పికప్‌ వాహన విభాగంలో ఎంఅండ్‌ఎం 2 కొత్త మోడళ్లు | Mahindra Launches New Pick-up Trucks | Sakshi
Sakshi News home page

పికప్‌ వాహన విభాగంలో ఎంఅండ్‌ఎం 2 కొత్త మోడళ్లు

Published Fri, Apr 28 2023 4:21 AM | Last Updated on Fri, Apr 28 2023 4:21 AM

Mahindra Launches New Pick-up Trucks - Sakshi

హైదరాబాద్‌: సరకు రవాణాకు సంబంధించిన (పికప్‌) వాహన విభాగంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) రెండు కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. రూ.7.85 లక్షల నుంచి రూ.10.33 లక్షల శ్రేణిలో ధరలు ఉన్న ఈ బొలెరో మ్యాక్స్‌ సామర్థ్యం 2 టన్నుల వరకూ ఉందని ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. రూ.24,999 చెల్లించి వీటిని బుక్‌ చేసుకోవచ్చని కూడా ప్రకటన వెల్లడించింది.

1.3 నుంచి 2 టన్నుల వరకూ పేలోడ్‌ సామర్థ్యంతో ఈ కొత్త శ్రేణి వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు ప్రకటన వివరించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక పరిజ్ఞానం, సదుపాయాలతో ఈ వాహన శ్రేణి ఉత్పత్తి జరిగినట్లు వివరించింది. హెచ్‌డీ సిరీస్‌ (హెచ్‌డీ 2.0, హెచ్‌డీ 1.7, హెచ్‌డీ 1.3 లీటర్లు) , సిటీ సిరీస్‌ (సిటీ 1.3, 1.4 సీఎస్‌జీ) సిరీస్‌లలో వాహనాలు లభ్యం కానున్నట్లు తెలిపింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement