Tesla: Loss 100 Billion Dollars Value After Musk No New Models Statement - Sakshi
Sakshi News home page

టెస్లాకు భారీ షాక్​.. ఒక్కరోజుల్లో 100 బిలియన్ డాలర్ల వాల్యూ ఢమాల్​

Published Fri, Jan 28 2022 9:20 PM | Last Updated on Sat, Jan 29 2022 9:15 AM

Tesla Loss 100 Billion Dollars Value After Musk No New Models Statement - Sakshi

ప్రపంచంలో ఆటోమేకర్​ కింగ్​గా ఉన్న విరజిల్లుతున్న టెస్లాకు ఘోరమైన దెబ్బ పడింది. ఒక్కరోజులో.. కేవలం ఒకేఒక్క రోజులో 100 బిలియన్​ డాలర్ల మేర కంపెనీ మార్కెట్​ వాల్యూ పడిపోయింది. స్టాక్​ మార్కెట్​లో గురువారం టెస్లా షేర్లు 12 శాతం పడిపోవడమే ఈ భారీ నష్టానికి కారణమని తెలుస్తోంది. 2022 ఆరంభంలోనే ఈమేర భారీ దెబ్బ పడగా.. చాలాకాలం తర్వాత ఈ మేర దిగజారిపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే అమెరికన్​ ఆటో మేకర్​ టెస్లా.. బుధవారం నాడు 2021 ఏడాదికి నాలుగో క్వార్టర్​ ఫలితాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే కిందటి ఏడాది భారీ లాభాల్ని ఆర్జించిన ఏకైక ఈవీ ఆటోమేకర్​గా టెస్లా నిలవడం విశేషం. అయితే ఇంత లాభాల్లో ఉన్నా చిప్​ కొరతల కారణంగా.. 2022లో కొత్త మోడల్స్​ను తీసుకురాలేమని టెస్లా సీఈవో ఎలన్​ మస్క్​ స్వయంగా ప్రకటించడం ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బ తీసింది.
 
ముఖ్యంగా లేబర్​ షార్టేజ్​ ప్రస్తావనతో పాటు సైబర్​ట్రక్​ ఆలస్యం, కొత్త మోడల్స్​ తేలేకపోతున్నట్లు(మోడల్​ 3 కంటే చౌకైన​ ఈవీ మోడల్​ తేబోతున్నట్లు ప్రకటించి.. కస్టమర్లు, ఇన్వెస్టర్లలో ఆశలు రేపాడు) ప్రకటించడంతో ఇన్వెస్టర్లు టెస్లా షేర్ల మీద ఆసక్తి కనబరచలేకపోయారు. పైగా అర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ మీద ఫోకస్​ను జీర్ణించుకోలేకపోయారు. ఈ పరిణామాలతో షేర్ల అమ్మకానికే మొగ్గు చూపించగా.. గురువారం ఒక్కరోజే 100 బిలియన్​ డాలర్ల మేర టెస్లా వాల్యూ పడిపోయింది. ప్రస్తుతం కంపెనీ విలువ 1.2 ట్రిలియన్​ డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్​బర్గ్​ గణాంకాలు చెప్తున్నాయి.

సంబంధిత వార్త: లాభాల్లో కింగూ​.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్​ ఏంటంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement