
వరల్డ్ వైడ్‌గా గుర్తింపు పొందిన టెస్లాకారులోని లేటెస్ట్ ఫీచర్లని కొందరు దుర్వినియోగం చేయడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఊహించని విధంగా తలెత్తిన ఈ కొత్త సమస్యకి ఎలన్ మస్క్ ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తాజా ఘటన టెస్లా బ్రాండ్ ఇమేజ్‌ని ఎమైనా ఎఫెక్ట్ చేస్తుందా అనే చర్చ సైతం మొదలైంది.
టెక్నాలజీలో దూసుకుపోవడం అంటే ఎలన్ మస్క్‌కి ఇష్టం. అందుకే డీజిల్ కార్లు రాజ్యమేలుతున్న సమయంలో ఎలక్ట్రిక్ కార్ల కోసం ఆలోచించారు. అదే బాటలో ఇప్పుడు డ్రైవర్ లెస్ కారుని పరిచయం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇలా టెక్నాలజీని ప్రజలకు మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా నేవిగేషన్ మరింత సులువుగా ఉండేందుకు టెస్లా కార్లలో బిగ్ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు ఎలన్ మస్క్. కానీ కొందరు ప్రబుద్దులు ఈ స్క్రీన్లను దుర్వినియోగం చేస్తున్నారు. టెస్లా బ్రాండ్‌కి కొత్త చిక్కులు తెచ్చి పెట్టారు.
టచ్ స్క్రీన్ ఉపయోగం
టెస్లా కారులో డ్యాష్ బోర్డులో ఇన్ఫోంటైన్‌మెంట్ ఏరియాలో స్ట్రీరింగ్ పక్కనే టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ టచ్ స్క్రీన్‌లో కారు ఎంత వేగంతో వెళుతుంది. ముందు, వెనుక భాగంలో వచ్చే వాహనాల వివరాలు, యాక్సిడెంట్ అలెర్ట్, మ్యాప్‌లతో నావిగేషన్, ఎయిర్ కండిషన్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అంతేకాదు కారు ప్రయాణిస్తున్న ఏరియాకు సంబంధించిన ప్రత్యేకతలు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితర వివరాలను అందిస్తుంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా ఆ టచ్ స్క్రీన్ తో డ్రైవింగ్‌ను కమ్యునికేట్ చేయడంతో పాటు ఇతర పనుల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా ఈ టచ్ స్క్రీన్ ఉపయోగపడుతుంది.
దుర్వినియోగం
ఇప్పుడు అదే స్క్రీన్‌ను కొందరు ప్రబుద్దులు అసాంఘీక కార్యకలాపాకు ఉపయోగించడంపై సరికొత్త చర్చకు దారి తీసింది. సౌత్ లండన్ ప్రాంతంలో ఓ వాహన దారుడు రూ.75లక్షల ఖరీదైన 'టెస్లా-ఎస్' ఎలక్ట్రిక్ కారు స్ట్రీరింగ్ పక్కనే ఉన్న టచ్ స్క్రీన్‌పై అశ్లీల వీడియోలు చూస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. డాన్ కిచెనర్ అనే మరో వాహనదారుడు టెస్లా కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి నీలిచిత్రాలు చూస్తుండడాన్ని గుర్తించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇలా అయితే ఎలా ?
ఈ సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని డాన్ కిచెనర్ సోషల్ మీడియాలో వివరంగా తెలిపాడు... సౌత్ లండన్‌లో నేనుండే ఏరియా నుంచి నా కారులో ఆఫీస్‌కు వెళుతున్నా. అదే సమయంలో నా ముందున్న టెస్లా కారు టచ్ స్క్రీన్‌లో నీలిచిత్రాలు ప్లే అవ్వడాన్ని గమనించా. జాగ్రత్తగా చూస్తే డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి కారును నడుపుతూనే పక్కన ఉన్న స్క్రీన్‌ను జూమ్ చేసి నీలి చిత్రాలు చూస్తున్నాడు. ట్రాఫిక్‌ను గమనించకుండా మరో లోకంలో ఉండిపోయి ఆ వీడియోలు చూస్తున్నాడు. ఇలా డ్రైవింగ్‌పై దృష్టి పెట్టకుండా నడిపితే జరిగే నష్టానికి బాధ్యులంటూ ప్రశ్నించాడు.
మస్క్ ఏంచేస్తారో
కిచెనర్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. టెస్లా కారులో మిస్ యూజ్ అవుతున్న టచ్ స్క్కీన్‌పై ఎలన్ మస్క్ ఎలా స్పందిస్తారు ? ఏదైనా కొత్త పరిష్కారం చూపిస్తారా ? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు డ్రైవర్‌ను తిట్టి పోస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వివాదంపై టెస్లా నుంచి ఎటువంటి అధికారిక స్పందన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment