న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా తాజాగా న్యూ సిటీ (పెట్రోల్), న్యూ సిటీ ఈ:హెచ్‌ఈవీ పేరిట రెండు కొత్త మోడల్స్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. భద్రత, కనెక్టివిటీ, సౌకర్యాలకు సంబంధించి వీటిలో అదనపు ఫీచర్స్‌ను జోడించినట్లు కంపెనీ తెలిపింది. న్యూ సిటీ (ఐ–వీటెక్) ధర రూ. 11.49 లక్షల నుంచి రూ. 14.72 లక్షల వరకూ ఉంటుంది. న్యూ సిటీ (ఈ–హెచ్‌ఈవీ) ధర రూ. 18.89 లక్షల నుంచి రూ. 20.39 లక్షల వరకూ ఉంటుంది.
పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 17.8 నుంచి 18.4 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తాయి. న్యూ సిటీలో అధునాతన 20.3 సెం.మీ. టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఆడియో, వన్ టచ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, అలాగే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హోండా లేన్ వాచ్, యాంటీ థెఫ్ట్ అలారం తదితర ఫీచర్లు ఉంటాయి. రెండు మోడల్స్‌లోనూ 3 ఏళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. కావాలంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వర కూ అదనంగా వారంటీ తీసుకోవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ వారంటీ 8 ఏళ్లు లేదా 1,60,000 కి.మీ.గా (ఏది ముందైతే అది) ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment