప్పేవాడు తండ్రి మహేంద్ర బగారియా. ‘ఎప్పుడు చూసినా కంప్యూటర్లో మునిగిపోయి కనిపిస్తావు. భవిష్యత్‌లో ఓ మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యం లేదా?’ అని ఒక సందర్భంలో బంధువు ఒకరు కిషన్‌ను అడిగాడు. ‘ఉద్యోగం చేయాలని లేదు. లక్ష్యం మాత్రం ఉంది’ అన్నాడు కిషన్.‘ఏమిటి అది?’ అని ఆసక్తిగా అడిగాడు బంధువు. ‘సొంతంగా కంపెనీ పెట్టాలనేది నా లక్ష్యం’ గంభీరంగా అన్నాడు కిషన్.బంధువుతో పాటు అక్కడ ఉన్న వాళ్లు అందరూ బిగ్గరగా నవ్వారు. అలా నవ్విన వాళ్లందరికీ కిషన్ ఇప్పుడు తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. మరో సందర్భంలో... ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రవర్తించకు. పగటికలల ప్రపంచం నుంచి బయటికి వచ్చేయ్. సొంతంగా కంపెనీ అంటే మాటలనుకున్నావా?’ అంటూ ఒకప్పుడు తనకు హైస్కూల్లో చదువు చెప్పిన టీచర్ మందలించాడు. ఇప్పుడు ఆ గురువు గారికి కిషన్ తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు! ‘డీల్ ఫైనలైజ్ కావడానికి మూడు నెలల సమయం పట్టింది. డీల్ ఓకే అయిన సందర్భంలో తట్టుకోలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇది కలా నిజమా! అనుకుంటూ ఒత్తిడికి గురయ్యాను. ఈ స్థితి నుంచి బయటపడడానికి కాస్త సమయం పట్టింది’ అంటాడు కిషన్. ‘మరి నెక్ట్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు కిషన్ ఇచ్చిన జవాబు... ‘టెక్ట్స్.కామ్‌పై మరింత పనిచేయాల్సి ఉంది. వర్క్ కంటిన్యూ అవుతుంది’ కిషన్ రూపొందించిన ‘ఆల్–ఇన్–వన్’ యాప్ ట్విట్టర్, వాట్సప్, ఐ మెసేజ్, సిగ్నల్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్... మొదలైన యాప్‌లను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులోకి తెస్తుంది. యూజర్ కమ్యూనికేషన్ ప్రక్రియను సులభతరం చేసే యాప్ ఇది. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
మీరు తెలివైన వాళ్లని ఫీల్ అవుతున్నారా? ఈ లక్షణాలు ఉన్నాయా మరి
అందరికీ తెలితేటలుంటాయి. కానీ ఐక్యూ ప్రకారం కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ తెలివితేటలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారిగా నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వాళ్లుగా గుర్తించాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తారు? మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? చెక్ చేసుకోండి.. ►వీళ్లు ఒక పనిపై గంటల సమయం దృష్టి కేంద్రీకరించగలరు. విషయం చిన్నదైనా వారి ఆలోచన మాత్రం పరిధికి మించి ఉంటుందట. ► ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ► దేన్నైనా ఓపెన్ మైండ్‌తో ఆలోచించేవారిలో ఐక్యూ కూడా ఎక్కువేనట. ► దేన్నైనా క్రియేటివ్‌గా, కొత్తగా ఆలోచిస్తారట. ► ఐక్యూ అధికంగా ఉండే వారు ఎక్కువగా సింగిల్‌గా ఉంటారట..వేరే వాళ్ల మీద ఆధారపడకుండా తమ సొంత ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు. ► బ్యాలెన్స్డ్ థింకింగ్, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఏ సందర్భంలో అయినా నిగ్రహం కోల్పోకుండా సెల్ఫ్ కంట్రోల్‌తో ఉంటారట. వీళ్లు ఎక్కువ మాట్లాడటం కంటే అవతలి వాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడతారు. ► తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. తొందరగా ఎవరితోనూ మాట్లాడరు, కలవరు. ►లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్‌ని సాధారణంగా తెలివైన వారుగా పరిగణిస్తారు. ► సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉంటారట. ► పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరిలొ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. -
''నువ్వెలా పుట్టావే మాకు.. బొత్తిగా తెలివితేటల్లేవు, మార్కులు రావు''
లాలస పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. లాలసకు చిన్నప్పటి నుంచీ మంచి మార్కులు వచ్చేవి కావు. దాంతో పేరెంట్స్ చాలా ఆందోళన చెందేవారు. స్కూళ్లు మాన్పించినా, ట్యూషన్లు పెట్టించినా లాలస మార్కుల్లో ఎలాంటి మార్పూ లేదు. దాంతో ‘నువ్వెలా పుట్టావే మాకు.. బొత్తిగా తెలివితేటల్లేవు, మార్కులు రావు’ అని విమర్శిస్తుండేవారు. ఇప్పుడు పదో తరగతిలో కూడా అవే మార్కులు వస్తే కష్టమని, స్నేహితుల సలహా మేరకు కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చారు. లాలస పేరెంట్స్‌తో మాట్లాడిన తర్వాత.. వారు ఫిక్స్డ్ మైండ్‌సెట్‌తో ఉన్నారని, లాలసపై కూడా అదే రుద్దారని అర్థమైంది. తెలివితేటలు, సామర్థ్యం పుట్టుకతో వస్తాయని, వాటిని ఎప్పటికీ అభివృద్ధి చేసుకోలేరని నమ్మడమే ఫిక్స్డ్ మైండ్‌సెట్. ఈ మైండ్‌సెట్ ఉన్నవారు ఒకట్రెండు సార్లు ఫెయిలయితే జీవితమంతా ఫెయిల్యూరేనని భావిస్తారు. ఇతరులు ఏమనుకుంటారోనని ఆందోళన చెందుతారు. పేరెంట్స్, టీచర్స్ ప్రభావమే ఎక్కువ పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే ప్రాథమిక రోల్ మోడల్స్. వాళ్లు నిరంతరం పేరెంట్స్‌ని గమనిస్తుంటారు. వారి నుంచి మాట, నడక, నడత, ఆలోచన, ప్రవర్తన నేర్చుకుంటారు. పిల్లలందరూ గ్రోత్ మైండ్‌సెట్‌తో, జీనియస్‌లు కాగల సామర్థ్యంతోనే పుడతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆసక్తిగా ఉంటారు. దాన్నుంచి వీలైనంత ఎక్కువ నేర్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో తప్పులు చేస్తారు.. విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్న పేరెంట్స్, టీచర్స్ వారిని తప్పుబడతారు, విమర్శిస్తారు, దండిస్తారు. దాంతో పిల్లలు కూడా అదే ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ని అడాప్ట్ చేసుకుంటారు. తమకు పుట్టుకతో తెలివితేటలు లేవని, వాటిని ఇప్పుడు పెంచుకోలేమని నమ్ముతారు, ఉన్నదానితో సర్దుకుపోతారు, కొత్త ప్రయత్నాలు ఆపేస్తారు. లాలాస విషయంలో జరిగింది అదే. ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ని అలవరచుకున్న లాలస తన వైఫల్యాలకు పేరెంట్స్‌ని, టీచర్స్ని, స్కూల్‌ని నిందిస్తోంది. పేరెంట్స్ కోరుకున్న మార్కులు సాధించడానికి షార్ట్‌కట్స్ అన్వేషిస్తోంది. మైండ్‌సెట్ మార్చుకోవచ్చు మన జీవితం మొత్తం మైండ్సెట్పైనే ఆధారపడి ఉంటుంది. ఒక పరాజయం ఎదురైనప్పుడు ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్నవారు బాధపడతారు, ఏడుస్తారు, డిప్రెషన్లో కూరుకుపోతారు. గ్రోత్ మైండ్‌సెట్ ఉన్నవారు ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్నవారు ఎప్పుడూ ఇతరుల ఆమోదం కోరతారు. మొబైల్ ఫోన్, మొబైల్ గేమ్స్ లాంటి చిన్న చిన్న విషయాల నుంచి ఆనందం పొందుతూ, దాంతోనే తృప్తిపడతారు. లాలస కూడా అదే చేస్తోంది. అయితే ఈ ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ని మార్చవచ్చని, మార్చుకోవచ్చని.. జీనియస్ మైండ్‌సెట్ లేదా గ్రోత్ మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకోవచ్చని ఆమె పేరెంట్స్‌కి వివరించాను. అయితే వెంటనే కౌన్సెలింగ్ మొదలుపెట్టమన్నారు. అది ఒకటి రెండు సెషన్ల కౌన్సెలింగ్‌తో జరిగే పనికాదని, కనీసం ఆరు నెలల పాటు కోచింగ్ అవసరం ఉంటుందని, అందులో పేరెంట్స్ కూడా పనిచేయాలని చెప్పాను. అందుకు వారు సంతోషంగా అంగీకరించారు. జీనియస్ మైండ్‌సెట్ సాధ్యమే జీనియస్ మైండ్‌సెట్ పుట్టుకతో రాదు, పేరెంట్స్ నుంచి నేర్చుకుంటారు. లేదా ప్రత్యేక శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. జీనియస్ మైండ్‌సెట్ ఉన్న పేరెంట్స్ తమ పిల్లలను ప్రతిదీ ప్రశ్నించమని, నేర్చుకోమని ప్రోత్సహిస్తారు. ఏది అవసరమో, ఏది కోరికో, ఏది తప్పో, ఏది ఒప్పో ఓపిగ్గా వివరిస్తారు. వైఫల్యాలకు తిట్టకుండా వాటి నుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలో, వాటిని సానుకూలంగా ఎలా మార్చుకోవచ్చో నేర్పిస్తారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా అలాంటి మైండ్‌సెట్‌నే అలవరచుకుంటారు. అందుకే ముందుగా పేరెంట్స్ తమ మైండ్‌సెట్ మార్చుకోవడం ద్వారా పిల్లల మైండ్‌సెట్‌ని మార్చవచ్చు. అలాంటి మైండ్‌సెట్ పేరెంట్స్‌కి కూడా సక్సెస్‌ని, సంతోషాన్ని అందిస్తుంది. జీనియస్ మైండ్‌సెట్ కావాలంటే.. పరిమితులన్నీ మనం సృష్టించుకున్నవేనని అర్థంచేసుకోవాలి, వాటిని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు. మీకు మీరు మాత్రమే పోటీ అని తెలుసుకోవాలి. పరీక్షల కోసం, మార్కుల కోసం కాకుండా లోతుగా అధ్యయనం చేయాలి. జీవితంలో ఎప్పుడూ విజయాలే ఉండవు, పరాజయాలు వస్తాయి. అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మీకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులతో కాలం గడపండి.. వారి నుంచి నేర్చుకోండి. ఏ విషయంలోనైనా మీ స్ట్రాటజీ పనిచేయకపోతే దాన్ని పక్కన పెట్టేసి కొత్త వ్యూహంతో ముందుకు సాగండి. --సైకాలజిస్ట్ విశేష్ -
యూఎస్‌కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి
అతనొక గొప్ప మేధావి. హార్వర్డ్ విశ్వవిద్యాలయం జీనియస్. మిచిగాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ డిగ్రీని పొందిన వ్యక్తి. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మ్యాథమెటిక్స్ ప్రోఫెసర్. చిన్నతనంలో పేలుళ్లకు సంబంధించిన అనేక ప్రయోగాలు చేశాడు. ఎన్నో బాంబులను తయారు చేయగల మేధస్సు అతని సొంతం. అలాంటి విజ్ఞాన వేత్త పారిశ్రామీకరణ, అభివృద్ధి పేర్లతో ప్రకృతిని నాశనం చేయడాన్ని సహించలేకపోయాడు. అందుకోసం ఎంచుకున్న మార్గం తప్పుకావచ్చునేమో గానీ అతను ఆలోచన విధానం మంచిదే. ప్రజలకు ప్రకృతిపట్ల అవగాన కలిగేలా చైతన్య పరచాలనుకునే క్రమంలో దారుణాలకు ఒడిగట్టి ఉగ్రవాదిగా ముద్రవేయించుకున్నాడు. ఆ క్రమంలో పోలీసులకు చిక్కి జైల్లోనే మగ్గి.. చివరికి అక్కడే కన్నుమూశాడు టెడ్ జాన్ కాజిన్స్కీ . అతనెవరూ ఏమిటా గాథ! అసలేం జరిగిందంటే..టెడ్ జాన్ కాజిన్స్కీ మాజీ గణితశాస్త్ర ప్రోఫెసర్, వక్రీకృత మేధావి. అతను 17 ఏళ్ల పాటు అమెరికాకు కునుకులేకుండా చేసి గడగడలాడించిన అమెరికన్ దేశీయ ఉగ్రవాది. కాజిన్స్కీ మే 22, 1942న చికాగోలో శ్రామిక రంగానికి చెందిన పోలిష్-అమెరికన్ తల్లిదండ్రులకు జన్మించాడు. అతను గణితాన్ని అభ్యసించి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ను గెలుచుకున్న గొప్ప జీనియస్. అంతేగాదు 1967లో మిచిగాన్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో డాక్టరల్ డిగ్రీని పొందాడు. ఆ తర్వాత బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మ్యాథమెటిక్స్ ప్రోఫెసర్‌గా ఉద్యోగం సంపాదించాడు. అక్కడే ప్రోఫెసర్‌గా కొన్నేళ్లు పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత 1971లో మోంటానాకు వెళ్లాడు. ఆ క్షణం నుంచే కాజిన్స్కీ జీవితంలో కీలక పరిణామాలు చోటుచేసుకోవడమే గాక పతనం వైపుకి అడుగులు వేశాడు. మోంటానాలో సుమారు వెయ్యి మందికి మించి జనాభా ఉండరు. ఐతే కాజిన్స్కీ ఆ మోంటానాలోనే కరెంట్, నీరు సదుపాయం లేని ఓ రిమోట్ ఏరియాలో భూమిని కొనుగోలు చూసి ఓ చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఉండటం ప్రారంభించాడు. అక్కడ తనలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి మరింతగా అభివృద్ధి పరుచుకునేందుకు ఏకాంతంగా గడపాలని నిశ్చయించుకున్నాడు. కానీ అందుకు విరుద్ధంగా అతని ఆలోచన తీరు మారిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న అడువులను పారిశ్రామీకరణ, అభివృద్ధి పేరుతో నాశనం చేయడం చూసి తీవ్రంగా కలత చెందాడు కాజిన్స్కీ. దీనికి ఎలాగైన ఫుల్స్టాప్ పెట్టించాలనుకున్నాడు. అందులో భాగంగా పర్యావరణ విధ్వంసానికి కారణమైన వ్యక్తులపై మెయిల్ బాంబు దాడులకు పాల్పడ్డాడు. ఎన్నో బాంబులు తయారు చేసి విధ్యంసం సృష్టించాడు. అలా కాజిన్స్కీ దాడిలో ముగ్గురు చనిపోగా, 23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఓ వాణిజ్య విమానాన్ని పేల్చేందుకు కూడా యత్నించాడు. అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టేషన్(ఎఫ్‌బీఐ)కి ఓ తలనొప్పిగా మారాడు. చిన్న క్లూ కూడా దొరక్కుండా దాడులకు యత్నించాడు. అతడిని పట్టుకోవడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఉండేది. ఈ బాంబు దాడులకు పాల్పడుతున్న కిల్లర్‌ని గుర్తించలేకపోవడంతో వారు ఆగంతుకుడికి అనాబాంబర్(యూనివర్సిటీ అండ్ ఎయిర్‌లైన్ బాంబర్) అని నామకరణం చేశారు. ఆఖరికి మీడియా సైతం ఆ పేరుతోనే వ్యవహరించడంతో కాజిన్స్కీకి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆ అనాబాంబర్ కోసం ఎఫ్‌బీఐ పడ్డ పాట్లు అంత ఇంత గాదు. ఐతే కాజిన్స్కీ అరెస్టు అవ్వడానికి ముందు సరిగ్గా 1995లో ది న్యూయార్క్ టైమ్స్‌కు ఒక లేఖ పంపాడు. దాదాపు 35 వేల పదాలతో కూడిన తన మ్యానిఫెస్టో(వ్యాసం) ప్రచురించినట్లయితే తాను ఉగ్రవాదాన్ని వదిలేస్తానని ప్రకటించాడు. దీంతో ఎఫ్‌బీఐ ఆ అగంతకుడు మ్యానిఫెస్టో(వ్యాసం)ని ప్రచురిస్తే.. అతడెవరనేది తెలిసే అవకాశం ఉంటుంది. అతను రాసే శైలిని ఎవరైన గుర్తిస్తే నిందితుడిని పట్టుకోవచ్చు అన్న ఆశతో ఎఫ్‌బీఐ ప్రచురించేందుకు సదరు పత్రికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వ్యాసంలో.. పారిశ్రామిక విప్లవం దాని పరిణామాలు మానవ జాతికి ఎలా ముప్పుగా మారాయి అనే అంశంతో ప్రారంభమైంది. అలాగే తాను తయారు చేసిన బాంబు దాడులు ఎంతలా విధ్వంసం సృష్టించగలవో కూడా వివరించాడు. అలాగే మానవుల ప్రకృతిని నాశనం చేసిన తనను తాను కోల్పోతున్నాడని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. అందువల్ల దీనిపై దృష్టిపై సారించడం అత్యంత కీలకమని ఆ వ్యాసంలో వివరించాడు. ఎఫ్‌బీఐ భావించినట్లుగానే ఆ వ్యాసం రాసిన శైలి ఆధారంగా ఆగంతకుడు ఎవరనేది కనుక్కోగలిగారు. కజిన్స్కీ సోదరుడు డేవిడ్ ఈ వ్యాసం శైలీ తీరును గుర్తించి ఎఫ్‌బీఐకి తెలిపాడు. అంతేగాదు కాజిన్స్కీకి 12 ఏళ్ల వయస్సులో పేలుళ్లను సృష్టించే పరిజ్ఞానం ఉందని చెప్పాడు. దీంతో ఎఫ్‌బీఐ 1996లో కాజిన్స్కీ అరెస్టు చేసింది. నేరం నుంచి తప్పించుకోవడానికి కాజిన్స్కీ తరుఫు న్యాయవాదులు పిచ్చివాడిగా నటించమన్నారు. అందుకు తిరస్కరించి..తాను చేసిన బాంబు దాడులకు సంబంధించిన అన్ని నేరాలను కోర్టు ఎదుట అంగీకరించాడు. దీంతో కాలిఫోర్నియా కోర్టు అతనికి నాలుగు జీవిత ఖైదుల తోపాటు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత కాజిన్స్కీని కొలరాడోలోని ఫ్లోరెన్స్‌లో సూపర్మాక్స్ జైలుకి తరలించారు అధికారులు. అక్కడే జైలు శిక్షను అనుభవిస్తూ 81 ఏళ్ల వయసులో మరణించాడు. ఈ మేరకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ ప్రతినిధి క్రిస్టీ బ్రెషెర్స్ శనివారమే కాజిన్స్కీ చనిపోయినట్లు ప్రకటించింది. కాజిన్స్కీ చెడు మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాడనేందుకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఒక సదుద్దేశం అతన్ని విధ్యసం వైపుకి అడుగులు వేసేలా చేయడం బాధకరం. --ఆర్ లక్ష్మీ లావణ్య , వెబ్ డెస్క్ (చదవండి: పరేడ్‌లో కుప్పకూలిన బ్రిటిష్ సైనికులు..వీడియో వైరల్) -
బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..!
Nation Wide Famous Child Prodigies: పసితనం వీడని చిన్నారులు వివిధ రంగాల్లో సాధిస్తున్న ఘనతకు ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే! ఏళ్లతరబడి సాధన చేసిన పెద్దలు సైతం సాధించలేని ఘనకార్యాలను కొందరు చిచ్చరపిడుగులు అలవోకగా ఇట్టే సాధిస్తూ, ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేస్తున్నారు. వివిధ రంగాల్లో విశేషప్రతిభతో రాణిస్తున్న కొందరు చిచ్చరపిడుగుల గురించి బాలల దినోత్సవం సందర్భంగా... మిలియన్ డాలర్ల ‘స్వర’ స్వరఘనత: లిడియన్ నాదస్వరం అత్యంత పిన్నవయసులోనే సంగీతంలో అంతర్జాతీయ స్థాయి ఘనత సాధించాడు లిడియన్ నాదస్వరం. తమిళ సంగీత దర్శకుడు వర్షన్ సతీష్ రెండో కొడుకైన లిడియన్ నాదస్వరం మాటలు వచ్చీరాని వయసులోనే సరిగమలతో చెలిమి ప్రారంభించాడు. రెండేళ్ల వయసులో లయ తప్పకుండా డ్రమ్స్ మోగించడం మొదలుపెట్టాడు. ఎనిమిదో ఏట తనంతట తానే పియానో వాయించడం నేర్చుకున్నాడు. లిడియన్ ఆసక్తి గమనించిన తండ్రి, అతడిని శిక్షణ కోసం మద్రాస్ మ్యూజికల్ అసోసియేషన్ డైరెక్టర్ అగస్టీన్ పాల్ వద్ద చేర్చాడు. అగస్టీన్ వద్ద శిక్షణ తర్వాత చెన్నైలో ఎ.ఆర్.రెహమాన్ నడుపుతున్న కె.ఎం.మ్యూజిక్ కన్జర్వేటరీలో చేరి, నాలుగేళ్లు సంగీత మర్మాలన్నింటినీ ఆపోశన పట్టాడు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ 2019లో తాను తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రంలో లిడియన్‌కు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. అప్పటికి లిడియన్ వయసు పద్నాలుగేళ్లే! అతి పిన్నవయస్కుడైన సినీ సంగీత దర్శకుడిగా రికార్డులకెక్కిన లిడియన్ ఘనతను అంతర్జాతీయ మీడియా కూడా గుర్తించింది. అమెరికాకు చెందిన సీబీఎస్ చానల్ నిర్వహించిన పోటీలో లిడియన్ ఉత్తమ సంగీతకారుడిగా మిలియన్ డాలర్ల (రూ.7.44 కోట్లు) బహుమతిని గెలుచుకున్నాడు. సంగీత ప్రధానంగా గత ఏడాది నిర్మించిన బాలీవుడ్ చిత్రం ‘అట్కన్–చట్కన్’లో లిడియన్ ఒక కీలకపాత్రలో నటించడం విశేషం. చదవండి: గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!! శాస్త్రీయ సంగీతంలో ప్రపంచస్థాయి ప్రదర్శనలు: రాహుల్ వెల్లాల్ నాలుగేళ్ల వయసులోనే సరిగమల సాధన మొదలుపెట్టిన రాహుల్ వెల్లాల్ ఘనత అంతర్జాతీయ వేదికల వరకు చేరుకుంది. ప్రధానంగా గాత్రకచేరీలే చేస్తున్నా, వాద్యసంగీత సాధన కూడా కొనసాగిస్తున్నాడు ఈ బెంగళూరు కుర్రాడు. తొలుత కళావతి అవధూత్ వద్ద కర్ణాటక సంగీతంలో స్వరాభ్యాసం చేసిన రాహుల్, తర్వాత కుల్లూర్ జయచంద్రరావు దగ్గర మృదంగం నేర్చుకున్నాడు. ప్రస్తుతం లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో పాశ్చాత్య సంగీతంలో పియానో వాద్యం నేర్చుకుంటున్నాడు. రాహుల్ వెల్లాల్ తన పదకొండేళ్ల వయసులోనే, 2018లో అబుదాబిలో తొలి అంతర్జాతీయ కచేరీ చేశాడు. అబుదాబితో పాటు ఇప్పటి వరకు సింగపూర్, నైజీరియా, మలేసియా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో పదుల సంఖ్యలో కచేరీలు చేశాడు. సంప్రదాయ సంగీతంలో రాహుల్ వెల్లాల్ సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 2018లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఫెలోషిప్ అందుకున్నాడు. ‘టాప్–100 గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీస్’లో ఒకరిగా, గత ఏడాది ఢిల్లీలో జరిగిన వేడుకలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు అందుకున్నాడు. బాల నలభీముడు: నిహాల్ రాజ్ సాధారణంగా పది పన్నెండేళ్ల వయసులో ఉన్న పిల్లలేం చేస్తారు? తల్లులు ఓపికగా వండిపెడితే, చక్కగా తినిపెడతారు. కేరళలోని కొచ్చికి చెందిన నిహాల్రాజ్కు తినడమే కాదు, రుచులొలికే వంటలు వండటమన్నా భలే ఇష్టం. నిహాల్ వయసు ఇప్పుడు పదకొండేళ్లు. ఐదేళ్ల వయసులోనే గరిటె తిప్పడం మొదలుపెట్టాడు. తన పాక ప్రావీణ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు యూట్యూబ్ చానల్ పెట్టి, పెద్దసంఖ్యలో సబ్స్క్రైబర్ల ఆదరణను సంపాదించుకున్నాడు. ‘యూట్యూబ్’లో ‘లిటిల్ షెఫ్ కిచ్చా’గా గుర్తింపు పొందిన ఈ బాల నలభీముడు అనతికాలంలోనే ప్రముఖ జాతీయ టీవీచానళ్ల దృష్టినీ ఆకర్షించాడు. పలు చానళ్లలో వంటల కార్యక్రమాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. సంప్రదాయ వంటకాలను తయారు చేయడమే కాదు, ఈ చిచ్చరపిడుగు ఎప్పటికప్పుడు కొత్తకొత్త వంటకాలనూ తయారు చేస్తుంటాడు. ఇతడు సృష్టించిన ‘మ్యాంగో మౌస్ ఐస్‌క్రీమ్’ బాగా పాపులరైంది. తన పాకప్రావీణ్యానికి గుర్తింపుగా గత ఏడాది ఢిల్లీలో జరిగిన వేడుకలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు కూడా అందుకున్నాడు. గూగుల్ బాయ్: కౌటిల్య పండిట్ సివిల్స్‌లాంటి పోటీ పరీక్షలను సాధించిన వారిని సైతం నివ్వెరపరచే పరిజ్ఞానం కౌటిల్య పండిట్ సొంతం. ఏ విషయానికి సంబంధించిన ప్రశ్నలు అడిగినా టకటకా సమాధానాలు చెప్పేస్తూ, ఐదేళ్ల వయసులోనే ‘గూగుల్ బాయ్’గా గుర్తింపు పొందాడు ఈ హర్యానా చిచ్చరపిడుగు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో అమితాబ్‌బచ్చన్‌ను సైతం అబ్బురపరచాడు. కేవలం తన తెలివితేటల ప్రదర్శనతోనే అంతర్జాతీయ టీవీ చానెళ్లనూ ఆకట్టుకున్నాడు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాల నుంచి ప్రత్యేక సత్కారాలు, బహుమతులు అందుకున్నాడు. హర్యానా అసెంబ్లీ ద్వారా ప్రత్యేక సత్కారం పొందిన ఏకైక బాలుడిగా రికార్డు సృష్టించాడు. కౌటిల్య పండిట్ పాండిత్యానికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన కాశీ విద్వత్ పరిషద్ ‘బాల మనీషి’ బిరుదుతో సత్కరించింది. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉండగా, ఈ చిచ్చరపిడుగును ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌కు పిలిపించుకుని, దాదాపు గంటసేపు రకరకాల శాస్త్ర అంశాలపై ఇతడితో మచ్చటించారు. ‘ఫోకస్ టీవీ’ ఎంపిక చేసిన ‘ఎలెవెన్ ఫోకస్ స్టార్స్’లో ఒకరిగా కౌటిల్య పండిట్‌ను ఎంపిక చేసింది. ఎందరో మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తల చేతుల మీదుగా లెక్కలేనన్ని అవార్డులు పొందిన ఈ పద్నాలుగేళ్ల బాలమేధావి గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్‘చైల్డ్ ప్రాడిజీ అవార్డును కూడా అందుకున్నాడు. రంగుల కళతో అంతర్జాతీయ గుర్తింపు: అద్వైత్ కోలార్కర్ ఏడాది నిండక ముందే కుంచెపట్టుకున్నాడు. ఊహ తెలిసీ తెలియని వయసుతో రంగులతోను, కుంచెతోను మొదలుపెట్టిన చెలిమి అద్వైత్ కోలార్కర్ను కళారంగంలో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. రంగులపై అద్వైత్ మమకారాన్ని గమనించిన తల్లిదండ్రులు అతడికి ఆటబొమ్మల బదులు రంగులు, కుంచెలు, కాన్వాస్‌లు కొనిచ్చారు. అప్పటి నుంచి రంగుల ప్రపంచమే అతడి లోకమైంది. ఆడుతూ పాడుతూ అలవోకగా కాన్వాస్‌లపై నైరూప్యచిత్రాలను చిత్రించేస్తాడు ఈ బాలకళాకారుడు. మిత్రుల సలహాతో అద్వైత్ తండ్రి అతడి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించి, ఆన్లైన్లో అతడి చిత్రాలను అమ్మడం ప్రారంభించాడు. ఆన్లైన్లో అతడి చిత్రాలు అనతి కాలంలోనే దేశదేశాలకు చేరడంతో, వివిధ దేశాల్లో జరిగే చిత్రకళా ప్రదర్శనలకు ఆహ్వానాలు రావడం మొదలైంది. అలా చిన్న వయసులోనే దేశదేశాలు తిరిగి చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్న అద్వైత్, అంతర్జాతీయ మీడియాకెక్కాడు. రెండేళ్ల వయసులోనే కెనడాలోని సెయింట్ జాన్ ఆర్ట్స్ సెంటర్లో సోలో ప్రదర్శన చేసిన అతి పిన్నవయస్కునిగా రికార్డు సృష్టించాడు. ఎనిమిదేళ్ల అద్వైత్ గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డును అందుకున్నాడు. బీబీసీ ఇతడిపై ప్రత్యేకంగా ‘ఆర్ట్ ప్రాడిజీ’ కార్యక్రమాన్ని రూపొందించి, ప్రసారం చేయడం విశేషం. చదరంగంలో చిచ్చరపిడుగు: పరీ సిన్హా చదరంగంలో చిచ్చరపిడుగు ఈ చిన్నారి. బుడిబుడి నడకల వయసులోనే చదరంగంలో నిష్ణాతుల ఆట కట్టించి వార్తలకెక్కింది. బిహార్ చెస్ అసోసియేషన్ 2013లో నిర్వహించిన అండర్–7 పోటీల్లో పాల్గొని, విజేతగా నిలిచింది పరీ సిన్హా. పోటీలో పాల్గొనే నాటికి ఆమె ఇంకా బడిలో కూడా చేరలేదు. అప్పటికి ఆమె వయసు మూడేళ్లు మాత్రమే! ఆ తర్వాత బిహార్ రాష్ట్ర చెస్ ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిచి, అతి పిన్నవయస్కురాలైన చదరంగ క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. పరీ సిన్హా బాబాయి వీల్ప్రకాశ్ సిన్హా జాతీయస్థాయి చదరంగం ఆటగాడు. ఆయనే చిన్నారి పరీకి చదరంగాన్ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఆమె చదరంగంలో మెలకువలను చకచకా నేర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో ఇప్పటికే తన సత్తా చాటుకుంది. చదరంగంలో ఆమె శుభేందు చక్రవర్తి వద్ద కోచింగ్ తీసుకుంటోంది. చదవండి: చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం! బాల వ్యాపారవేత్త: తిలక్ మెహతా దేశంలోనే అతి పిన్నవయస్కుడైన బాల వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు తిలక్ మెహతా. నాలుగేళ్ల కిందట– అంటే, తన పదేళ్ల వయసులో తిలక్ మెహతా సెలవుల్లో తన మేనమామ ఇంటికి వెళ్లాడు. సెలవుల్లో చదువుకోవడానికి పుస్తకాలు తీసుకురావడం మరచిపోయాడు. ‘మామా! స్కూలు పుస్తకాలు తెచ్చుకోవడం మరచిపోయాను. రేపటికల్లా ఇక్కడకు ఇంటి నుంచి కొరియర్లో తెప్పించుకోవడానికి వీలవుతుందా?’ అని అడిగాడు. ‘ఇవాళ్టికివాళే కొరియర్లో చేరుకోవడం సాధ్యం కాదు. రేపటికైతే చేరుతాయి గాని, కొరియర్ చార్జీ నీ పుస్తకాల ఖరీదు కంటే ఎక్కువే అవుతుంది’ అని బదులిచ్చాడు. మేనమామ సమాధానంతో తిలక్ ఆలోచనలో పడ్డాడు. ముంబై వాసులకు తక్కువ ఖర్చుతో కొరియర్ సేవలు ప్రారంభించగల అవకాశాలపై క్షుణ్ణంగా సమాచారాన్ని సేకరించాడు. చాలా లెక్కలు వేసుకున్నాడు. చివరకు ‘పేపర్ ఎన్ పార్సెల్’ యాప్ ప్రారంభించి, ముంబై డబ్బావాలాలతో కలసి కొరియర్ సర్వీస్ వ్యాపారం ప్రారంభించాడు. ఈ వ్యాపారానికి ముంబైవాసుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీనివల్ల డబ్బావాలాల ఆదాయం కూడా కొంత పెరిగింది. వ్యాపారరంగంలో రాణిస్తున్న తిలక్ మెహతా గత ఏడాది ఢిల్లీలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు అందుకున్నాడు. తబలా వాద్యంతో గిన్నిస్ రికార్డు: తృప్త్‌రాజ్ పాండ్యా బొమ్మలతో ఆటలాడుకునే వయసులో తబలాతో సావాసం మొదలుపెట్టాడు తృప్త్‌రాజ్ పాండ్యా. చిన్నప్పుడు అతడి తల్లి ఆటబొమ్మలతో పాటు ఒక చిన్న ఢోలక్‌ను కూడా తెచ్చిచ్చింది. చిన్నారి తృప్త్‌రాజ్ మిగిలిన బొమ్మలను వదిలేసి, ఢోలక్‌ను వాయించడం మొదలుపెట్టాడు. అతడి వాద్యంలోని లయను గమనించి, ఈసారి తబలానే కొనిచ్చారు తల్లిదండ్రులు. రెండేళ్ల వయసులోనే ముంబైలోని సోమయ్య కాలేజీలో తొలి తబలా కచేరీ చేశాడు. మూడేళ్ల వయసులో ముంబై ఆకాశవాణి కేంద్రం నుంచి లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. తర్వాత ముంబై దూరదర్శన్ కేంద్రంలోనూ తన తబలా వాద్య విన్యాసాన్ని ప్రదర్శించాడు. దీంతో అతి పిన్న వయస్కుడైన తబలా వాద్య కారుడిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. తృప్త్‌రాజ్ వాద్యాన్ని ఆలకించిన తబలా దిగ్గజం జాకిర్ హుస్సేన్ సహా హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ ఇక్బాల్ అహ్మద్‌ఖాన్ వంటి విద్వాంసులు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. పదిహేనేళ్ల తృప్త్‌రాజ్, దేశ విదేశాల్లో ఇప్పటికే వందలాది కచేరీలు చేశాడు. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
‘పుట్టుకతో ఎవరు జీనియస్‌లు కాలేరు’
న్యూఢిల్లీ: గణితం అంటే కొందరు విద్యార్థులకు విపరీతమైన ఫోబియా ఉంటుంది. కానీ అలాంటి గణిత సబ్జెక్ట్‌ను 21ఏళ్ల నీలకంఠ భాను ప్రకాశ్ కాలిక్యులేటర్ లేకుండానే లెక్కలను సునాయసంగా సాధిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మైండ్ స్పోర్ట్స్ ఒలంపియాడ్లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరుపున తొలి స్వర్ణం సాధించాడు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రకాశ్, స్టీఫన్ కాలేజీలో చదువుతున్నాడు. కాగా ప్రకాశ్ తన లెక్కల ప్రతిభతో ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా నాలుగు ప్రపంచ రికార్డులు, 50లిమ్కా రికార్డులు ప్రకాశ సాధించాడు. తన విజయంపై ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ స్పందిస్తూ.. తాను పుట్టుకతో జీనియస్‌ను కాదని, పుట్టుకతో ప్రతి మనిషికి గణిత తెలివితేటలు ఉంటాయని అన్నారు. గణితంలో రికార్డులు బద్దలు కొడుతున్న ప్రకాశ్‌ది హైదరాబాద్ కావడం విశేషం.తానే కాదు ఎవరు పుట్టుకతో జీనియస్‌లు కాలేరని అభిప్రాయపడ్డారు. తాను ఇన్ని అరుదైన రికార్డులు సాధించడానికి 15ఏళ్లు కష్టపడ్డానని తెలిపారు. కానీ దేశంలోని విద్యార్థులకు గణిత సబ్జెక్ట్‌ను సునాయసంగా అర్థమయ్యే గణిత ల్యాబ్స్‌ను ప్రవేశపెడతానని తెలిపారు. గణిత ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు సబ్జెక్ట్ సునాయసంగా అర్థమవ్వడమే కాకుండా గణితంపై ఇష్టం కలిగి మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. భారత దేశాన్ని గణితంలో అన్ని దేశాల కంటే ముందుంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఫిట్‌నెస్‌లో ఉస్సేన్ బోల్ట్ ప్రపంచానికి ఎలా స్పూర్తి కలిగించాడో, మానసిక నైపుణ్యాలు, మానవ మెదడు సామర్థ్యం తెలుసుకోవడానికి ప్రేరణ కలిగిస్తాయని నీలకంఠ భాను ప్రకాశ్ పేర్కొన్నారు. -
సోషల్ మీడియాలో విద్యాబాలన్ మార్కులు..
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లు తమ వ్యక్తిగత అభిరుచులను సోషల్ మీడియాలో పంచుకుంటు అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తన పదవ తరగతి మార్కులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన శకుంతలా దేవి బయోపిక్‌లో విద్యాబాలన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే తాను చదువులో జీనియస్‌ను కాదని, కానీ సంతృప్తికర మార్కులు వచ్చేవని తెలిపింది. తన పదవ తరగతి మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో 150 మార్కులకు గాను 125మార్కులు వచ్చావని, అన్ని సబ్జెక్ట్‌లను కలిపి పదవ తరగతిలో 82.42శాతం మార్కులు సాధించానని పేర్కొంది. మరోవైపు విద్యాబాలన్ తాను చూపెట్టినట్లుగానే అభిమానులు మ్యాథ్స్ మార్కులు చూపెట్టాలని సూచించారు. గణిత మేధావి శకుంతులా దేవీ తన గణిత ప్రతిభతో హ్యూమన్ కంప్యూటర్‌గా పేరు సంపాధించుకున్నారు. అయితే శకుంతలా దేవి జీవితాన్ని విద్యా బాలన్ గొప్పగా నటిస్తే అంజు మీనన్ దర్శకత్వం సినిమాను విపరీతంగా ఆకర్శించింది. హాస్యం, వ్యంగ్యం, తీవ్రమైన భావోద్వేగం ఉండే శకుంతలా దేవిగా పాత్రలో విద్యా బాలన్ నటన అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. చదవండి: ‘నేనెప్పుడూ ఓడిపోను.. గుర్తుపెట్టుకో’ -
ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తు..
- సైనికుల కవచ రోబో సృష్టి - అమెరికా, జపాన్ సరసన భారత్ ఆకాంక్ష - పదహారేళ్ల బాలుడి దేశభక్తి చెన్నై: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా భారత్ సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తత. కశ్మీర్లో చొరబాట్లు. భారత సైనిక శిబిరాలపై పాకిస్థాన్ ముష్కరుల ఆకస్మిక దాడులు. భారతమాత ముద్దుబిడ్డలైన సైనికుల ప్రాణాలకు నిరంతరం పొంచిఉన్న ముప్పు. దేశ ప్రజలు గుండెపై చేయివేసుకుని హాయిగా నిద్రపోతున్నారంటే సరిహద్దుల్లోని భారత సైనికులు ప్రాణాలు తెగించి రక్షణ కవచంగా నిలబడడమే. మరి ఈ సైనికులను కాపాడుకోవడం, ప్రాణరక్షణ కల్పించడం ఎలా. ఈ ఆలోచనలు ఒక పదహారేళ్ల బాలుడి మెదడును తొలిచేశాయి. దేశం మనకేమి ఇచ్చింది అనేదికాదు, మనం దేశానికి ఏమి ఇచ్చామని ప్రశ్నించుకుంది ఆ బాలుని హృదయం. శత్రుదేశాల సైనికుల, ముష్కరుల చేతుల్లో భారత సైనికుల ప్రాణాలు పోకుండా ఏమీ చేయవచ్చు అని ఆలోచించాడు. ఆ దిశగా సాగిన అతని ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. భిన్నమైన రోబోల వినియోగించడం ద్వారా భారత సైనికుల ప్రాణాలను కాపాడవచ్చు అంటున్నాడు చెన్నైకి చెందిన తిరుమురుగన్ అనే బాల మేధావి. ప్రస్తుతం ప్లస్‌టూ చదువులోనే సైనికులకు రక్షణ కవచం లాంటి మోడల్ రోబోను తయారుచేసి ఉపాధ్యాయులచే శభాష్ అనిపించుకున్నాడు. ఏ పువ్వులో ఎటువంటి పరిమళం దాగి ఉంటుందో అన్నట్లుగా ఏ చిన్నారి మదిలో ఎంతటి ఉన్నతభావాలు నిగూఢమై ఉంటాయో అని అందరూ అచ్చెరువొందేలా ఎదిగాడు తిరుమురుగన్. తండ్రి గోపాలకృష్ణ దుబాయ్‌లో డ్రైవర్ ఉద్యోగం చేస్తూ చెన్నైలోని భార్య సెల్వి, కుమారుడు తిరుమురుగన్, కుమార్తెకు నెలకింతని పంపే డబ్బే ఆ కుటుంబానికి ఆధారం. ఆర్థికంగా చిన్నకుటుంబమైనా తిరుమురుగన్ ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తున తిరుగుతుంటాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలుడు పెద్ద మేధావి అనిపించుకున్నాడు. మూడో తరగతిలో బ్యాటరీ కారును తయారు చేసి తనలోని శాస్త్రవేత్తను బయటపెట్టాడు. 6వ తరగతిలో బహుళ ప్రయోజనాల రోబోను తయారుచేశాడు. గోడ తగలకుండా వెనక్కుతిరగడం, ఒక బ్లాక్‌లైన్ గీస్తే అందులోనే తిరగడం, గుంటలో పడకుండా వెనక్కురావడం వంటి లక్షణాలను ఈ రోబో కలిగి ఉంటుంది. రోడ్డు, నీళ్లలో ప్రయాణించే సబ్మెర్సిబుల్ కారును 8వ తరగతిలో తయారుచేశాడు. ఇంట్లోలోనే కూర్చుని కంప్యూటర్ ద్వారా వీక్షిస్తూ రిమోట్, ఫోన్ సందేశాలతో పొలం పనులు నిర్వహించే రోబోను 9వ తరగతిలో సిద్ధం చేశాడు. తగిన సందేశాలు ఇస్తే ఈ రోబో భూమిని దున్ని, విత్తనాలు చల్లి, మళ్లీ మట్టికప్పుతుంది. మనుషులు ప్రవేశించలేని మ్యాన్‌హోళ్లలోకి ప్రవేశించి అక్కడి వస్తువు, మనుషులను గుర్తించగల ‘సై ప్బోట్’ ను అదే ఏడాది తయారుచేశాడు. అలాగే ఆ బాలుడు సిద్ధం చేసిన మరో రోబో ఇంట్లోని పసిపాప ఏడిస్తే వెంటనే స్పందిస్తుంది. ఏడుపు శబ్దాన్ని గ్రహిస్తూ నెట్టుకుంటూ పాప వద్దకు వెళ్లి జోలపాటను తనకు తానే ఆన్ చేసుకుంటుంది. ఈరోబో మేథమేటిక్స్ చేస్తుంది. సైనిక సేవల దిశగా... తిరుమురుగన్ బాలమేధావిగా అనేక ప్రయోజనాలు కలిగిన రోబోలను తయారు చేస్తున్న నాకు దేశానికి సేవచేసే రోబోను తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. రోబోకు సంబంధించిన వార్తలను నెట్లో ఆసక్తిగా పరిశీలించడం నాకు అలవాటు. ఈ సమయంలో జపాన్ దేశం జైంట్ సైనిక రోబోను తయారు చేసిన వార్తను చదివాను. శాస్త్ర, సాంకేతికరంగాల్లో అగ్రస్థానంలో ఉన్న జపాన్ 12 అడుగుల జైంట్రోబోను తయారు చేయడంతో సరిపెట్టక ఇతర దేశాలకు సవాల్ విసిరింది. యూఎస్ జపాన్ సవాలును స్వీకరించి 15 అడుగుల రోబోను తయారుచేసేందుకు సిద్ధమయ్యారు. యూఎస్ రోబోను ఈ ఏడాది ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జైంట్ రోబోల తయారీలో ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఈ రెండు దేశాలు మాత్రమే ఉన్నాయి. జపాన్ సవాలును ఒక భారతీయ పౌరుడిగా నేను స్వీకరించాను. యుద్ధ సైనికులు వాడగల తన 13 అడుగుల జైంట్ రోబోతో జపాన్ సరసన భారత్‌ను నిలబెట్టాలని నా కల. భారత్‌లో ఇంత వరకు 4 లేదా ఐదు అడుగుల రోబోలే గానీ జైంట్ రోబోను తయారు చేసినవారు లేరు. జపాన్, యూఎస్‌ల మధ్యన నెలకొన్న పోటీలో మనమెందుకు పాల్గొనగ కూడదనే ఉద్దేశంతో ఈ జైంట్ రోబోను తయారు చేశాను. సరిహద్దుల్లో మన సైనికులు శత్రుదేశాల ముష్కరుల దొంగదాడుల్లో అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వారి భార్య, పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఈ దారుణానికి సైనిక రోబోతో అడ్డుకట్టవేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన వెంటనే కార్యరూపం దాల్చింది. నేను తయారుచేసిన జైంట్రోబో 13 అడుగుల ఎత్తు, 500 నుంచి 600 కిలోల బరువు ఉంటుంది. రోబో ప్రయాణానికి మోటార్ సైకిల్ ఇంజిన్, టైర్లను వినియోగించాను. బాడీని ప్లైవుడ్‌తో చేశాను. రోబో లోపల రెండు కంపార్టుమెంట్ల అమరిక ఉంటుంది. అందులో ఇద్దరు సైనికులు అభిముఖంగా ఉంటారు. వారిలో ఒకరు రోబోను నడిపించే డ్రైవర్. మరొకరు వెపన్స్ ఆపరేటర్. బైక్ తరహాలో ఈరోబోను నడిపించవచ్చు. లోపల ఒక బటన్ ఉంటుంది. సైనికులు లోపలికి వెళ్లగానే ఆ బటన్‌నొక్కితే రోబో 13 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. రోబోకు ముందువైపున గన్‌మెన్, వెనుకవైపున డ్రైవర్ ఉంటాడు. రోబోకు నలువైపులా అమర్చిన ఆరు కెమెరాలను అనుసంధానం చేసిన ల్యాప్‌టాప్ గన్‌మెన్ వద్ద ఉంటుంది. శత్రువుల రాకను ల్యాప్‌టాప్‌లో చూస్తూ ఎదుర్కొంటాడు. అలాగే డ్రైవర్ వద్ద ఉండే స్క్రీన్‌పై పరిసరాలను గమనిస్తూ రోబోను నడిపిస్తాడు. నేను ఆశించిన విధంగా 13 అడుగుల జైంట్ రోబో తయారైంది. నా గురువులు ఎంతో మెచ్చుకున్నారు. వారి ద్వారా అధికారిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాను. దేశ సరిహద్దుల్లో జవాన్లు వాడుకునే బుల్లెట్ ఫ్రూఫ్ మెటల్‌తో తయారు చేయాల్సి ఉంటుంది. యూఎస్ వారు తన రోబోను క్రీడా వినియోగానికి తయారుచేస్తున్నారు. జపాన్ వారు మిలిటరీ, క్రీడా వినియోగానికి అనుగుణంగా తయారు చేశారు. ఈ ఆసక్తి ఎలా కలిగింది అనే ప్రశ్నకు...నాన్న నా చిన్నప్పుడు టీవీ, డీవీడీలు రిపేరు చేస్తూంటే చూసేవాడిని, బ్యాటరీ లైటుకు పెడితే వెలుగుతుంది, అదే బ్యాటరీ మోటార్‌కు పెడితే పరుగులు తీస్తుంది ఇలా ఆలోచిస్తూ ఈ ప్రయోగాలన్నీ చేశాను అన్నాడు. మురుగన్ సాధించిన అవార్డులు: 8వ తరగతిలో (2012) సైన్స్ ఎగ్జిబిషన్లో టాప్–10లో ఎంపిక, రూ.2వేల నగదు బహుమతి. 9వ తరగతిలో వ్యవసాయ రోబోకు మొదటి బహుమతి. లైన్ఫాలోయర్ వెహికల్‌కు మొదటి బహుమతి. దేవాంగుల కోసం తయారుచేసిన పొల్యూషన్ ఫ్రీ వెహికల్‌కు ఫస్ట్ ప్రైజ్. వేలూరు విట్ యూనివర్సిటీవారు నిర్వహించిన జాతీయస్థాయి సైన్స్ పోటీల్లో 3వ స్థానంతోపాటు రూ.7వేల నగదు బహుమతి. 10వ తరగతిలో యంగ్ సైంటిస్టు అవార్డు. కడుపు మాడ్చుకుని సహకారం: సెల్వి నా భర్త నెలకు రూ.20వేలు పంపుతాడు. ఈ డబ్బుతోనే మా కుటుంబం బతకాలి. ఇద్దరి పిల్లల చదువులు, ఇంటిబాడుగ కుటుంబ అవసరాలకే ఆ డబ్బు చాలడం లేదు. నా కొడుకులోని ఆసక్తిని గమనించి కడుపుమాడ్చుకుని ప్రోత్సహిస్తున్నాను. నాబిడ్డ రకరకాల ప్రయోగాలకు నెలకు కనీసం రూ.5వేలు ఖర్చు అవుతుంది. తల్లిగా ప్రోత్సహిస్తే పెద్ద శాస్త్రవేత్త అవుతాడని ఆశ. ఎంతో నమ్మకం. సైనిక రోబో తయారీకి అవసరమైన డబ్బును సమకూర్చలేక పోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ‘అజంతా’ శంకరావు రూ.20 వేల ఆర్థిక సహకారం చేసి ప్రోత్సహిచండం వల్ల దానిని పూర్తి చేయగలిగాడు. మరింత ఆర్థిక సహకారం అందితే ఈ పేదింటి బిడ్డ గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవ చేయగలడు. నా బిడ్డను ప్రోత్సహించాల్సిందిగా పెద్ద మనస్సున్న దాతలను ప్రార్థిస్తున్నాను. నా ఫోన్ నంబర్..9790958697. -
పెద్ద చిన్ని...!
ఒకటా.. రెండా.. మూడా... అన్నీ పెద్ద సినిమాలే... స్క్రీన్ మీద పడితే బాంబుల్లా పేలాయ్... ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాయ్... అంత పెద్ద సినిమాలు రాసింది చిన్నికృష్ణ... మరి అలాంటి పెద్ద రైటర్ చిన్నబోయాడు ఎందుకు? పెద్ద కథ వెనక ఓ చిన్ని గాథ... ♦ ‘నరసింహనాయుడు’ (2001)తో రైటర్‌గా ఎంటరై, ఈ పదిహేనేళ్లల్లో జస్ట్ ఐదు సినిమాలే చేశారేం? 2002లో ‘ఇంద్ర’, 2003లో ‘గంగోత్రి’, 2011లో ‘బద్రినాథ్’, 2012లో ‘జీనియస్’ చేశా. ఆమిర్‌ఖాన్‌తో వర్క్ చేయాలనేది నా జీవితాశయం. ‘జీనియస్’ తర్వాత ఆమిర్ కోసం స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రాయడం మొదలుపెడితే మూడేళ్లు పట్టింది. లాస్ట్ ఇయర్ పూర్తి చేశా. హిందీ వాళ్ల తో డైలాగ్స్ రాయించా. వచ్చే నెల్లో ఆమిర్‌కి సబ్మిట్ చేస్తా. ♦ నరసింహనాయుడు, ఇంద్ర.. ఇలా మీరిచ్చినవన్నీ మామూలు కథలు కాదు. అసలా కథలకు ఇన్స్పిరేషన్ ఏంటి? నేను గాడ్ బిలీవర్ని. ఉదయం నిద్ర లేచాక మంచం మీద నుంచి కాలు కింద పెట్టేటప్పుడు నా భారాన్ని మోసే భూదేవిని క్షమించమని అడుగుతాను. నిద్రపోయే ముందు దేవుణ్ణి ప్రార్థిస్తా. దేవుడి ఇన్ఫ్లూయన్స్, నేచర్ ఇన్ఫ్లూయన్స్ లేకుండా నాకు స్క్రిప్ట్ రాయడం అనేది రాదు. రాసే ప్రతి అక్షరం నేను రాశానని ఎప్పుడూ ఫీల్ కాలేదు. ఆ భగవంతుడే, ఆ అమ్మవారే రాయిస్తున్నారు. ♦ మధ్య మధ్యలో మీ కెరీర్లో వచ్చే బ్రేక్స్‌కి కారణం ఏంటి.. ఎవరూ అవకాశాలు ఇవ్వడంలేదా? అవకాశాలు రాలేదు అనేది లేదు. ప్రతి నెలా ఎవరో ఒక నిర్మాత వస్తారు. ఇంతకు ముందు పని చేసిన హీరోల నుంచి పిలుపులు వస్తూనే ఉన్నాయి. చిరంజీవిగారి 150వ సినిమా నేనే చేయవలసింది. వాళ్లు కోరిన మీదట గ్రాండి యర్‌గా ఓ కథ రెడీ చేశాను. కానీ, చిరంజీవిగారు ‘కత్తి’ రీమేక్ చేయాలనుకున్నారు. నా కథ కంటే ‘కత్తి’ బాగుందనుకున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పిన మేటర్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చెప్పలేదు. అది నా నమ్మకం. చిరంజీవిగారు నమ్మాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకూ నా జడ్జ్మెంట్ ఫ్లాప్ కాలేదు. నేను డెలివర్ చేసిన ఏ గూడ్స్ (సినిమాలు)నీ ప్రేక్షకులు రిజెక్ట్ చేయలేదు. ఆ క్లారిటీ నాకుంది. ♦చిరంజీవిగారికి ‘ఇంద్ర’లాంటి హిట్ స్టోరీ ఇచ్చారు. ఇప్పుడు మీ కథను నమ్మలేదంటే..? నేను చెప్పింది ఆయన అంగీకరించలేదని చెడుగా మాట్లాడితే నేను క్రియేటర్‌నే కాదు. అది చిరంజీవిగారి వ్యక్తిగత నిర్ణయం. దట్సాల్. సినిమా వాళ్లందరూ కష్టపడేది ప్రేక్షకుడి కోసమే. నూన్ షో తర్వాత ప్రేక్షకుడు డిసైడ్ చేసే వరకూ ఎవరూ మాస్టర్స్ కాదు. రిలీజ్‌కి ముందే రిజల్ట్ చెప్పేమాస్టర్స్ ఎవరైనా ఉంటే దేవుడితో సమానం. తమిళ ‘కత్తి’ చూశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ♦రైటర్స్ ఎంత రాసినా స్క్రీన్ మీద కనిపించే హీరోనే ఆరాధిస్తారు.. దీనికి మీరేమంటారు? నాకు చిన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు ఇష్టం. సంక్రాంతి, శివరాత్రి అప్పుడు ఎన్టీఆర్, ఏయన్నాఆర్ గార్లలా గెటప్స్ వేసుకుని కొందరు డ్యాన్సులు చేసేవాళ్లు. అప్పటివరకూ అదే వ్యక్తులు బీడీ తాగుతూ కనిపించేవాళ్లు. ఏమీ అనిపించేది కాదు. మేకప్ వేసుకుని స్టేజి మీద డ్యాన్సులు చేస్తుంటే చప్పట్లు కొట్టేవాళ్లం. ఎందుకంటే అక్కడ ఉన్నదీ, స్క్రీన్ మీద కనిపించేదీనటుడు. నటుడికున్న వేల్యూ అది. గత జన్మలో మినిమమ్ వంద గుళ్లు కట్టిస్తే.. ఈ జన్మలో ఆర్టిస్ట్‌లు అవుతారని నమ్ముతా. దటీజ్ స్టార్డమ్. ♦స్టార్డమ్ గురించి గొప్పగా చెప్పారు.. మరి ఆ స్టార్స్ దగ్గరకు మీరే వెళ్లి కథలు చెప్పడానికి ఎందుకు మొహమాటం? మొహమాటం కాదు. ‘నరసింహనాయుడు’లో ఓ డైలాగ్ ఉంటుంది. ‘కళామతల్లి అనేది సరస్వతి అమ్మవారితో సమానం. కళ దగ్గరికి మీ అమ్మాయి రావాలి గానీ, మీ అమ్మాయి దగ్గరికి కళ రాదు’. ఈ డైలాగ్ నేనే రాశాను. రియల్ లైఫ్‌లో దాన్నే ఇంప్లిమెంట్ చేస్తాను. ♦ రామ్‌చరణ్ డెబ్యూ మూవీ కోసం ‘పూరీ జగన్నాథ్’ అని కథ రాశారట. రియల్ పూరీ జగన్నాథ్ (దర్శకుడు) ఎంటర్ కాగానే ఆ సినిమా మీ చేతుల్లోంచి తీసేసుకున్నారట? కథ రాశాను. క్లైమాక్స్ అందరికీ బాగా నచ్చింది. అప్పుడు చిన్నికృష్ణ రైటర్, పూరీ జగన్నాథ్ డెరైక్టర్. రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూరీగారు తెలుగులో వన్నాఫ్ ది రెస్పెక్టబుల్ రైటర్స్. వెరీ గుడ్ ఫిలాసఫికల్ రైటర్. నా కథ ఓకే చేసిన తర్వాత ‘పోకిరి’ అనే సినిమా విడుదలై, ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. సో, అతనితో వెళ్లడం కరెక్టే. నా కొడుకు హీరో అవుతున్నా.. నేనూ అదే నిర్ణయం తీసుకుంటా. ఓ రచయిత కథ కంటే.. మహేశ్‌బాబుతో పెద్ద హిట్టిచ్చిన ఓ రైటర్ కమ్ డెరైక్టర్‌తో వెళ్లడంలో తప్పు లేదు. ♦మీ దగ్గర ఉన్న కథల గురించి చెబితే తప్పేంటి? నేను రాస్తానని అందరికీ తెలుసు కదా. కొందరు బిచ్చగాళ్లు గంగిరెద్దులతో అడుక్కోవడానికి వస్తుంటారు. చిన్నికృష్ణ ఆల్రెడీ ఓ గంగిరెద్దులా అడుక్కుని, ఓ హిట్ ఇచ్చాడని తెలుసు కదా. నాకు మళ్లీ గంగిరెద్దు వేషం ఎందుకు? నేనిక్కడే (హైదరాబాద్) ఉంటున్నానని తెలుసు. నా ఇంటి గృహప్రవేశానికి కూడా వచ్చారు. గత పదిహేనేళ్లుగా నా ఫోన్ నంబర్ మారలేదనీ తెలుసు కదా. ♦ఇలా మాట్లాడతారు కాబట్టే, కొంతమంది మిమ్మల్ని ‘హైట్స్ ఆఫ్ ఈగోకి కేరాఫ్ అడ్రస్ చిన్నికృష్ణ’ అని అంటుంటారు.. గుడ్ క్రెడిట్. ఆఫీసు రూముల్లోనో, బెడ్‌రూమ్‌లోనో అనుకోకుండా ఏదైనా అవార్డు వేడుకలో ‘అండ్ ది హైట్స్ ఆఫ్ ఈగోకి కేరాఫ్ అడ్రస్ అవార్డ్ ఫర్ 2016 గోస్ టు చిన్నికృష్ణ’ అని బహిరంగంగా అవార్డు ఇస్తే ఆనందపడతా. అది మంచి క్రెడిట్. నన్ను ఈగోయిస్ట్ అనడం వల్ల వాళ్లకు ఆనందం దక్కుతోందంటే కాదనడానికి నేనెవర్ని? ♦తారాచౌదరి విషయంలో మీపై విమర్శలు వచ్చాయి కదా.. పాపం.. ఆ అమ్మాయి కొంచెం మెంటల్లీ ఇన్‌బ్యాలెన్స్. ఆ తర్వాత చాలాసార్లు అరెస్ట్ అయ్యింది. ఓ బాధ్యత గల వ్యక్తిగా, ఓ సోదరుడిగా ఆ అమ్మాయికి మ్యారేజ్ అయి లైఫ్‌లో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. నాకా అమ్మాయి మీద కోపం లేదు. ♦మీ మీద వచ్చే కాంట్రవర్శీస్ గురించి మీరేమంటారు? ఐశ్వర్యా రాయ్‌తో అభిషేక్ బచ్చన్ పెళ్లి జరుగుతోంటే ‘నాకు ఇతను కడుపు చేశాడు’ అని ఓ అమ్మాయి వస్తుంది. ఇలాంటి గాసిప్స్ సినిమావాళ్లకు కామన్. టీవీలో 10 సెకన్ల యాడ్ ఇవ్వాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఏ ఖర్చూ లేకుండా వార్త వచ్చినప్పుడు ఫ్రెండ్స్‌తో కూర్చుని నవ్వుకుంటా. టీవీ వాళ్లకీ రేటింగ్ బాగుంటుంది. ♦యాడ్ పాజిటివ్‌గా ఉంటే ఓకే.. మీ మీద వచ్చేవి నెగిటివ్...? (ప్రశ్న పూర్తి కాకముందే..) యాడ్ నెగిటివ్‌గా ఉంటేనే బాగుంటుంది. ‘చిన్నికృష్ణ 200 మందికి అన్నదానం చేశాడు’ అంటే, దాని గురించి రాయరు, చూపించరు. ‘చిన్నికృష్ణ ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు. ఆ అమ్మా యి తప్పించుకుంది. ఓ సీసీ కెమేరాలో దొరికాడు’ అంటే రేటింగ్ ఎంత ఉంటుందో చూడండి. మీడియాలో నెగిటివ్ ఎనర్జీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దేన్ పాజిటివ్ ఎనర్జీ. ♦జనరల్‌గా గ్యాప్ వచ్చినప్పుడు ‘వీళ్లు ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారా? ఇప్పటి తరానికి కావల్సినది ఇవ్వగలుగుతారా?’ అనే సందేహం ఉంటుంది.. మరి.. మీ కథలు? ఆర్టిస్టులకి రిటైర్మెంట్ ఉంటుంది కానీ, రైటర్స్‌కి రిటైర్మెంట్ ఉండదు. ఆ మధ్య ఓ పెద్ద నిర్మాతను కలిశా. ఆయన పేరు కేయస్ రామారావు. ఆయన తారక్‌కి (ఎన్టీఆర్) కథ ఇవ్వాలన్నారు. అలా అంటూనే... ‘‘ఇప్పుడున్న హీరోలందరూ మంచి యంగ్‌స్టర్ స్క్రిప్ట్స్ ఇష్టపడుతున్నారు. మీరు, విజయేంద్రప్రసాద్‌గారు.. ఓల్డ్ స్మెల్ కదా’’ అన్నారు. పాపం ఆయనది తప్పు కాదు. రామారావుగారికి ఎవరో యంగ్ హీరో యంగ్‌స్టర్ స్టోరీ కావాలని చెప్పి ఉంటారు. ఆయన చెప్పినది ఈయన నాతో అని ఉంటారు. కానీ, వాళ్ల మనసుకి అర్థం కావాలి కదా. రామారావుగారు అలా అనగానే నేనేం మాట్లాడలేదు. జస్ట్ ‘అవునండి..’ అని వచ్చేశాను. నేను బాగా గౌరవించే వన్నాఫ్ ది బెస్ట్ రైటర్స్ విజయేంద్రప్రసాద్. ఆయనంటే చాలా అభిమానం. రామారావుగారు నాతో అలా మాట్లాడిన కొన్నాళ్లకు మా విజయేంద్రప్రసాద్‌గారు రాసిన ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజన్’ విడుదలయ్యాయి. అలాగని రామారావుగారికి ఫోన్ చేసి, ‘దేశవ్యాప్తంగా మాట్లాడుకున్న ఆ రెండు కథలూ రాసినది మా ఓల్డ్ రైటరే. ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని నవ్వలేదు. అంత దిగజారే మనిషి కాదు నేను.. నాకో ఐడెంటిటీ, గుర్తింపు వచ్చింది రజనీకాంత్‌గారి ‘నరసింహా’ వల్లే. ఆ కథను యాక్సెప్ట్ చేసినందుకు రజనీగారికీ, చిత్రదర్శకుడు కేయస్ రవికుమార్గారికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలుగులో బాలకృష్ణగారు, చిరంజీవిగారు. పేర్లు ఆర్డర్లో చెబుతున్నాను. ఒకళ్లు ఎక్కువ, ఒకళ్లు తక్కువ అని కాదు. అల్లు అర్జున్‌గారు, ఓంకార్‌గారు. వీళ్లందరూ నన్ము నమ్మి కథ రాసే అవకాశం ఇచ్చారు. దర్శకుల్లో బి.గోపాల్గారు, రాఘవేంద్రరావుగారు, వీవీ వినాయక్‌గారు.. వీళ్లందరికంటే ముందు ఇతని కథ హిట్ అవుతుందని, ఇతను పెద్ద రైటర్ అవుతాడని చెప్పిన పరుచూరి బ్రదర్స్‌లో పరుచూరి గోపాలకృష్ణగారికి.. జన్మజన్మలకు నేను రుణపడి ఉంటా. ఎటువంటి ఈగో లేకుండా వాళ్లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ♦ మీరన్నట్లు హీరోల్లా రైటర్‌కి రిటైర్మెంట్ లేకపోయినప్పటికీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటేవెనకపడిపోయినట్లే కదా? నన్ను చూస్తే.. వెనకపడిపోయినట్లుగా అనిపిస్తోందా? గడ్డం పెంచుకుని, చెట్టు కింద కూర్చుని కథలు రాసుకుంటూ, ఓ చేత్తో సగం కాలిన సిగరెట్టు పట్టుకుని ఆకాశంలో శూన్యంలోకి చూస్తూ..అదే చెట్టు కింద నేను పడిపోయి.. ‘అయ్యో... ఫలానా రచయిత’ అంటూ ఎవరైనా ఆస్పత్రికి తీసుకెళ్లి, జాలిపడేలా నేను కనిపిస్తున్నానా? లేదు కదా. హ్యాపీగానే ఉన్నానుగా. నేను ఆస్ట్రాలజీ, న్యూమరాల్జీని నమ్ముతాను. ఏదీ మన చేతుల్లో ఉండదని నా ఫీలింగ్. ♦మీ భవిష్యత్తు గురించి మీ ఆస్ట్రాలజీ, న్యూమరాల్జీ ఏం చెబుతోంది.. రేసీగా సినిమాలే చేస్తారంటోందా? అక్టోబర్ నుంచి బాగుంటుందని చెబుతోంది. అయినా నేను హ్యాపీగానే ఉన్నాను. నాకు నవ్వొచ్చే విషయం ఒకటి చెప్పాలి. ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడితే కిక్ ఉంటుంది. పాకిస్తాన్ ఒక్కటే ఆడితే? కిక్ ఉండదు కదా. ఇప్పుడున్న సినిమాల పరిస్థితి కూడా అంతే. కిక్ లేదు. ♦అదేంటి..? ఇప్పుడు కాంపిటీషనే లేదు. బాలకృష్ణగారి ‘నరసింహనాయుడు’, చిరంజీవిగారి ‘మృగరాజు’, వెంకటేశ్‌గారి ‘దేవీపుత్రుడు’ ఒకే రోజున (జనవరి 11) విడుదలయ్యాయి. స్టేట్ మొత్తం హీట్. ఏది బెస్ట్ రిజల్ట్ అనే ఎగ్జైట్మెంట్. అలాంటి కిక్ ఇప్పుడు లేదు. సినిమాలన్నీ దాదాపు కాంపిటీషన్ లేకుండా సోలోగా విడుదలవుతున్నాయ్. ♦వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు పోటీ పడనున్నాయి? ఇద్దరితోనూ మీరు సినిమాలు చేశారు. మరి.. ఈ రెండు సినిమాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? రెండు సినిమాలూ ఆడితే ఇండస్ట్రీకి మంచిది. చిరంజీవిగారు చేస్తున్న సినిమా ఆల్మోస్ట్ జిరాక్స్ కాపీలాంటిది. తమిళ ‘కత్తి’కి రీమేక్ అది. పోటీలో ఉన్నవి రెండూ స్ట్రయిట్ చిత్రాలైతే మాట్లాడగలను. రీమేక్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న సినిమా. ఇంకోటి చరిత్ర చెప్పే సినిమా. సో.. రెండింటినీ పోల్చలేం. కంపేర్ చేయాలంటే రెండూ స్ట్రెయిట్ సబ్జెక్ట్సే తీసుకోవాలి. అప్పుడది కాంపిటీషన్ అవుతుంది. దట్ ఈజ్ ద రియల్ వర్త్ ఆఫ్ రన్నింగ్ రేస్. ♦ఎక్కడ కామెడీ, ఎక్కడ రౌద్రం ఉండాలో చిన్నికృష్ణకు తెలు సని వినాయక్ ఓ సందర్భంలో అన్నారు. ఎలా నేర్చుకున్నారు? భాగ్యరాజాగారు నా గురువుగారు. ఏది ఎక్కడ ఎంత కొలతలో ఉండాలో నేర్చుకున్నది ఆయన దగ్గరే. డెరైక్టర్ శంకర్‌గారి దగ్గర చేయకపోయినా ఆయన కూడా నా గురులాంటివారే. ఔటర్ కాన్ఫ్లిక్ట్స్, ఇన్నర్ కాన్ఫ్టిక్ట్స్ అని రెండు ఉంటాయి. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అనుబంధాల చుట్టూ తిరుగుతాయ్. ఔటర్ కాన్ఫ్లిక్ట్స్ సమాజంతో ముడిపడి ఉంటాయ్. శంకర్‌గారు, మురుగదాస్‌గారు చేసే సినిమాలన్నీ అవుటర్ కాన్ఫ్లిక్ట్స్. నా ‘బద్రినాథ్’ అలాంటి సినిమానే. ఆ సినిమా అప్పట్నుంచీ నా ఆలోచనా విధానం మారిపోయింది. ఔటర్ కాన్ఫ్లిక్ట్స్లో కథలు రాస్తున్నా. ♦సాధారణంగా అల్లు అరవింద్‌గారు కథ రాశాక పారితోషికం ఇస్తారట.. కానీ, మీకు ముందే ఇచ్చారట? ఆయన హృదయంలో నాకు సెపరేట్ స్థానం. మా పాప ఫైనలియర్ అప్పుడు బన్నీ హీరోగా నాతో మళ్లీ సినిమా చేస్తా అన్నారు. ♦మరి ఏమైంది..? అన్నారు కదా అని కథ రాసేసుకుని, తెల్లారేసరికల్లా వాళ్ల గుమ్మం ముందు నిలబడలేం కదా. ఆ సమయంలో ఏ పనావిడో కళ్లాపి జల్లుతూ ఉంటుంది. ఆ కళ్లాపికి నేనెందుకు అడ్డం పడాలి (నవ్వుతూ). అభిమానంతో అంటారు. అన్నారు కదా అని వెంటాడేస్తే ఎలా? ♦మీ పెద్ద అబ్బాయిని హీరోని చేయబోతున్నారట? మా అబ్బాయి హీరోనా? పోయిన జన్మలో వంద గుళ్లు కట్టుంటే ఈ జన్మలో హీరోలవుతారని ఇంతకు ముందు చెప్పాను కదా. మరి మావాడు కట్టాడో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ వాడు వంద గుళ్లు కట్టుంటే హీరో అవుతాడు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. ♦మీ కథలో యాక్ట్ చేసిన హీరోలతో మీరు టచ్‌లో ఉన్నారా? అందరితోనూ నాకు మంచి అనుబంధమే ఉంది. కాకపోతే నేను ‘భజన సంఘం’లో లేను. మామూలుగా ఏ ఇండస్ట్రీలో అయినా భజన సంఘం ఉంటుంది. నేనా ట్రూప్కి చెందిన వ్యక్తిని కాదు. నా దగ్గర చిడతలు లేవు. ఒకట్రెండు సార్లు అవి ఇచ్చి, ఎలా కొట్టాలి? ఎలా కొడితే వాళ్లకు నచ్చుతుంది? ఏ సౌండ్‌ని ఇష్టపడతారు... అని కొందరు టిప్స్ ఇచ్చారు. నేను ట్రై చేసినా అవి పగిలిపోయాయి. దాంతో భజన సంఘానికి పనికి రానని ఫిక్సయ్యాను. అందుకే ఎప్పుడూ వాళ్ల చుట్టూ కనిపించను. ♦మరి.. భజన చేయకపోతే దగ్గరకు రానివ్వరట కదా? ఐ డోంట్ మైండ్. ఎవరు నన్ను కాదనుకుని సినిమా తీశారో.. ఎవరు నన్ను కాదనుకుని డెరైక్ట్ చేశారో.. ప్రకృతి వాళ్లకు అన్నీ కరెక్ట్‌గా ఇచ్చేసింది. ఆల్రెడీ వాళ్లకు దక్కింది కాబట్టి, ఇప్పుడు పనిగట్టుకుని ఎవరెవరికి ఏం దక్కింది? అని పర్టిక్యులర్‌గా నేను చెప్పడం అనవసరమైన సబ్జెక్ట్. ఎవరూ దగ్గరకు రానివ్వకపోయినా చిన్నికృష్ణ భజన చేయడు.. దట్సాల్. - డి.జి. భవాని -
తక్కువ పొగుడుతారట!
వాషింగ్టన్: ప్రొఫెసర్లను విద్యార్థులు తరచూ మేధావులు, తెలివైన వారు అని పేర్కొంటారు. అయితే మహిళా ప్రొఫెసర్ల కన్నా పురుష ప్రొఫెసర్లనే విద్యార్థులు ఎక్కువగా పొగుడుతారని ఓ అధ్యయనంలో తేలింది. మహిళా ప్రొఫెసర్లు, ఆఫ్రికన్ అమెరికన్లను చాలా తక్కువ సార్లు మేధావులుగా పేర్కొంటారని తెలిపింది. ఈ పరిశోధన కోసం రేట్‌మైప్రొఫెసర్స్ డాట్‌కామ్ వెబ్సైట్లో తమ తమ ప్రొఫెసర్లపై దాదాపు 1.4 కోట్ల విద్యార్థుల అభిప్రాయాలు తీసుకున్నారు. ‘మహిళా ప్రొఫెసర్ల కన్నా పురుష ప్రొఫెసర్లనే ఎక్కువ సార్లు ‘జీనియస్’, ‘బ్రిలియంట్’ అని పేర్కొంటుంటారని మా అధ్యయనంలో తేలింది’ అని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీకి చెందిన డానియెల్ స్టోరేజి చెప్పాడు. -
దీనికి అన్నీ ప్లస్లే!
స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతోన్న వ్యక్తి దాసరి కిరణ్‌కుమార్. రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్‌కు చేరుకున్న కిరణ్ ఏ పని చేసినా తనదైన ముద్ర కనబరుస్తానంటున్నారు. ‘జీనియస్’ చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘రామ్‌లీల’ నేడు తెరకొస్తోంది. కోనేరు సత్యనారాయణ సమర్పణలో హవీష్, అభిజిత్, నందిత ముఖ్యతారలుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్ర విశేషాలను దాసరి కిరణ్‌కుమార్ ఈ విధంగా చెప్పారు. హవీష్‌తో సినిమాలు నిర్మించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే ‘జీనియస్’ తర్వాత మళ్లీ వెంటనే తనతోనే ‘రామ్ లీల’ చేశాను. ఈ చిత్రకథకు వంద శాతం తనే నప్పుతాడు. నటుడిగా హవీష్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కచ్చితంగా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుంది. ఓ విశిష్టమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ఈ చిత్రం తర్వాత శ్రీపురం కిరణ్ పెద్ద దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. ఎంత బాగా కథ చెప్పాడో అంత బాగా తెరకెక్కించాడు. అభిజిత్ చేసిన పాత్ర చాలా బాగుంటుంది. నందిత అందచందాలు, అభినయం ఓ ప్లస్ పాయింట్. విస్సు రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణ. ఎస్. గోపాలరెడ్డిగారి ఫొటోగ్రఫీ హైలైట్. చిన్నా ఇచ్చిన పాటలకు మంచి స్పందన వస్తోంది. 36 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసినప్పటికీ ఎక్కడా రాజీపడలేదు. అన్ని వర్గాలవారికీ నచ్చే చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతో చేశాం. ఈ చిత్రం ఎవరినీ నిరాశపరచదు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలన్నదే నా ఆశయం. ఇక ముందూ కొత్త దర్శకులతో సినిమాలు నిర్మిస్తాను. -
‘పాగ పుల్లారెడ్డి రాజనీతిజ్ఞుడు’
గద్వాలటౌన్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మేధావి, మాజీ శాసనసభ్యుడు పాగపుల్లారెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం స్వాతంత్య్ర సమరయోధులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక బాలభవన్‌లో చిన్నారి కళాకారుల నడుమ బాలభవన్ సిబ్బంది వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సేవలను కొనియాడారు. పాగ పుల్లారెడ్డి గొప్ప ప్రజాసేవకుడు, ఆదర్శ రాజ నీతిజ్ఞుడు అని ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాగ పుల్లారెడ్డి చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గద్వాల బాలభవన్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. గద్వాల వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహామనిషి అని అన్నారు. కార్యక్రమంలో బాలభవన్ కమిటీ సభ్యులు రాజగోపాలాచారి, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, రామిరెడ్డి మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి పాగ పుల్లారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు, రైల్వేలైన్ల కోసం కోసం కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. ఉన్నత విలువలతో కూడిన ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో శంకరయ్య, బాలకిషన్, గార్లపాడు కృష్ణయ్య, లక్ష్మిరెడ్డి, సవారన్న, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
కథ: బాల మేధావి
‘మమ్మీ ప్రోగ్రెస్ కార్డ్’ అంటూ చింటూ ప్రోగ్రెస్ కార్డ్‌ని వాళ్లమ్మకి అందకుండా గాలిలోకి ఎత్తి తిప్పుతూ గదంతా రెండుసార్లు తిరిగి వచ్చి వాళ్లమ్మ ఒడిలో వాలిపోయాడు. ఆత్రంగా ఆ కార్డ్ చూసిన పద్మ ముఖం వెలిగిపోయింది. రవి, పద్మల ఒక్కగానొక్క కొడుకు చింటూ. ఈ సంవత్సరమే వాడిని కాన్సెప్ట్ స్కూల్లో జాయిన్ చేశారు. ఇదే వాడి మొదటి ప్రోగ్రెస్ కార్డ్. కార్డ్ అందుకున్న ఆనందం వాడి ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. పద్మ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ప్రతి సబ్జెక్ట్లోను పాతిక మార్కులకి పాతిక మార్కులు. ఎక్కడా ఒక్క అర మార్క్ కూడా తగ్గకుండా కార్డంతా నింపేశాయి. ఆనందం పట్టలేక పద్మ వెంటనే వాళ్లాయనకి ఫోన్ చేసేసింది. ‘‘ఏమండోయ్! మన చింటూగాడికి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారండీ. అందులో వాడికి అన్నింట్లోను ఫస్ట్ మార్కులే వచ్చాయండీ. మీరు వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురండి. ఎందుకైనా మంచిది ఈ విషయం మీ ఆఫీసులో ఎవరికీ చెప్పకండి. మనవాడికి దిష్టి పెడతారు’’ అంటూ ఫోన్ పెట్టేసి పక్కింటి పిన్నిగారికి విషయం చెప్పడానికి గోడ దగ్గరికి పరిగెత్తింది. అక్కడ ఆఫీసులో రవి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. భార్య అందరూ దిష్టి పెడతారని భయపెట్టింది కనుక గానీ, లేకపోయుంటే ఆఫీసంతా అరచి గీపెట్టేసేవాడు. ఫోన్లో విషయం విన్న వెంటనే అరపూట పర్మిషన్ పెట్టి దారిలో స్వీట్స్ కొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వస్తూనే చింటూగాడిని ఎత్తి గాల్లోకి నాలుగు తిప్పులు తిప్పేశాడు. ‘‘వీడికి అన్నీ నా పోలికలేనోయ్. వీడు కచ్చితంగా బాలమేధావే’’ అంటూ చింటూగాడి ముఖాన్ని ముద్దులతో తడిపేశాడు. ‘‘చాల్లెద్దురు బడాయి? మీకు చిన్నప్పుడు అన్ని మార్కులు వస్తే ఇప్పుడు ఈ గుమస్తాగిరీ ఎందుకు వెలగపెడతారు. వీడికి అన్ని మేనమామ పోలికలే. మా తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు తెలుసా’’ అంది గర్వంగా హొయలు పోతూ. ‘‘ఇంజనీరింగ్ గురించి నాకు చెప్పకు. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చదవడం పెద్ద విషయం ఏమీ కాదు. ఎలిమెంటరీ స్కూల్ లేని ఊళ్లో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు వెలిసిపోయాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్ సీటు పరిస్థితి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు తయారయ్యింది.’’ ‘‘ఏమైనా అనండి, వీడిది మీ పోలిక మాత్రం కాదు. పదో తరగతిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో నేను చూడలేదనుకున్నారా’’ అంది భర్తవైపు వ్యంగ్యంగా చూస్తూ. ‘‘అదా! ఆ రోజుల్లో మార్కుల మీద రేషన్ విధించారులే. ఎవరికీ పూర్తి మార్కులు వేసేవారు కాదు. ఐదు వందల మార్కులు వస్తే వాడు ఏ కలెక్టరో అయిపోతాడని లెక్కేసేవారు. మరి ఇప్పుడో ఐదు వందల మార్కులు వస్తే వాడికి ఇంటర్లో సీటు కూడా దొరకడం లేదు. కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది’’ అన్నాడు విచారంగా పెదవులు విరుస్తూ. ‘‘ఎవరి పోలిక అయితేనే! మనవాడికి మంచి తెలివితేటలు వచ్చాయి. వీడిని ఇలాగే చదివిస్తే వీడు ఏ ఐన్‌స్టీనో, న్యూటనో అయిపోతాడు. ముందు ముందు పేపర్లలోను, టీవీల్లోను మనవాడి ఫొటోలు చూపిస్తుంటే మా ఆఫీసువాళ్లంతా ముఖాలు మాడ్చుకుని కూర్చుంటారు’’ అంటూ చింటూగాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ‘‘ఏమండీ, వీడికి ఇప్పుడే ఇన్ని మార్కులు వస్తున్నాయంటే పెద్దయ్యాక ఏ కలెక్టరో అయిపోతాడంటారా’’ అంటూ చింటూగాడి తల నిమురుతూ భర్తని ప్రశ్నించింది. ‘‘కలెక్టర్దేముంది, అధికారం అయితే ఉంటుంది కానీ నిజాయితీగా ఉంటే ‘కాణీ’ కూడా సంపాదించలేడు. వీడిని ఏ బిజినెస్ స్కూల్లోనో జాయిన్ చేస్తే నెలకి పదేసి లక్షలు జీతం ఇచ్చి పెద్ద పెద్ద కంపెనీలు ఎగరేసుకుపోతాయి’’ తెలుసా అన్నాడు గర్వంగా. ‘‘అలాగాండీ! అయితే మనవాడిని అందులోనే జాయిన్ చేద్దామండి. మనవాడు పదిలక్షల జీతం అందుకుంటుంటే, అది చూసి పక్కింటి పిన్నిగారికి తిక్క కుదిరిపోవాలి’’ అంటూ పక్కింటి వైపు చూసి మెటికలు విరిచింది. ‘‘సర్లే, రేపణ్నుంచి వీడి పెంపకంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతోమంది బాలమేధావుల అభివృద్ధి వెనుక వాళ్ల తల్లిదండ్రుల కృషి చాలా ముఖ్యమైనది తెలుసా’’ అన్నాడు రవి ఎవరికీ తెలియని విషయం కనిపెట్టినట్టు. ఇవేమీ అర్థం కాని చింటూ మౌనంగా కుర్కురే తింటున్నాడు. నిన్నటిదాకా వాడు అడిగితే పద్మ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అరగంటసేపు యోగాసనాలు వేయించేది. ఇప్పుడు మార్కుల పుణ్యమా అని వాడు అడక్కుండానే కొనిచ్చేసింది. మార్కుల మాటల్లో పడి వాళ్లిద్దరికీ రాత్రి కంటిమీద కునుకు లేదు. మర్నాడు పొద్దున నిద్ర ముఖంతో ఆఫీసుకి వెళ్లిన రవికి కొలీగ్స్ చాలామంది ముఖాలు కూడా నిద్రలేనట్టే కనిపించాయి. ఎప్పుడూ లేనిది అందరూ ఏదో విషయం దాస్తున్నట్టు చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకైనా మంచిదని రవి కూడా గుంభనంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. పిల్లల చదువులు వాళ్ల మార్కుల విషయం వచ్చినప్పుడల్లా అందరూ విషయం దారిమళ్లించి వేరే సంబంధం లేని విషయాలు మాట్లాడటం మొదలుపెట్టారు. రవి కూడా చింటూగాడి మార్కుల విషయం ఆఫీసులో బయటపడకుండా తెలివిగా తప్పించుకుని, ఆ రోజు డ్యూటీ అయ్యిందనిపించాడు. ఆఫీసు నుంచి సరాసరి బజారుకెళ్లి చింటూని బాలమేధావిగా మార్చడానికి కావలసిన సరంజామా కొనుక్కొచ్చాడు. ఇంటికి వస్తూనే, ‘‘పద్మా! ఏం తెచ్చానో చూడు’’అంటూ తను తెచ్చిన ప్యాకెట్లు టేబుల్ మీద పేర్చేశాడు. ‘‘ఏంటండీ ఇవి, అచ్చు మనిషి మెదడులా ఉన్నాయి’’ అంది పద్మ ఆశ్చర్యంగా ఆ టేబుల్ మీది ప్యాకెట్లు చేతిలోకి తీసుకుంటూ. ‘‘వీటిని అక్రూట్స్ అంటారులే. ఇవి తింటే పిల్లల మెదడు బాగా పనిచేస్తుందని పుస్తకంలో చదివాను. రేపట్నుంచి రోజూ చింటూగాడికి వీటిని తినిపించే బాధ్యత మాత్రం నీదే!’’ ‘‘అయ్యో! అలాగాండి, నేను కూడా ఇందాక బజారుకెళ్లి సరస్వతీ లేహ్యం కొనుక్కొచ్చాను. అది తింటే పిల్లలకి జ్ఞాపకశక్తి పెరుగుతుందని షాపువాడు చెప్పాడు’’ అంది భర్తకి సీసా చూపిస్తూ. ‘‘పోనీలేవోయ్. రెండూ కలిపి మిక్సీలో వేసెయ్. అక్రూట్ లేహ్యం తయారవుతుంది. అది తింటే చింటూగాడికి జ్ఞాపకశక్తితో పాటు మెదడు కూడా అభివృద్ధి చెందుతుంది’’ అన్నాడు సైంటిస్ట్‌లా నుదురు రుద్దుకుంటూ. ఆ రోజు మొదలు చింటూ వాళ్లిద్దరికీ ప్రయోగశాలలా మారిపోయాడు. ఎక్కడెక్కడో చదివిన ఆరోగ్య సూత్రాలు అన్నీ చింటూ మీద ప్రయోగించసాగారు. ప్రతిరోజు ‘బాల మేధావుల్ని తయారుచేయడం ఎలా?’ అన్న పుస్తకాన్ని పారాయణం చెయ్యడం మొదలుపెట్టారు. దానికి తోడు చింటూకి కూడా మేధావుల లక్షణాలు బాగా వంటపట్టేశాయి. ఎవరు ఏమి అడిగినా, నోరు మెదిపేవాడు కాదు. అన్ని వ్యవహారాలు సైగల ద్వారా కానిచ్చేవాడు. తల్లిదండ్రుల ప్రయత్నమో, భగవంతుని సంకల్పమో గాని చింటూగాడి ఎల్కేజీ చదువు నిర్విఘ్నంగా సాగి ఆఖరి తంతు వార్షిక పరీక్షల ఘట్టానికి చేరుకుంది. వాడిని పరీక్షలకి తయారుచేయడానికి రవి, పద్మ రకరకాల విన్యాసాలు చేయసాగారు. రోజూ ఆకు పసర్లతో తలంట్లు, లేహ్యాలు, లేపనాలతో మొత్తానికి పరీక్షలు పూర్తిచేశారు. వీళ్లు ఊహించినట్టుగానే చింటూగాడికి ఒక్క మార్కు కూడా పోకుండా ఆరు వందలకి ఆరు వందలూ వచ్చేశాయి. ఆ మార్కులు చూసి రవి భూమ్మీద నిలబడటం మానేసి, చింటూగాడు కట్టబోయే భవంతుల్లో విహరించసాగాడు. ఇంతలో చింటూగాడి స్కూల్ నుంచి వార్షికోత్సవం రోజు బహుమతి అందుకోవడానికి రమ్మని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసినప్పటినుంచీ రవి ఊహలన్నీ ఆ ఫంక్షన్ చుట్టూనే తిరగసాగాయి. ఆ రోజు ఎలా మాట్లాడాలి, ఏ బట్టలు వేసుకోవాలి అని సవాలక్ష ఆలోచనల మధ్య సూటు వేసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ మాట పద్మతో అంటే... ‘‘ఒక్క ఫంక్షన్ కోసం అన్ని వేలు తగలేసి సూటు కుట్టించుకోవడం ఎందుకండీ. అయినా మీరు సూటు వేసుకుంటే నేను మామూలు చీర కట్టుకోనా? నాక్కూడా ఉప్పాడ ఫ్యాన్సీ పట్టుచీర కొనాల్సిందే’’ అని భర్తని పట్టుబట్టి కొత్త చీర కొనిపించుకోవడానికి బజారుకి రెడీ అయిపోయింది. ‘‘ఒక చీరేం ఖర్మ పద్మా! మనం ఇంకా బోల్డు బట్టలు రెడీగా ఉంచుకోవాలి. ప్రతి సంవత్సరం మనం ఎన్నో ఫంక్షన్లకి వెళ్లి ఎన్నో బహుమతులు అందుకోవాలి. అవసరం అయితే, టీవీవాళ్లకి, పేపర్‌వాళ్లకి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వవలసి ఉంటుంది తెలుసా. ఇంకో విషయం... రేపు పేపర్‌వాళ్లు ఇంటర్వ్యూలు అడిగితే, వాడి చదువు విషయంలో నేను శ్రద్ధ తీసుకున్నానని చెప్పు. వాడి ఆరోగ్యం విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకున్నావని నేను చెపుతాను. తెలిసిందా’’ అంటూ భార్యతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. రవి ఎంతో ముచ్చటపడి కుట్టించుకున్న సూటు తగిలించుకుని, స్కూల్ ఫంక్షన్‌కి బయలుదేరాడు. ఆ వాతావరణం హంగు, ఆర్భాటం చూస్తుంటే రవికి అదంతా తనకోసమే ఏర్పాటు చేశారేమో అనిపించింది. పనిలో పనిగా చుట్టూ పంకించిన రవికి, తన కొలీగ్స్ నలుగురు కనిపించారు. ఎప్పుడూ నలిగిపోయిన బట్టలతో ఉండేవాళ్లు ఈ రోజు కొత్త సూట్లో తళతళలాడిపోతున్నారు. వాళ్లంతా సూట్లు ఎందుకు వేసుకున్నారో రవికి అర్థం కాలేదు. ఇంతలో ఫంక్షన్ మొదలవుతోంది అన్న మాటలు విని ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. ఉపన్యాసాల తర్వాత బహుమతి ప్రదానం మొదలైంది. ‘చింటూ చిదంబరేశ్వర్ ఎల్కేజీ క్లాస్ ఫస్ట్’ అన్న మాటలు విని రవి స్కూల్ అని కూడా చూడకుండా నోట్లో వేలు పెట్టుకుని విజిల్ వేశాడు. చింటూ గునగునా నడుచుకుంటూ వెళ్లి బహుమతి అందుకున్నాడు, తండ్రివైపు గర్వంగా చూస్తూ. ‘మేగీ మాణిక్యాంబ ఎల్కేజీ క్లాస్ ఫస్ట్’ అన్న మాటలు విని రవికి కొంచెం అనుమానం మొదలైంది. ఒక చిన్నమ్మాయి వెళ్లి బహుమతి అందుకుంది. ‘జానీ జగదీశ్వర్‌రావు ఎల్కేజీ క్లాస్ ఫస్ట్’ ‘రాఖీ రాజారావు ఎల్కేజీ క్లాస్ ఫస్ట్’ ‘బన్నీ ఎల్కేజీ క్లాస్ ఫస్ట్’ ‘హనీ ఎల్కేజీ క్లాస్ ఫస్ట్’... అంటూ మైక్‌లో వరుసగా పేర్లు చదువుతున్నారు. పిల్లలందరూ వెళ్లి బహుమతులు అందుకుంటున్నారు. అందరూ క్లాస్ ఫస్ట్ అన్న మాటలు రవి ఉత్సాహం మీద నీళ్లు పోశాయి. ఇప్పటివరకూ అందంగా కనిపించిన ఆ వాతావరణం కంపరంగా అనిపించసాగింది. ఎలాగైనా విషయం తేల్చుకోవాలని కారాలు మిరియాలు నూరుకుంటూ ప్రిన్సిపాల్ గదికి నడిచాడు. రవిని చూస్తూనే ప్రిన్సిపాల్ కూర్చోమని సైగ చేసింది. ‘‘నేను కూర్చోవడానికి రాలేదు మేడమ్, మీరు చేస్తున్న మోసం గురించి నిలదీద్దామని వచ్చాను. ఇలా మీరు క్లాసు క్లాసంతటికీ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తే తెలివైన పిల్లలకి, తెలివితక్కువ పిల్లలకి తేడా ఏముంటుంది? ఇలా చేస్తే ఆ పసి హృదయాలు దెబ్బతినవా?’’ అన్నాడు పెద్ద మానసిక శాస్త్రవేత్తలా. ‘‘చూడండి రవిగారూ! మీకు మా కాన్సెప్ట్ తెలిసినట్టు లేదు. చిన్నపిల్లల మనసుల్ని మార్కులతో కల్లోలం చేయడం వలన పిల్లల్లో అనవసరమైన స్పర్థలు ఏర్పడుతున్నాయి. కొంతమంది పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. మార్కులు తక్కువ వచ్చిన పిల్లల్ని తల్లిదండ్రులు ఇతరులతో పోల్చి మరింత కుంగదీస్తున్నారు. అందుకనే మార్కుల మూలంగా పిల్లలు అనవసర గందరగోళానికి గురికాకూడదనే ఉద్దేశంతో చిన్న తరగతుల పిల్లలందరికీ పూర్తి మార్కులు ఇచ్చి అందరికీ ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం. ఇదే పెద్ద తరగతి పిల్లలకి మార్కుల బదులు గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నాం. ‘‘ఏమండీ, వీడికి ఇప్పుడే ఇన్ని మార్కులు వస్తున్నాయంటే పెద్దయ్యాక ఏ కలెక్టరో అయిపోతాడంటారా’’ అంటూ చింటూగాడి తల నిమురుతూ భర్తని ప్రశ్నించింది.ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. రవి ఎంతో ముచ్చటపడి కుట్టించుకున్న సూటు తగిలించుకుని, స్కూల్ ఫంక్షన్‌కి బయలుదేరాడు. తరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి తల్లిదండ్రులకి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి, మరింత కృషి చేయించమని చెబుతున్నాం. నేను మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ చింటూకి అంకెలు కూడా సరిగ్గా రావట్లేదు. దస్తూరి కూడా బాలేదు. మీరు ఈ వేసవిలో వాడిచేత ప్రాక్టీస్ చేయించకపోతే వచ్చే సంవత్సరం కూడా మీవాడు ఎల్కేజీయే చదవాల్సి ఉంటుంది’’ అంటూ కుర్చీలోంచి లేచింది. ఆ మాటలు రవికి శరాఘాతాల్లా తాకాయి. చింటూగాడి ప్రోగ్రెస్ కార్డ్ కళ్లకి దగ్గరగా పెట్టుకుని చూస్తే, ఆ బాలమేధావి ప్రోగ్రెస్ కార్డ్ నిండా సున్నాలే కనిపించాయి. - .ఎం.సుభాకర్