దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో రాబోయే 6 సంవత్సరాల్లో ఏకంగా 16 కొత్త కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. 2030 నాటికి 9 ఫ్యూయెల్ కార్లు, 7 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలని సంస్థ యోచిస్తోంది.
కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేయడంతో పాటు తన వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి యోచిస్తోంది. దీనికోసం మహీంద్రా రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 27,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. కంపెనీ ప్యాసింజర్ వాహనాలను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాలను విడుదల చేస్తూ దేశీయ విఫణిలో, గ్లోబల్ మార్కెట్లో కూడా దూసుకెళ్తోంది.
మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL)లో కంపెనీ ఇప్పటికే రూ. 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడి ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి మాత్రమే కాకుండా.. మార్కెట్లో కంపెనీ ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగించనుంది.
ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ 10000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సంఖ్య FY2026 నాటికి 18000 చేరే అవకాశం ఉంది. కాగా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి FY2025 చివరి త్రైమాసికం నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment