మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ఏస్ బ్రాండ్‌గా ఉన్న సామ్‌సంగ్ కొత్త మార్కెట్‌పై దృష్టి పెట్టింది. మరోసారి ఫోల్డబుల్, ఫ్లిప్ మోడళ్లతో మార్కెట్‌లో హల్‌చల్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఆగస్టులో సామ్‌సంగ్ ఫ్లిప్, సామ్‌సంగ్ ఫోల్డ్‌లో కొత్త మోడల్స్ రిలీజ్ చేయనుంది. అంతుకు ముందు ఈ సెగ్మెంట్‌లో వచ్చిన ఫోన్లతో పోల్చితే వీటిలో అధునాత ఫీచర్లు ఉండబోతుండగా ధర మాత్రం తగ్గనుంది.
ఓల్డ్ మంత్ర
గడిచిన రెండేళ్లుగా ఫోన్ ఫీచర్లలో పెద్దగా మార్పులు లేవు. ప్రాసెసర్, కెమెరా మెగా పిక్సెల్, డిస్‌ప్లే విషయంలో ఇంచుమించు ఒక సెగ్మెంట్‌లో ఒకే తరహాలో ఫోన్లు వస్తున్నాయి. పైగా కంపెనీలు పోటీ పడి డిస్‌ప్లే సైజు పెంచుకుంటూ పోయాయి. చేతిలో ఫోన్లు ఇమిడే పరిస్థితి ఇప్పుడు లేదు. దీంతో క్రమంగా చేతిలో ఇమిడిపోయే ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో తేవాలని సామ్‌సంగ్ నిర్ణయించింది. అందులో భాగంగానే సామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 3, సామ్‌సంగ్ జడ్ ఫ్లిప్ 3 మోడళ్లు మార్కెట్‌లోకి తేవాలని నిర్ణయించింది. ఆగష్టు మొదటి వారంలో లాంఛింగ్ ఈవెంట్ జరిపి... ఆగష్టు చివరి వారంలో మార్కెట్‌లోకి తేవడం సామ్‌సంగ్ ప్రణాళికలో ఓ భాగంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
కొత్త వ్యూహం
రెండేళ్ల క్రితం సామ్‌సంగ్ జడ్ ఫోల్డ్ మోడల్‌ని మార్కెట్‌లోకి సామ్‌సంగ్ తెచ్చింది. అయితే దీని ధర లక్షకు పైగా ఉండటంతో ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. దీంతో మొబైల్ వీడియో కంటెంట్‌కు ఇబ్బంది రాకుండా చేతిలో ఇమిడి పోయే ఫోల్డ్, ఫ్లిప్‌కు మార్కెట్ ఉంటుందని సామ్‌సంగ్ బలంగా విశ్వసిస్తోంది. అయితే ధర ఈ మోడళ్ల అమ్మకాకలు అడ్డంకిగా మారిన ప్రైస్ బ్యారియర్‌ని తొలగించే పనిలో ఉంది. అందులో భాగంగా రాబోయే కొత్త మోడళ్లు 20 శాతం తగ్గింపు ధరతో తెచ్చే అవకాశం ఉందని టెక్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంటుందనే నమ్మకంతోనే సామ్‌సంగ్ భారీ ఎత్తున వీటి ఉత్పత్తి చేపట్టింది. ఇప్పటికే ఐఫోన్ సైతం మినీ పేరుతో 5 అంగులాల తెర ఉన్న ఫోన్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది.
చదవండి : మార్కెట్‌లోకి సోనీ టీవీ.. ధర వింటే షాక్
Comments
Please login to add a commentAdd a comment