భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ విభాగంలో భారీ పెట్టుబడులను పెట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ తరుణంలో దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఏకంగా రూ. 12000 కోట్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.
కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పెట్టుబడిన పెట్టింది. 2027 నాటికి మహీంద్రా ఆరు బ్యాటరీతో నడిచే స్పోర్ట్ యుటిలిటీ వాహనాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల అభివృద్దికి వేలకోట్ల పెట్టుబడి పెట్టడంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్స్ భారీగా పెరిగాయి.
UK ఆధారిత కంపెనీ బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ (BII) 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, Temasek మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లిమిటెడ్ (MEAL) లో 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అంగీకరించిన కాలక్రమం ప్రకారం మిగిలిన రూ.900 కోట్లను టెమాసెక్ పెట్టుబడి పెడుతుందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment