న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోలు ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే ఇండియాలో నంబర్ వన్ ఆటోమొబైల్ కంపెనీ మారుతి భిన్నమైన మార్గం ఎంచుకుంది.
సీఎన్‌జీకే మొగ్గు
సీఎన్‌జీ మోడళ్ల సంఖ్యను పెంచాలని వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకి నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ మోడళ్లకు గిరాకీ రావడంతో కంపెనీ సీఎన్‌జీ వైపు మళ్లింది.
మరిన్ని మోడల్స్
త్వరలో కొత్తగా మరో నాలుగు మోడళ్లకు సీఎన్‌జీ శ్రేణిని విస్తరించనున్నట్టు సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. ‘ప్రస్తుతం ఎనిమిది మోడళ్లకు సీఎన్‌జీ వేరియంట్స్ ఉన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని సీఎన్‌జీ మోడల్స్ అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం పెండింగ్‌లో 2.8 లక్షల యూనిట్లు ఉన్నాయి. ఇందులో 1.1 లక్షల యూనిట్లు సీఎన్‌జీ వేరియంట్లే. ఒక్కో కిలోమీటర్‌కు పెట్రోల్, డీజిల్ వాహనమైతే రూ.5 ఖర్చు అవుతోంది. అదే సీఎన్‌జీ అయితే రూ.1.7 మాత్రమే. దేశవ్యాప్తంగా 260 నగరాలు, పట్టణాల్లో 3,400 సీఎన్‌జీ స్టేషన్స్ ఉన్నాయి’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment