ఫోన్ టచ్‌స్క్రీన్ మనిషిని గుర్తుపడుతుందా?
అధునాతన ఫోన్లలో టచ్ స్క్రీన్ సదుపాయాన్ని అందరం వినియోగిస్తున్నాం. అయితే ఇలాంటి స్పర్శతెరలకు సరికొత్త సదుపాయాలను అద్దుతున్నారు శాస్త్రవేత్తలు. అందులో భాగంగా ఒక స్పర్శకు మాత్రమే స్పందించే టెక్నాలజీని అభివృద్ధి పరిచారు. అంటే టచ్ చేయడాన్ని బట్టి ఆ స్పర్శతెరలు మనిషిని గుర్తిస్తాయి.
ప్రతిమనిషి స్పర్శ భిన్నంగా ఉంటుంది. ఎముకల సాంద్రత, రక్తంలోని ద్రవణ స్థాయి, కండరాల బలం భిన్నస్థాయిలో ఉంటాయి. ఇవన్నీ ఒక వ్యక్తి స్పర్శను ప్రభావితం చేస్తాయి.
‘
టచీ’గా పిలిచే తెరను భిన్నమైన స్పర్శలకు అనుగుణంగా స్పందించేలా తీర్చిదిద్దుతారు. మామూలు టచీ ఏ స్పర్శకైనా స్పందించేలా తీర్చిదిద్దినది అయితే అధునాతన టచీలను ఒక సాంద్రతకే పరిమితం చేస్తారు. ఆ స్థాయిలోని స్పర్శ తగిలినప్పుడే టచీ స్పందిస్తుంది. లేకపోతే స్పందించదు. ఇలా మనిషి స్పర్శకు సెట్ అయ్యేలా స్క్రీన్ ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తారు. అయితే ఈ తరహా టచ్‌స్క్రీన్‌లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు