హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2.86 లక్షల యూనిట్ల ఆర్డర్ బుక్. 2024లో రానున్న కొత్త మోడళ్లు. వెరశి సామర్థ్యం పెంచుకోవడంపై వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా దృష్టిసారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలకు 55,000 యూనిట్ల స్థాయికి తయారీని చేర్చే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన పెట్టుబడి ప్రణాళికను 3–6 నెలల్లో మహీంద్రా ప్రకటించనుంది. ప్రధానంగా ఈవీ విభాగంలో ఈ పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం.
మహీంద్రా ఇప్పటికే 2021–22 నుంచి 2023–24 మధ్య రూ.10,000 కోట్లు వెచి్చస్తోంది. 2024 మార్చి నాటికి నెలకు అన్ని విభాగాల్లో కలిపి 49,000 యూనిట్ల తయారీ సామర్థ్యానికి చేరుకోవాలి సంస్థ ఇప్పటికే లక్ష్యం విధించుకుంది. అయిదు డోర్ల థార్, కొత్త ఈవీ మోడళ్లు రానుండడంతో 49,000 యూనిట్ల స్థాయికి మించి తయారీ సామర్థ్యం ఉండాలన్నది కంపెనీ భావన. థార్, ఎక్స్‌యూవీ 700, స్కారి్పయో మోడళ్లకు బలమైన డిమాండ్‌తో గడిచిన అయిదేళ్లలో దాదాపు రెండింతలకుపైగా సామర్థ్యం పెంచుకుంది.
రెండవ స్థానంలో మహీంద్రా..
ఇక వచ్చే 12 నెలల్లో ఎక్స్‌యూవీ 400, ఎక్స్‌యూవీ 300 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు సైతం రానున్నాయి. బలమైన బ్రాండ్ ఇమేజ్ కారణంగా కొన్ని మాసాలుగా సగటున నెలకు 51,000 యూనిట్ల స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. నవంబర్ 1 నాటికి ఉన్న ఆర్డర్ బుక్ ప్రకారం ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 400 మోడళ్లకు 10,000 యూనిట్లు, ఎక్స్‌యూవీ 700 కోసం 70,000, థార్ 76,000, బొలెరో 11,000, క్లాసిక్ వేరియంట్‌తో కలిపి స్కారి్పయో–ఎన్ 1,19,000 యూనిట్లు కస్టమర్లకు చేరాల్సి ఉంది. 2023 జూలై–సెపె్టంబర్ మధ్య దేశవ్యాప్తంగా మహీంద్రా ఎస్‌యూవీలు 1,14,742 యూనిట్లు రోడ్డెక్కాయి. పరిమాణం పరంగా అయిదు త్రైమాసికాలుగా ఎస్‌యూవీల అమ్మకాల్లో మహీంద్రా రెండవ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment