అందరికీ తెలితేటలుంటాయి. కానీ ఐక్యూ ప్రకారం కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ తెలివితేటలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారిగా నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వాళ్లుగా గుర్తించాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలు ఉంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తారు? మరి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? చెక్ చేసుకోండి..
►వీళ్లు ఒక పనిపై గంటల సమయం దృష్టి కేంద్రీకరించగలరు. విషయం చిన్నదైనా వారి ఆలోచన మాత్రం పరిధికి మించి ఉంటుందట.
► ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది.
► దేన్నైనా ఓపెన్ మైండ్‌తో ఆలోచించేవారిలో ఐక్యూ కూడా ఎక్కువేనట.
► దేన్నైనా క్రియేటివ్‌గా, కొత్తగా ఆలోచిస్తారట.
► ఐక్యూ అధికంగా ఉండే వారు ఎక్కువగా సింగిల్‌గా ఉంటారట..వేరే వాళ్ల మీద ఆధారపడకుండా తమ సొంత ప్రెజెన్స్‌ని ఎంజాయ్ చేస్తారు.
► బ్యాలెన్స్‌డ్ థింకింగ్, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఏ సందర్భంలో అయినా నిగ్రహం కోల్పోకుండా సెల్ఫ్ కంట్రోల్‌తో ఉంటారట.
వీళ్లు ఎక్కువ మాట్లాడటం కంటే అవతలి వాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడతారు.
► తెలివితేటలు ఎక్కువగా ఉన్నవారు ఇంట్రోవర్ట్‌గా ఉంటారు. తొందరగా ఎవరితోనూ మాట్లాడరు, కలవరు.
►లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్‌ని సాధారణంగా తెలివైన వారుగా పరిగణిస్తారు.
► సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా ఉంటారట.
► పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు. వీరిలొ ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment