
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీదారి ఆడి తన ఏ5 రేంజ్‌లో మూడు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఏ5 స్పోర్ట్‌బ్యాక్, ఏ5 కాబ్రియోలెట్, ఎస్5 స్పోర్ట్ బ్యాక్ పేర్లతో వీటిని ఆడి తీసుకొచ్చింది. వీటి ధరలు ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.54.02 లక్షలు, రూ.67.15 లక్షలు, రూ.70.60 లక్షలుగా ఉన్నాయి. మొదటి రెండు మోడల్స్ పూర్తిగా కొత్తవి కాగ, ఎస్5 ప్రస్తుతమున్న ప్రొడక్ట్‌కు అప్‌డేటడ్ మోడల్. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ కార్లను ఆడి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
ఏ5 మోడల్2.0 లీటరు ఇంజిన్‌ను, 190బీహెచ్‌పీ పీక్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ టాప్ స్పీడు 235 కేఎంపీహెచ్. 7.9 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్‌ను సాధించగలదని కంపెనీ చెప్పింది.
ఎస్5 మోడల్ చాలా పెద్దది, చాలా వేగవంతమైనది. 3 లీటరు ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ కారు 354కేహెచ్‌పీ పీక్ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోడల్ టాప్ స్పీడు 250 కేఎంపీహెచ్. 4.7 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్‌ను ఇది చేరుకోగలదు.
Comments
Please login to add a commentAdd a comment