మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్రా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇండిగో అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా కంపెనీ తన బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు పేరును 'బీఈ 6'గా మారుస్తున్నట్లు వెల్లడించింది. రెండు కంపెనీల మధ్య సంఘర్షణ అవసరం లేదు. కాబట్టే ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే త్వరలో విక్రయానికి రానున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు 'బీఈ 6'గా రానుంది.
6ఈ పేరుతో ఇండిగో సేవలు
ఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది. అయితే మహీంద్రా కంపెనీ తన కారు పేరును మార్చుకోవడంతో సమస్య సద్దుమణిగినట్లే అని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment