ఫియట్ నుంచి రెండు కొత్త మోడళ్లు | Fiat unveils Punto Abarth,crossover Avventura at Rs 9.95 lk | Sakshi
Sakshi News home page

ఫియట్ నుంచి రెండు కొత్త మోడళ్లు* పుంటో అబర్త్, క్రాసోవర్ అబర్త్ అవెంచుర * ధర రూ. 9.95 లక్షలు న్యూఢిల్లీ: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ కంపెన

Published Tue, Oct 20 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

ఫియట్ నుంచి రెండు కొత్త మోడళ్లు

ఫియట్ నుంచి రెండు కొత్త మోడళ్లు

* పుంటో అబర్త్, క్రాసోవర్ అబర్త్ అవెంచుర  
* ధర రూ. 9.95 లక్షలు
న్యూఢిల్లీ: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ కంపెనీ రెండు కొత్త మోడళ్లను సోమవారం మార్కెట్లోకి  తెచ్చింది. ప్రీమియం హ్యాచ్‌బాక్ పుంటో అబర్త్,  క్రాసోవర్ అబర్త్ అవెంచుర మోడళ్లను అందిస్తున్నామని  ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కెవిన్ ఫ్లిన్ చెప్పారు. ఈ రెండు మోడళ్ల ధరనూ ఒకేస్థాయిలో రూ.9.95 లక్షలుగా నిర్ణయించారు. పండుగ సీజన్‌లో ఈ రెండు కార్లు మంచి అమ్మకాలు సాధిస్తాయన్న ఆశాభావాన్ని కెవిన్ వ్యక్తం చేశారు.
 
కార్ల ప్రత్యేకతలు: ఈ రెండు కార్లలో 1.4 లీటర్ టి-జెట్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్, 5 గేర్లు వంటి ఫీచర్లున్నాయని కెవిన్ పేర్కొన్నారు. ఫియట్ అబర్త్ పుంటోలో సెకండరీ ఎయిర్‌డ్రమ్స్, స్పోర్టీయర్ రియర్ బంపర్, 16 అంగుళాల డ్యుయల్-టోన్ అలాయ్ వీల్స్, 7 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబీడీ)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement