
న్యూఢిల్లీ: లగ్జరీ కార్‌మేకర్ మెర్సిడెస్ బెంజ్ కొత్త హై ఎండ్‌మోడల్ కార్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఏఎంజీ సీఎల్‌ఏ- 45, జీఎల్‌ఏ-45 మోడళ్లను అప్‌గ్రేడ్ చేసి సరికొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుగు సిలిండర్ల ఇంజీన్‌తో ఏఎంపీ ఫెరఫామన్స్ మోడల్స్‌ను విడుదల చేసింది. వీటితోపాటు ఏఎంజీలో ఏరో ఎడిషన్‌లో రెండు మోడల్స్‌ను తీసుకొచ్చింది. సీఎల్‌ఏ 45 ఏరో ధరను రూ.77.69 లక్షలుగాను, జీఎల్‌ఏ-45 ఏరో ధరను రూ. 80.6 లక్షలు (ఎక్స్-షోరూము)గా నిర్ణయించింది.
మెర్సిడెస్ ఏఎంజీసీఎల్- 45 సెడాన్, జీఎల్‌ఏ-45 ఎస్‌యూవీని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర (ఎక్స్-షోరూము) వరుసగా రూ.. 75.20 లక్షలు , రూ. 77.85 లక్షలుగా నిర్ణయించింది. ఈ రెండు వాహనాలు గరిష్టంగా గంటలకు 250కి.మీ. వేగాన్ని అందుకుంటాయి.
భారతదేశంల కార్ల విభాగం వేగంగా వృద్ధి చెందిందని, పరిశ్రమ వృద్ధికి కొత్త మోడల్స్ ఆవిష్కరణ కీలకమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ రోలాండ్ ఫోల్గర్ వ్యాఖ్యానించాడు. అంతిమ డ్రైవింగ్ పనితీరుతో ఆకట్టుకునేలా తీసుకొస్తున్న రాడికల్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు.


Comments
Please login to add a commentAdd a comment