దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్‌లు, గిప్ట్‌లు ఇవ్వడం చాలా కామన్. ఇటీవలి కాలంలో కంపెనీ లాభాలను బట్టి ఖరీదైన బహుమతులను ఇస్తున్న సందర్భాలను కూడా చూశాం. గతంలో డైమండ్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇళ్లు, కార్లు బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచాడు. తాజాగా చెన్నైకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు ఏకంగా బెంజ్ కార్లను బహుమతిగా ఇచ్చింది. బెంజ్ సహా 28 ఇతర బ్రాండెడ్ కార్లను, 29 బైక్‌లను దివాలీ గిఫ్ట్ ఇచ్చింది.
స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ అండ్ డిటైలింగ్ కంపెనీ, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తన ఉద్యోగులకుఅదిరిపోయే దీపావళి కానుక అందించింది. హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ , మెర్సిడెస్ బెంజ్ నుండి వివిధ రకాల బ్రాండ్ కొత్త కార్లను ఉద్యోగులకు అందించింది. కంపెనీ అభివృద్ధిలోనూ, విజయవంతంగా కంపెనీని నడిపించడంలోనూ ఉద్యోగుల కృషి , అంకితభావానికి ప్రశంసల చిహ్నంగా అందించినట్లు కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమ గొప్ప ఆస్తి అని, ఈ విధంగా ఉద్యోగుల విజయాలను గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. ఇది తమ ఉద్యోగుల్లో ధైర్యాన్ని, ప్రేరణనిచ్చి, ఉత్పాదకతను పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే ఉద్యోగుల అభివృద్ధికి , కస్టమర్ సంతృప్తికి అధిక ప్రాధాన్యత భవిష్యత్తులో కొనసాగుతుందని కన్నన్ తెలిపారు.
వివాహ సాయం లక్ష రూపాయలకు పెంపు
కంపెనీలో సుమారు 180 మంది ఉద్యోగులుండగా, దాదాపు అందరూ నిరాడంబరమైన నేపథ్యంనుండి వచ్చినవారు, అత్యంత నైపుణ్యం ఉన్నవారేనని కంపెనీ కొనియాడింది. కార్లను బహుమతిగా ఇవ్వడంతో పాటు, వివాహ సహాయంగా ఉద్యోగులకు సహాయం కూడా చేస్తుందని కూడా వెల్లడించారు. వివాహ సహాయంగా గతంలో ఇచ్చే 50 వేల సాయాన్ని ఇపుడు లక్షరూపాయలకు పెంచారు.2022లో, ఇద్దరు సీనియర్ సిబ్బందికి మాత్రమే రెండు కార్లను ఇచ్చిన కంపెనీ,ఈ ఏడాది 28 కార్లతోపాటు, 28 బైక్‌లను కూడా కానుకంగా అందించడం విశేషం.
కాగా సరిగ్గా జీతాలు ఇవ్వక ఉద్యోగులను, కార్మికులను దోపిడీ చేస్తున్నారంటూ కంపెనీలపై ఫిర్యాదులు పెరుగుతున్న తరుణంలో చెన్నైకంపెనీ నిర్ణయం విశేషంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment