కొత్త రాష్ట్రం.. కొత్త వాహనం.. కొత్త నంబర్.. | New series vehicle registrations | Sakshi
Sakshi News home page

కొత్త రాష్ట్రం.. కొత్త వాహనం.. కొత్త నంబర్..

Published Thu, Jun 19 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM

కొత్త రాష్ట్రం.. కొత్త వాహనం.. కొత్త నంబర్..

కొత్త రాష్ట్రం.. కొత్త వాహనం.. కొత్త నంబర్..

ఖమ్మం క్రైం: తెలంగాణ రాష్ట్రంలో కొత్త సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పాటుకు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు కూడా వాహనదారులు ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేయించకుండా... ‘కొత్త రాష్ట్రం.. కొత్త నంబర్..’ కోసం ఇన్నాళ్లూ వేచి ఉన్నారు.
     
జిల్లాకు కేటాయించిన టీఎస్ 04 సిరీస్‌తో మొదటి రోజున జిల్లాలో మొత్తం 467 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ జరిగింది.
     
ఖమ్మం ప్రాంతీయ రవాణా కార్యాలయంలో 201 నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు, 134 ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు, సత్తుపల్లిలో 104 నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు, కొత్తగూడెంలో 28 నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు రిజిస్ట్రేషన్ జరిగింది.
     
 ఖమ్మంలో టీఎస్ 04 ఈఏ 0001 నుంచి రిజిస్ట్రేషన్ మొదలైంది. ఈ నంబరును పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి రూ.50వేలు చెల్లించి స్వంతం చేసుకున్నారు. 0005, 0007 నంబర్లపై ఎవరూ ఆసక్తి చూపలేదు.
     
 సత్తుపల్లిలో టీఎస్ 04 ఈసీ 0001 నుంచి రిజిస్ట్రేషన్ మొదలైంది. టీఎస్ 04 ఈసీ 0001 నంబర్‌ను డాక్టర్ రాంవరప్రసాద్ తీసుకున్నారు. ఇక్కడ కూడా 0005, 0007 నంబర్ ఎవరూ తీసుకోలేదు. 45వ నంబర్‌కు ఇద్దరు పోటీపడ్డారు. 666 నబర్‌ను ఆర్.రంగరాజు అనే వ్యాపారి రూ.11,100 చెల్లించి తీసుకున్నారు.
     
కొత్తగూడెంలో టీఎస్ 04 ఈబీ 0001 నంబర్‌తో రిజిస్ట్రేషన్ మొదలైంది. ఈ నంబర్‌ను ఇంకా ఎవరూ తీసుకోలేదు.  నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు టీఎస్ 04 ఈఏ 0001, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు టీఎస్ 04 యూఏ 0001 నంబర్లను కేటాయించారు.
 
ఫ్యాన్సీ నంబర్లపై తగ్గిన మోజు
గతంలో ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు ఎక్కువ మోజు చూపేవారు. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన మొదటి రోజు మాత్రం ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవడంలో వాహనదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఫ్యాన్సీ నంబర్లు తీసుకునేందుకు కొంత నగదు చెల్లించాల్సుంటుంది. కొత్త రాష్ట్రంలో.. కొత్త వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఎక్కువగా తీసుకుంటారని, ఎక్కువ ఆదాయం వస్తుందని రవాణ శాఖాధికారులు భావించారు. కానీ ఎక్కువమంది ఆసక్తి చూపకపోవడంతో కొంత ఆదాయం తగ్గేలా ఉందని అధికారులు చెబుతున్నారు.
 
సత్తుపల్లి రవాణా శాఖ కార్యాలయానికి రికార్డుస్థాయి ఆదాయం
సత్తుపల్లి టౌన్: సత్తుపల్లి రవాణా శాఖ కార్యాల యం బుధవారం రికార్డు స్థాయిలో ఆదాయా న్ని ఆర్జించింది. టీఎస్ సిరీస్ గెజిట్ నోటిఫికేషన్ జారీతో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. టీఎస్ సిరీస్ నంబర్లకు గిరాకీ ఏర్పడింది. సాధారణ రోజుల్లో రోజువారీగా కొత్త వాహనాల రిజి స్ట్రేషన్లు 10 నుంచి 15 వరకు మాత్రమే జరుగుతుం టాయి. వీటి ద్వారా రోజుకు 30 నుంచి 40వేల మేర ఆదాయం లభిస్తుంది. కానీ, బుధవారం ఒక్క రోజు లోనే గతంలో ఎన్నడూ లేనంతగా రూ.2,13,665 ఆదాయం వచ్చింది.
 
టీఎస్ 04 ఈసీ0001 నంబర్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ బుధవారమే ప్రారంభమైంది. తొలి నంబర్‌ను వేలం పాటలో  రూ.50వేలకు ఓ వ్యక్తి పాడుకున్నారు. స్పెషల్ నంబర్లకు ఆన్‌లైన్‌లో జరిగిన వేలం పాటలో అనేకమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. 0666 నంబర్‌ను ఓ వ్యక్తి రూ.30వేలకు స్వంతం చేసుకున్నారు.  తొలి రోజే 90 వాహనాలకు నంబర్లను ఎంవీఐ శంకర్ కేటాయించారు. ఇందులో 21 నంబర్లను వేలం పాట ద్వారా, మిగతా వాటిని సాధారణ పద్ధతిలో కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement