vehicle registrations
-
ఆ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: సుప్రీం ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకున్న బీఎస్–4 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) జరిగిన వాటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని రవాణా అధికారులు సూచించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 30న పెండింగ్‌లో ఉన్న బీఎస్–4 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే వీటిలో కొన్ని వాహనాలకు వాహన యజమాని సెకండ్ వెహికల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. వీటి రిజిస్ట్రేషన్ కార్డు, ఈ వాహనాలపై ఇతర ట్రాన్సాక్షన్స్‌ను రవాణా అధికారులు నిలిపి ఉంచారు. మళ్లీ ఇప్పుడు టీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని శాశ్వత రిజిస్ట్రేషన్ లేని బీఎస్–4 వాహనాలకు ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. ► సెకండ్ వెహికల్ ట్యాక్స్‌ను ్చpట్ట్చఛిజ్టీజ్డీ్ఛn. ్ఛpట్చజ్చ్టజిజీ.ౌటజ ద్వారా చెల్లించాలి. ► ట్యాక్స్ చెల్లించిన వెంటనే ఈ వివరాలు రవాణా అధికారులకు తెలియజేస్తే ఆ వాహనంపై పెట్టిన లాక్ రిలీజ్ చేసి రవాణా అధికారులు ఆర్సీ పంపుతారు. ► రవాణా శాఖ అన్ని రకాల సేవల్ని గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. -
బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్
న్యూఢిల్లీ: బీఎస్4 ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్ పడింది. మార్చిలో లాక్డౌన్ విధించిన తర్వాత జరిగిన వాహన విక్రయాల అంశంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెడితే .. గత ఆదేశాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్4 ఇంధన ప్రమాణాలతో తయారైన వాహన విక్రయాలు నిల్చిపోవాలి. బీఎస్6 వాహన విక్రయాలు మాత్రమే జరగాలి.లాక్డౌన్ వల్ల బీఎస్4 వాహన విక్రయాల విషయంలో కాస్త సడలింపు దక్కింది. లాక్డౌన్ ఎత్తివేశాక 10 రోజుల పాటు వీటిని అమ్ముకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. కానీ మార్చి 25 తర్వాత లాక్డౌన్ అమలు కాలంలో కూడా భారీ స్థాయిలో బీఎస్4 వాహనాల విక్రయాలు జరగడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది. -
ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్‌మాల్
సాక్షి, అమరావతి/అనంతపురం సెంట్రల్: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలైన జేసీ బ్రదర్స్ అక్రమ వ్యవహారాలు విస్తుగొలుపుతున్నాయి. జేసీ బ్రదర్స్‌కు చెందిన కంపెనీ చేసిన అక్రమాలు రవాణా శాఖ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారంలో వీరి అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ బస్సుల్ని తిప్పి అక్రమాలకు తెగబడ్డారు. దొంగ పర్మిట్లతో బస్సులు నడపడం ఓ ఎత్తు అయితే.. తాజాగా బయల్పడిన దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిషేధిత బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా చూపి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారం కలకలం రేపింది. ఈ అక్రమ వ్యవహారాన్ని రవాణా రంగ నిపుణులు నేషనల్ ఫ్రాడ్‌గా పేర్కొంటున్నారంటే దీని తీవ్రత ఎంతో ఇట్టే అర్థం అవుతోంది. దివాకర్ రోడ్లైన్స్కు చెందిన రెండు బస్సులకు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించి ఇతర రాష్ట్రాల వారికి విక్రయించిన ఘటనలో ఆర్టీఏ అధికారుల ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో వారి బాగోతాల చిట్టాలో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి. అధికారులు సీజ్ చేసిన లారీల ఛాసీలు బీఎస్4 పేరుతో అక్రమాలు – బీఎస్–3 శ్రేణి వాహనాలను అత్యధికంగా కాలుష్యం వెదజెల్లే వాహనాలుగా గుర్తించిన సుప్రీంకోర్టు 2017 మార్చి 29న వాటి తయారీని నిషేధించింది. 2017 ఏప్రిల్ 1 తర్వాత ఈ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయాలు, రిజిస్ట్రేషన్ చేయరాదని ప్రకటించింది. – అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ట్రాన్స్‌పోర్టు రంగంలో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుభవంతో అశోక్ లైలాండ్ కంపెనీకి చెందిన లారీలు, టిప్పర్లను కారుచౌకగా కొట్టేయాలని భావించారు. – జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలకు చెందిన జఠాధర ఇండస్ట్రీస్, జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్‌రెడ్డికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీలు.. గడువు మీరిపోయి విక్రయం కాకుండా నిలిచిపోయిన 154 లారీలను నాగాలాండ్‌కు వెళ్లి అశోక్ లైలాండ్ కంపెనీ నుంచి తుక్కు(స్క్రాప్) కింద అతి తక్కువ ధరకు కొనుగోలు చేశాయి. – ఒకేసారి 154 వాహనాలను జఠాధర కంపెనీ పేరుతో జేసీ ఉమారెడ్డి పేరు మీద, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీతో సి.గోపాల్‌రెడ్డి పేర్ల మీద తప్పుడు పత్రాలు సమర్పించి 2018లో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత కొన్ని లారీలను వారే నిర్వహిస్తుండగా మరికొన్నింటిని ఇతర లారీ ఓనర్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ పత్రాలతో బీమా కంపెనీలను బురిడీ కొట్టించారు. ఇలా బట్టబయలు.. – ఈ వాహనాలు రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో తొలుత 66 వాహనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 10న అశోక్ లే లాండ్ కంపెనీకి ఏపీ రవాణా అధికారులు లేఖ రాశారు. అ కంపెనీ అదే నెల 23న పూర్తి వివరాలు పంపించింది. – కాలం చెల్లిన బీఎస్–3కి చెందిన 66 వాహనాలలో 40 వాహనాలను తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీకి, మరో 26 వాహనాలను జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు తుక్కు కింద విక్రయించినట్లు అశోక్ లే లాండ్ కంపెనీ తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన రవాణా శాఖ ప్రధాన రికార్డులను పరిశీలించింది. – ఆ వాహనాలన్నింటినీ నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఎన్ఓసీ తీసుకుని అనంతపురం జిల్లాకు తరలించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది. అనంతరం రవాణా శాఖ, అనంతపురం జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారుల బృందం నాగాలాండ్ రా«జధాని కోహిమాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరించగా అక్రమాల డొంక కదిలింది. – వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఈ రెండు కంపెనీలు ఇచ్చిన అశోక్ లే లాండ్ కంపెనీ ఇన్వాయిస్లలో ఎక్కడా ఒకదానితో మరొక దానికి పోలిక లేకుండా వేర్వేరు తేదీలతో ఉన్నాయి. పైగా ఇన్వాయిస్లను మార్చి సమర్పించిన ఈ రెండు కంపెనీలు తమ వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్ పొందాయి. – ఉత్తరాఖండ్‌లోని కళ్యాణ్పూర్, తమిళనాడు హోసూరులో ఉన్న అశోక్ లే లాండ్ కంపెనీలు ఆ ఇన్వాయిస్లు ఇచ్చాయి. ఆ వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసినప్పటికీ, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు రికార్డులు సృష్టించి వాటిని యథేచ్ఛగా నడిపారు. తాడిపత్రిలో గత శుక్రవారం అధికారులు సీజ్ చేసిన బీఎస్3 టిప్పర్లు కేసు నమోదు – వీటన్నింటి నేపథ్యంలో అనంతపురం 1వ టౌన్ పోలీసు స్టేషన్లో జేసీ బ్రదర్స్ కంపెనీపై రవాణా శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. – జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ యజమానులు, వారి భాగస్వాములతో పాటు, ఆయా సంస్థల ప్రతినిధులపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. తదనంతరం మరింత లోతుగా దర్యాప్తు చేస్తే దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిట్‌గా ఉన్నాయంటూ తప్పుడు పత్రాలు – తుక్కు కింద బీఎస్–3 ప్రమాణాలతో కూడిన 154 వాహనాలను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ 50 వాహనాలు కొనుగోలు చేయగా, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ 104 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసింది. – వీటన్నింటికీ నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నాయంటూ, బీఎస్–4 ప్రమాణాలతో ఉన్నాయంటూ దేశంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ చేయించారు. వీటిలో అత్యధికం అనంతపురం జిల్లాలోనే జరిగాయి. – ఆయా వాహనాల ఛాసిస్ నంబర్లను రవాణా అధికారులు పరిశీలించగా, అన్నీ బీఎస్–3కు చెందినవేనని తేలింది. ఇదే విషయాన్ని అశోక్ లే లాండ్ కంపెనీ ప్రతినిధులు కూడా నిర్ధరించారు. – దీంతో 154 వాహనాల లావాదేవీలు నిషేధించేందుకు రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్‌కు లేఖ రాశారు. ఇందులో 28 వాహనాలను ఇప్పటికే ఎన్ఓసీపై వేరే రాష్ట్రాలకు తరలించారు. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపించారు. ‘వాహన్’ డేటాబేస్‌లో అన్ని వాహనాలను బ్లాక్ చేయాలని కోరారు. – ఈ వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లాలో 24, కర్నూలులో 3.. మొత్తం 27 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్‌రెడ్డిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. – ఈ 154 వాహనాల్లో ప్రస్తుతం ఆంధ్రపదేశ్‌లో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, నాగాలాండ్‌లో 3, తమిళనాడు, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు గుర్తించారు. మనరాష్ట్రంలో 79 వాహనాలు అనంతపురం జిల్లాలో, 8 నెల్లూరు, 5 చిత్తూరు, 3 కడప, 2 వాహనాలు గుంటూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇప్పటి వరకు 53 వాహనాలను సీజ్ చేశారు. అక్రమాలు కప్పిపుచ్చే యత్నం – ప్రభుత్వం అక్రమాలను వెలికి తీయడంతో జేసీ సోదరులు వాటిని కప్పిపుచ్చేందుకు యత్నించారు. ఆయా వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇటీవల జేసీ నివాసం వద్దకు వెళ్లి గొడవకు దిగారు. మరికొందరు వారి నివాసం వద్ద ధర్నా చేసిన దాఖాలాలు కూడా ఉన్నాయి. – పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించడంతో జేసీ సోదరులు వారితో బేరసారాలకు దిగినట్లు తెలిసింది. ఒక్కొ లారీ యజమానికి రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇలా 35 మందికి చెల్లించినట్లు సమాచారం. -
జేసీ ట్రావెల్స్: అంతులేని అక్రమాలు..!
-
జేసీ బ్రదర్స్ కంపెనీపై 24 క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా చూపించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించిన జేసీ బ్రదర్స్ కంపెనీ జటాధర ఇండస్ట్రీస్‌పై 24 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ (రోడ్ సేఫ్టీ) ఎస్ఏవీ ప్రసాదరావు తెలిపారు. మంగళవారం విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో అదనపు కమిషనర్ పి.శ్రీనివాస్, జాయింట్ కమిషనర్ (ఐటీ, ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్) ఎల్ఎస్ఎం రమాశ్రీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రసాదరావు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ► అశోక్ లేలాండ్ కంపెనీ ఉత్పత్తి చేసిన బీఎస్–3 లారీలను తుక్కు (స్క్రాప్) కింద విక్రయించగా.. వాటిని జేసీ బ్రదర్స్ కంపెనీ కొనుగోలు చేసింది. ► వాటిలో 98 లారీలను నాగాలాండ్‌లో, 32 లారీలను ఏపీలో, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో 24 లారీలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ► ప్రస్తుతం ఈ 154 లారీల్లో ఏపీలో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మరో మూడు లారీలు గుర్తించాల్సి ఉంది. ► వీటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన మొత్తం లారీలను బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్‌కు లేఖ రాశారు. ► జాతీయ డేటాబేస్ ‘వాహన్’ నుంచి ఈ రిజిస్ట్రేషన్లు తొలగించాలని కోరాం. ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశాం. మిగిలిన ఆరు లారీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. ► ఇందులో 80 లారీలు అనంతపురం, 5 కర్నూలు, మరో 5 చిత్తూరు, కడపలో 3, గుంటూరులో 2 చొప్పున ఉన్నాయి. లారీల బీమా పత్రాలను పరిశీలించగా.. అవి కూడా నకిలీవేనని తేలాయి. యునైటెడ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బీమా కంపెనీలకు సమాచారం ఇచ్చాం. ► అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన లారీలను జటాధర కంపెనీ ప్రతినిధులు వివిధ జిల్లాల్లో విక్రయించారు. కొనుగోలు చేసిన వారు తాము మోసపోయామని గుర్తించి జేసీ బ్రదర్స్ కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. ► వారిని జేసీ బ్రదర్స్ సంప్రదించి వ్యవహారం సెటిల్ చేసుకునేందుకు రూ.12 నుంచి రూ.14 లక్షలు తిరిగి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు మా దృష్టికి వచ్చింది. ► ఈ వ్యవహారానికి సంబంధించి జటాధర కంపెనీ డైరెక్టర్లు జేసీ ఉమాదేవి, అస్మిత్ రెడ్డి, సి.గోపాలరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి అమ్మేశారు
-
బీఎస్–4 వాహనం పట్టుబడితే భారీ జరిమానా
సాక్షి, అమరావతి: ఈ నెలాఖరులోగా బీఎస్–4 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించకపోతే యజమానులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ వాహనాలను స్క్రాప్‌గా పరిగణించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని ఆ శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాన్సీ నంబర్ కోసం ఎదురు చూస్తూ మార్చి 31లోగా రిజిస్ట్రేషన్ చేయించని బీఎస్–4 వాహనం పట్టుబడితే భారీగా జరిమానా విధించాలని, ఆ వాహనాన్ని స్క్రాప్‌గా పరిగణించాలన్నారు. - ఈ నెల 25లోగా బీఎస్–4 వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇప్పటికే రవాణా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. - ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేస్తారు. - యజమానులు తమ పేరిట ఉన్న రెండో వాహనానికి అదనపు ట్యాక్స్ కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రవాణా అధికారులు గుర్తించారు. - అలాంటి యజమానులకు వాహన డీలర్లు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. - దీంతో వాహన డీలర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. - రెండో వాహనం ఉన్న యజమానులు ఈ నెల 25లోగా అదనపు ట్యాక్స్ చెల్లించాలన్నారు. -
బీఎస్–4.. రిజిస్ట్రేషన్ల జోరు
సాక్షి, అమరావతి: బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ రవాణా శాఖ వాహన డీలర్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయిస్తోంది. మొన్నటి వరకు రోజుకు సగటున 3–4 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఇప్పుడు 5 వేలకు పైగా జరుగుతున్నాయి. దీంతో రెండ్రోజులకే రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతోంది. ఈ నెల రెండో వారం తరువాత ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 10 వేల వరకు జరిగే అవకాశం ఉందని రవాణా శాఖ భావిస్తోంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని రవాణా శాఖ కార్యాలయాల యూనిట్లలో చేశామని అధికారులు చెబుతున్నారు. నేరుగా బీఎస్–6కు.. ► వాహన రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలోనూ కాలుష్యం, రోడ్డు భద్రత, మెకానికల్ అంశాలకు సంబంధించి భారత్ స్టాండర్డ్స్ (బీఎస్) పేరిట నాణ్యత ప్రమాణాలను నిర్ణయించారు. ► వీటిని బీఎస్–1, 2, 3, 4, 5, 6 కేటగిరీలుగా విభజించారు. ప్రస్తుతం బీఎస్–4 వాహనాల నుంచి బీఎస్–5 కాకుండా నేరుగా బీఎస్–6కు వెళ్లారు. బీఎస్‌లో ప్రధానంగా కాలుష్యంపైనే అత్యున్నతంగా ప్రమాణాలను నిర్దేశించారు. బీఎస్–6 వాహనాలు 68 శాతం కాలుష్య రహితంగా రూపొందించారు. ► అన్ని కంపెనీలకు బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్లు డీలర్ల వద్దే జరగనుండటంతో వీటిపై రవాణా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏయే పేర్లతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగే వాహనదారులకు రెండో వాహనం ఉందా? అన్న అంశాలపై దృష్టి పెట్టారు. ► రెండో వాహనం ఉంటే రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు సహా బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ►ఈ నేపథ్యంలో బీఎస్–4 వాహనాలకు కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధరలను తగ్గించారు. ►కొందరు డీలర్లు బీఎస్–4 వాహనాలను తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించి ఏప్రిల్ తర్వాత ప్రీ ఓన్డ్ షోరూంలకు తరలించే ఆలోచన చేస్తున్నారని రవాణా అధికారులు చెబుతున్నారు. -
ఆఫ్‌లైన్‌లో వాహనాల రిజిస్ట్రేషన్
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఈ నెల 28 నుంచి మార్చి 7 వరకూ వాహనాల బదిలీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో స్వయంగా లావాదేవీలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్టీఓ షేక్ కరీం తెలిపారు. ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సుమారు 1500 వాహనాలు అమ్మకాలు జరిగిన తరువాత ఓనర్షిప్ మార్పులు చేసుకోకుండా ఉండిపోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల వాహనాలు ఈ విధంగా యాజమాన్యం మార్పు లేకుండా ఉండిపోయాయన్నారు. ఈ విధమైన వాహనాలు రిజిస్ట్రేషన్‌లో స్వయంగా మార్పులు చేసుకునేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆన్లైన్ విధానంలో ఇప్పటి వరకూ అమ్మకం జరిపిన వాహనం ఓనర్షిప్ మారాలంటే అమ్మకందారుడు, కొనుగోలు దారుడు ఇద్దరూ ఉండాల్సి వచ్చేదన్నారు. కానీ వారం రోజుల పాటు ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టి స్వయంగా ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి వాహనాలు బదిలీని చేసుకునే వీలు కల్పించిందన్నారు. వాహనం సేల్ లెటర్‌తో పాటు పొల్యూషన్ సర్టి ఫికెట్, ఇన్సూరెన్స్, సీబుక్, మొదలగు సర్టి ఫికెట్లతో కొనుగోలుదారుడు కార్యాలయానికి వస్తే ఈ మార్పులు చేసుకోవచ్చన్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మకందారులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో వాహన యాజమాన్యం మార్పులు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆటో యజమానులు సైతం మార్పులు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ లావాదేవీలు జరపడానికి దళారులను ఆశ్రయించవద్దన్నారు. స్వయంగా కార్యాలయానికి వచ్చి అధికారుల సహాయం పొందాలన్నారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
బైబై బీఎస్– 4.. మార్చి 31 వరకే రిజిస్ట్రేషన్
కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారత్ స్టేజ్–6 వాహనాలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న బీఎస్–4 వాహనాల విక్రయాలు నిలిచిపోనున్నాయి. రవాణాశాఖ అధికారులు మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ వాహనాలకురిజిస్ట్రేషన్లు చేయనున్నారు. సుప్రీం ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. దీంతో ఆయా షోరూంల్లో ఉన్న బీఎస్–4 వాహనాలను విక్రయించేందుకు, డీలర్లు ప్రయత్నాలుప్రారంభించారు. నెల్లూరు(టౌన్): ప్రస్తుతం జిల్లాలో పలు షోరూంల్లో ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ బీఎస్–4 వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు తప్పేలా లేదు. ఇప్పటి నుంచి కొనుగోలు చేసిన వాహనాలను తాత్కాలిక, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే వారికి అప్పగించాలని జిల్లా రవాణాశాఖ అధికారులు ఆయా షోరూం డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాన్ని అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కొనుగోలు చేసి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోని వాహనాలను గుర్తించి వెంటనే వాటికి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. మార్చి 31వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బీఎస్–4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితుల్లేవు. వాహన డీలర్లు సైతం నిర్ణీత గడువులోపు తమ షోరూంల్లోని బీఎస్–4 వాహనాలను విక్రయిస్తుండంతో పాటు వాటికి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. షోరూం డీలర్లతో సమావేశం నిర్వహిస్తున్న డీటీసీ సుబ్బారావు ఇక నుంచి వాటికి మాత్రమే.. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇప్పటికే బీఎస్–4 వాహనాలు ఆయా షోరూంల్లో వందల సంఖ్యలో నిల్వ ఉన్నట్లు తెలిసింది. వాటిని త్వరగా విక్రయించడం లేదా తయారీ కంపెనీలకు అప్పగించడం చేయాల్సి ఉంటుంది. 2017 మార్చి 31తో బీఎస్–3 వాహనాలను నిలిపి వేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–4 వాహనాలను విక్రయించారు. అయితే మార్చి 31వ తేదీ లోపు కొనుగోలు చేసిన బీఎస్–3 వాహనాలకు ఏప్రిల్ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండదు.రాయితీలు ప్రకటిస్తారా... గతంలో బీఎస్–3 వాహనాలకు గడువు విధించిన సమయంలో ఆయా షోరూం యజమానులు వాహనాల కోనుగోలు కోసం భారీగా రాయితీలు ప్రకటించారు. ఒక్కో వాహనం మీద ధరను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ ఇచ్చారు. అయితే ఈసారి అదే విధంగా రాయితీలు ఇస్తారా లేక నిర్ణయించిన ధరకే అమ్ముతారన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. గతంలో రోజుకు అన్ని వాహనాలు కలిపి 350కి పైగా రిజిస్ట్రేషన్ అయ్యేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో డీలర్లు డీలా పడిన పరిస్థితి ఉంది. డీలర్లతో సమావేశం రవాణా కార్యాలయంలో గురువారం ఉప రవాణా కమిషనర్ సుబ్బారావు జిల్లాలోని ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహన డీలర్లతో సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఇప్పటి నుంచి షోరూంల్లో కొనుగోలు చేసిన బీఎస్–4 మోడల్‌కు సంబంధించి ప్రతి వాహనానికి తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్‌ను చేసిన తర్వాతే యజమానులకు అప్పగించాలని తెలిపారు. ఈ ఆదేశాలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. గతంలో విక్రయించి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కాని వాహనాలను గుర్తించి వాటికి మార్చి 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. -
ఒకే నంబర్‌తో రెండు బైక్‌లు..
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): రోడ్డుపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే క్లిక్.. రాంగ్ పార్కింగ్ చేస్తే క్లిక్.. రికార్డులు లేకుండా వాహనం నడిపితే క్లిక్.. ఇలా క్లిక్ క్లిక్.క్లిక్ మనిపిస్తున్నారు మన పోలీసులు. అంత వరకూ బాగానే ఉంది. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే వెనుక నుంచి ఫొటోలు తీయడంలో మన పోలీసులు దిట్ట. అందులో సందేహమే లేదు. ఇక నేరుగా మేటర్లోకి వచ్చేద్దాం.. నగరంలోని ఆరిలోవ ప్రాంతానికి చెందిన దూళి ప్రభాకర్ అనే వ్యక్తికి పల్సర్ బైక్ ఉంది. దాని నెంబరు ఏపీ 31 డీజే 7499. ఇటీవల కాలంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు మద్దిలపాలెం, జగదాంబ జంక్షన్ వద్ద రెండు సార్లు ఫైన్ వేశారు. రూ.135 చొప్పున. ఇదిలా ఉండగా ఇదే నెంబరుతో భీమిలి నియోజకవర్గం తగరపువలసలో మరో వ్యక్తి సీడీ 100 వాహనాన్ని నడుపుతున్నాడు. దానిపై ఐదారు కేసులు నమోదు చేశారు. తగరపువలస మార్కెట్లో అడ్డదిడ్డంగా ఆ వాహనాన్ని నిలిపినందుకు, హెల్మ్‌ట్ లేకుండా వాహనం నడిపినందుకు ఆ ప్రాంత పోలీసులు ఇ–చలనాలు పంపారు. ఆ ఇ–చలానాలు నేరుగా ఒరిజినల్ వాహనదారుడు(పల్సర్ వాహన వ్యక్తి)కి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను రెండు సార్లే ఫైన్ కట్టాల్సి ఉండగా..ఆరేడు కేసులకు సంబంధించి ఫైన్ కట్టాల్సి ఉన్నట్టు ఇ–చలానాలు పంపడమేంటని ఒరిజనల్ ద్విచక్రవాహనదారుడు వాపోతున్నాడు. ఈ విషయమై ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని లబోదిబోమంటున్నాడు. ఆ వ్యక్తి ప్రమాదం చేస్తే.. కేసులు సంగతి పక్కనపెడితే..నా బండి నెంబరుతో తగరపువలస పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న ఆ వ్యక్తి ఎవరినైనా ఢీకొట్టినా..వాహనంతో గాయపరిచినా..ఆ కేసులు తనకు చుట్టుకుంటాయనే వచ్చేస్తాయన్న భయం పట్టుకుందని సాక్షి వద్ద వాపోయారు. పోలీసు పెద్దలు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి..తన బండి నెంబరుతో వాహనం నడుపుతున్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నాడు. తన బండి నెంబరుపై నమోదైన(నావి(జగదాంబ జంక్షన్, మద్దిలపాలెంలో నమోదైన వాటికే ఫైన్లు వసూలు చేయాలని విన్నవించుకుంటున్నాడు. ఒకే నంబర్‌తో రెండు వాహనాలు ఉన్నట్టు ఫొటోల్లో కనిపిస్తున్నా ఆ దిశగా పోలీసులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. నమోదైన కేసులివే.. ♦ సెప్టెంబర్ 12..2019న హెల్మెట్ లేకుండా ఫైన్ రూ.135 ♦ అక్టోబర్ 25, 2019న హెల్మెట్ లేకుండా తగరపువలస జాతీయ రహదారిపైన, మార్కెట్ వద్ద కేసు నమోదైంది ♦ నవంబర్ 29, 2019న తగరపువలస మార్కెట్ వద్ద రాంగ్ పార్కింగ్ చేస్తూ కేసు నమోదు ♦ జనవరి ఒకటి 2020న మద్దిలపాలెంలో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ(ఒరిజనల్ వాహనదారుడు) కేసు నమోదు ♦ జనవరి 28, 2020న భీమిలి పోలీస్ స్టేషన్ పరిధి తగరపువలసలో రాంగ్ పార్కింగ్ చేస్తూ కేసు నమోదు. -
మీ వాహనం అమ్మేశారా..?
పెద్దశంకరంపేట(మెదక్): పాత వాహనాల అమ్మకం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అసలైన యజమానులు ఆర్థికంగా నష్టపోక తప్పదు. ఇటీవలె పెరిగిన ఈ–చలాన్లతో ఇబ్బందులు భారీగానే ఎదురవుతున్నాయి. ఆరు నెలల క్రితం పాత వాహనాన్ని అమ్మిన ఓ వాహనదారుడికి ఇలాంటి ఘటనలే ఎదురవుతున్నాయి. పాత వాహనాన్ని అమ్మిన సమయంలో కేవలం చిన్నపాటి బాండ్‌పేపర్‌పై అమ్మక ఒప్పందాలు చేసుకొని వాహనాన్ని అమ్మేశాడు. సదరు వాహనాన్ని కొనుగోలు చేసి న వ్యక్తి వాహనాన్ని తనపేరుపై రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అలాగా నడిపిస్తుండడంతో పాత యజమానికిపై ఈ–చలాన్ భారం పడింది. ఈ విషయాన్ని సదరు అధికారులకు తెలిపినా ఫలితం లేకపోవడంతో లబోదిబోమంటున్నా డు. జిల్లా వ్యాప్తంగా నిత్యం పాత, కొత్తవాహనాల కొనుగోలు ఎప్పటికప్పుడు పెరుగుతూపోతుంది. ఇటు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. సరైన అవగాహన లేక ఇటు అమ్మకందారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. జిల్లాలో 35 శాతం పాతవారే యజమానులు జిల్లాలో అనేక రకాల వాహనాలు కలిపి నాలుగు లక్షల వరకు ఉండగా ఇందులో దాదాపు 35 శాతం వరకు పాత వాహనాల యజమానుల వాహనాలు వినియోగించే వారున్నారు. వాహనాన్ని కొనుగోలు చేసిన వారం, పది రోజుల్లోనే యాజమాన్య హక్కులను మార్చుకుంటే ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. యాజమాని వాహన విషయంలో మార్పులు చేసుకొనే సమయాన్ని జాప్యం చేస్తే జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పన్నుల భారం తప్పదు పాత వాహనాలు అమ్మిన వారు నూతన వాహనం కొనుగోలు చేస్తే పన్నుల రూపంలో అదనంగా నగదు చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనదారులకు 9 శాతం, కారుకు 12 శాతం జీవితకాలం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు పాత వాహన యజమాని అదనంగా మరో వాహనాన్ని కొనుగోలు చేస్తే ద్విచక్రవాహనానికి, కారుకు 14 శాతం చొప్పున ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ విషయంపై అవగాహన లేక అదనంగా పన్నులు చెల్లిస్తున్నారు. 29,30 ఫారాలపై సంతకాలు తీసుకోవాలి వాహనాలను కొనుగోలు చేసే సమయంలో వెంటనే ఆర్సీ, బీమా, కాలుష్యం, చిరునామా ధృవీకరణ పత్రంతో పాటు ఫారం నెంబర్ 29, 30లపై వాహనాన్ని విక్రయించిన వారి సంతకాలు, ఆధార్ జీరాక్స్‌ను తీసుకుంటే వాహన పత్రాల బదిలీ సులభమవుతుంది. -
రిజిస్ట్రేషన్ల ఆధారంగా అమ్మకాల డేటా..!
న్యూఢిల్లీ: వాహనాల నెలవారీ అమ్మకాల సమాచారాన్ని రిజిస్ట్రేషన్ల ఆధారంగా రూపొందించాలని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్)ను కోరింది. ఇందుకోసం హోల్‌సేల్స్‌ను కాకుండా, రహదారి మంత్రిత్వ శాఖకు వాహన్ ప్లాట్‌ఫాం సమాచారాన్ని వినియోగించుకోవాలని సియామ్‌కు లేఖరాసింది. ఈ విధానం ద్వారా మెరుగైన సమాచారం అందుతుందని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్ హర్షరాజ్ కాలే అన్నారు. ఇక తాజాగా సియామ్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆటో పరిశ్రమ అమ్మకాలు కనిష్ట స్థాయిలను నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు 31.57 శాతం క్షీణించాయని వెల్లడించింది. -
రాష్ట్రంలో కార్లు, బైక్‌ల దూకుడు
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో వాహనాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. బైక్‌లు, కార్లు కొనేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌దే కాదు.. మిగతా ఉమ్మడి జిల్లాల పరిధిలోనూ వాహనాల పెరుగుదల ఘననీయంగా నమోదైంది. హైదరాబాద్ కాక మిగతా జిల్లాల పరిధిలో 2014లో 9 జిల్లాల పరిధిలో దాదాపు 35 లక్షల వాహనాలుండగా, 2019 (ఆగస్టు 2) వరకు ఈ సంఖ్య 60 లక్షలకు చేరింది. ఏటా వీటి సంఖ్య పెరుగుతూపోతోంది. 2014 నుంచి 2019 (ఆగస్టు 12) వరకు గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. మెదక్ జిల్లాలో అత్యధికంగా వాహనాల సంఖ్య రెట్టింపు అయ్యింది. నల్లగొండలో తక్కువగా దాదాపు 25 శాతమే పెరగడం విశేషం. రోజూ 500 వాహనాల రిజిస్ట్రేషన్లతో వరంగల్ టాప్‌లో ఉండగా, 139 వాహనాల రిజిస్ట్రేషన్లతో ఖమ్మం అత్యల్పస్థానంలో ఉంది. ఇక అత్యధికంగా కార్లు ఉన్న జిల్లాల్లో 2,65,000 వాహనాలతో రంగారెడ్డి నంబర్ వన్‌గా ఉండగా, 24,141 వాహనాలతో నల్లగొండ చివరి స్థానంలో ఉంది. పెరుగుతున్న అవసరాలతో ప్రతిఒక్కరూ ఇంట్లో ఏదో ఓ వాహనం ఉండాలని భావిస్తున్నారు. వాహనాల కొనుగోలుపై లోన్ల సదుపాయం, పలు సందర్భాల్లో ఆఫర్ల ప్రకటనలు కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. -
దళారులకు కేరాఫ్ రవాణాశాఖ !
సాక్షి, కరీంనగర్ : అవినీతి, అక్రమాలకు రవాణా శాఖ కార్యాలయం నిలయంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకొని వాహనాల రిజిస్ట్రేషన్ వరకు ఇక్కడికి వచ్చే సామాన్యులు దళారుల ద్వారానే పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజీవ్ రహదారి వంటి స్టేట్హైవేతోపాటు ఆదిలాబాద్, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు అనుసంధానంగా ఉన్న తిమ్మాపూర్‌లోని కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లదే పెత్తనం. అధికారులు, దళారులతో కుమ్మక్కై లక్షలు దండుకుంటున్నారు. ప్రతిరోజు దాదాపు 70వరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగే ఈ కార్యాలయంలో రవాణాశాఖ అధికారులు ‘లెక్కలు’ చూసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పునర్విభజన తరువాత పాత కరీంనగర్ నాలుగు కొత్త్త జిల్లాలుగా ఏర్పాటు కావడంతో పనిచేసే అధికారులు, సిబ్బందితోపాటు ఏజెంట్లు కూడా కొత్త జిల్లాలను పంచుకున్నారు. అయినా.. రిజిస్టేషన్ల సంఖ్యతోపాటు ఆదాయంలో కూడా కరీంనగర్ జిల్లానే టాప్‌గా నిలిచింది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కరీంనగర్ జిల్లా హోదాకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి(డీటీసీ)ని నియమించాల్సి ఉన్నప్పటికీ, ఆరేళ్లుగా ఇన్చార్జిల పాలనే సాగుతుండడంతో అధికారులు, సిబ్బందిపై నిఘా లేకుండా పోయింది. దారుణం ఏంటంటే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు డీటీసీని నియమించి కరీంనగర్‌కు ఆయనను ఇన్చార్జిగా నియమించడం. జిల్లాలో ఒకే ఒక్కడుగా కొనసాగిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్‌పాషా ఇటీవలే అవినీతి ఆరోపణలపై కమిషనర్ కార్యాలయానికి సరెండర్ అయ్యారు. వాహనాలను తనిఖీ చేయడం ద్వారా లక్షలు వసూళ్లు చేసిన సదరు అధికారి తాజాగా ‘గూగుల్ పే’ వంటి అధునాతన ఆన్లైన్ లావాదేవీలను కూడా ఉపయోగించుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహాయ ఎంవీఐ ఒక్కరే మిగిలారు. సిబ్బంది పాత్ర షరా మామూలే. ఏజెంట్ల నుంచి వచ్చిన కాగితాలే ఫైనల్ అనే చందంగా రవాణాశాఖ కార్యాలయంలో ప్రస్తుత ధోరణి నెలకొంది. లైసెన్సుల మంజూరు నుంచి వాహనాల తనిఖీ వరకు అంతటా డబ్బులే రాజ్యమేలుతున్నాయి. ఇన్చార్జి అధికారులే ఇక్కడ..! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గానీ, విభజన తరువాత కరీంనగర్లో గానీ రెగ్యులర్ ఆర్టీవో/డీటీసీలు లేరు. 2012 నుంచి 2014 వరకు దుర్గా ప్రమీల ఆర్టీవోగా పనిచేశారు. కరీంనగర్‌కు ఈమెనే రెగ్యులర్ ఆర్టీవోగా పనిచేసిన చివరి అధికారి. ఆ తర్వాత వచ్చినవారంతా ఇన్‌చార్జీలే. 2014–17 వరకు వినోద్‌కుమార్ ఇన్చార్జి డీటీసీగా కొనసాగారు. ఆయన తరువాత 2017 నుంచి 2018 వరకు కొండల్రావు, 2018 నుంచి 2019 వరకు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ప్రస్తుతం శ్రీనివాస్ ఇన్చార్జి అధికారులుగానే ఉన్నారు. మొన్నటి వరకు ఇద్దరు రెగ్యులర్ ఏఎంవీఐలు ఉండగా, ఇటీవల ఏఎంవీఐ గౌస్‌పాషా గూగుల్ పే ద్వారా రూ.5 వేలు లంచం తీసుకోవడంతో అతడిని రవాణాశాఖ కమిషనర్‌కే సరెండర్ చేశారు. ప్రస్తుతం రజినీదేవి ఒక్కరే ఇక్కడ రెగ్యులర్ అధికారి. గౌస్‌పాషా సరెండర్ తర్వాత పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయం నుంచి ఫారూఖ్‌ను తాత్కాలికంగా కరీంనగర్‌కు ఏఎంవీఐగా నియమించారు. లంచాల కోసం పీడింపు.. కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చేవారికి లర్నింగ్ లైసెన్స్ నుంచే లంచాల బెడద మొదలవుతుంది. లెర్నింగ్ తరువాత రెగ్యులర్ లైసెన్స్, వాహనాల రోడ్ టాక్స్, ఫిట్నెస్ వరకు రూ.వేలల్లో లంచాలు దండుకుంటున్నారు. రూ.450 లెర్నింగ్ ఫీజకు రూ.600, రూ.2,000 పర్మినెంట్ లైసెన్స్‌కు రూ.6 వేలు, రిజిస్టేషన్‌కు ఫీజు కాకుండా ద్విచక్రవాహనాలకు రూ.300, ఫోర్ వీలర్స్‌కు రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఫిట్నెస్ పరీక్షకు వచ్చే వాహనాలను వివిధ కారణాలు సాకుగా చూపి వేలాది రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్నారు. వాహనాల తనిఖీ పేరిట జరిగే తతంగం పూర్తిగా లంచాల వసూళ్లకేనని ఇటీవల ఎంవీఐ సరెండర్‌తో జిల్లా వాసులకు తెలిసిపోయింది. విద్యాసంస్థలకు చెందిన బస్సుల ఫిట్నెస్, లారీలు, ట్రక్కుల పన్ను వసూళ్లు, ఓవర్ లోడింగ్ తదితర విషయాల్లో రవాణా శాఖ సిబ్బంది మామూళ్ల పర్వం అగ్రభాగానికి వెళ్లిపోయింది. అంతా ఏజెంట్లదే.. రవాణాశాఖ కార్యాలయంలో సుమారు 15 మంది ఏజెంట్లు రాజ్యమేలుతన్నారు. కార్యాలయం తెరవకముందే ఏజెంట్లు తిష్టవేస్తారు. అప్పటికే అక్కడకు వచ్చిన వాహనదారులతో, లైసెన్సుల కోసం వచ్చే వారితో బేరాలు మాట్లాడుకోవడం, తమను కాదని వెళితే లైసెన్స్ గానీ, వాహనం రిజిస్ట్రేషన్ గానీ కాదని హెచ్చరించి మరీ రోజువారీ సెటిల్మెంట్లు చేసుకుంటారు. అధికారులు 10:30 నుంచి 11 : 30 గంటల సమయంలోనే కార్యాలయానికి రావడం సర్వసాధారణమైంది. అప్పటికే ఆ రోజు ఇచ్చే లైసెన్సులు, చేసే రిజిస్ట్రేషన్లు, ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించి సెట్ చేసే ఏజెంట్లు అధికారులు రాగానే వారి గదుల్లోకి నేరుగా వెళ్లి మరీ, కమీషన్ ముట్టజెప్పి పనికానిచ్చేస్తారు. కార్లు, ట్రక్కులు, ఇతర పెద్ద వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఏజెంట్ల ద్వారానే సాగుతుండగా, డ్రైవింగ్ లైసెన్సులకు కూడా ఏజెంట్లే తప్పనిసరిగా మారిందనే విమర్శలున్నాయి. పంపకాల్లో అటెండర్ నుంచి అధికారి వరకు... ఏజెంట్ ఇచ్చే మామూళ్లు కార్యాలయంలో పని చేసే అటెండర్ నుంచి కార్యాలయంలోని అసలు బాస్ వరకు అందరికీ ముడతాయనేది బహిరంగ రహస్యం. కార్యాలయానికి వచ్చిన వారి తో మాట్లాడుకున్న బేరం ప్రకారం ఏజెంట్ల నుంచి వెళ్లిన పత్రాలను పరిశీలించి, ఏజెంట్ల నుంచి వచ్చిన వాటికే ఆమోదముద్ర తెలపడం, మిగతా దరఖాస్తులకు కొర్రీలు విధించడం సా ధారణంగా మారింది. ఫైల్‌పై కోడ్‌భాషలో ఇచ్చే ఇండికేషన్ అధికారులు గమనించి, సంతకాలు చేస్తారు. ఈ నేపథ్యంలో నేరుగా వెళ్లినా పని కా దని నిర్ణయానికి వచ్చిన వారు తిరిగి ఏజెంట్లనే నమ్ముకోవడం సర్వసాధారణంగా మారింది. జిరాక్స్ సెంటర్లే అడ్డా.. జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు అడ్డాగా చేసుకుని ఏజెంట్లు దందా నడిపిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్ల సిబ్బంది కొంతమంది ఏజెంట్లతో కుమ్మక్కై బే రం మాట్లాడుతున్నారు. వచ్చిన దాంట్లో పంచుకోవడం మామూలుగా మారింది. బేరం రాగానే వారి ఏజెంట్‌కు సమాచారం అందించడంతోపాటు స్లాట్‌బుక్ చేయడం.. నుంచి సర్టిఫికెట్ జారీ చేసే వరకు అంతా వారిదే రాజ్యం. -
సిరీస్ జోష్ !
సాక్షి, అమరావతి బ్యూరో : ‘ఒకే రాష్ట్రం–ఒకే సిరీస్’ విధానంతో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు సులభతరమైంది. రాష్ట్రంలో బుధవారం నుంచి ‘ఏపీ–39’ సిరీస్ అమల్లోకి వచ్చింది. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవ్వడమే కాకుండా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపులోనూ మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టేది. అయితే కొత్త విధానం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఒకే సిరీస్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుండటంతో రోజుకు 6 వేలకుపైగా వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రానికి 8,152 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. శుక్రవారం సాయంత్రానికి ‘ఏపీ–39ఏ’ సిరీస్ పూర్తయి.. ఏపీ–39బీ సిరీస్‌లోనూ 3,153 నంబర్ల వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బీ సిరీస్ 1, 9, 999 నంబర్లు రూ.50 వేలు ధర పలుకగా, 99, 333, 555, 666, 777, 888 నంబర్లు రూ.30 వేలు, 123, 222, 369, 444, 567, 786, 1111, 1116 నంబర్లకు రూ.20 వేలు చొప్పున ధర పలికింది. 3, 5, 6, 7, 111, 234, 306, 405, 789, 818, 909, 1188, 1234 తదితర నంబర్లను వాహనదారులు రూ.10 వేలు చెల్లించి తీసుకోవడం జరిగిందన్నారు. కొత్త విధానం ద్వారా ఆన్లైన్ బుకింగ్ సైతం బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. -
షోరూంలోనే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి వాహనం కొన్న తరువాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్), హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ మేరకు వాహనదారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఓ కొత్త జీవోను వెలువరించింది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) స్థానంలో ఏకంగా ఒకేసారి శాశ్వత రిజిస్ట్రేషన్ చేసేస్తారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌తో కొత్త వాహనం రోడ్డెక్కేయొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానం విజయవంతంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ అమల్లోకి తెచ్చేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. మొదట హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ రమేశ్ తెలిపారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ అనుభవాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలను రూపొందించనున్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతుల్లో మార్పులు, జీవితకాల పన్ను చెల్లింపుల్లోనూ, ఎక్స్‌షోరూమ్ ప్రైస్ (వాహన తయారీ ధరలు) వెల్లడించకపోవడం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. అలాగే ప్రస్తుతం ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉంటే అదనంగా 2 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇలాంటి అదనపు వసూళ్లకు ఎలాంటి పద్ధతులను అనుసరించాలనేది అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని కోణాల్లోనూ సమగ్రంగా పరిశీలించిన అనంతరం జీవో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులకు దీంతో ఒకింత ఊరట ఉన్నా షోరూమ్‌ల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే హ్యాండ్లింగ్ చార్జీలు, ఎక్స్ట్రా ఫిట్టింగ్‌ల పేరిట వాహనదారులపైన రూ.3,000 నుంచి రూ.5,000 వరకు అదనంగా భారం మోపుతున్నారు. ప్రస్తుతం వాహనదారుడి పేరు, చిరునామా, ఆధార్ నంబర్, వాహ నం చాసీస్ నంబర్, ఇంజన్ నంబర్ల నమోదులోనే తరచుగా తప్పులు దొర్లుతున్నాయి. ఈ పొరపాట్లను సవరించుకొనేందుకు వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల్లో రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. షోరూమ్‌ల్లో రిజిస్ట్రేషన్లతో ఇది మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అంతేగాక ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. -
బైక్ అమ్ముతున్నారా.. బీ కేర్ ఫుల్..!
మీరు ట్రాఫిక్ నిబంధనలన్నీ పాటిస్తున్నా మీ పేరుపై ఈ–చలానాలు ఇంటికి వస్తున్నాయా..? హెల్మెట్ ధరించలేదనో.. ట్రిపుల్ రైడింగ్ చేశారనో.. ఓవర్‌స్పీడ్, సిగ్నల్ జంపింగ్ వంటివాటికి పాల్పడ్డారనో ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఈ–చలానాలు ఇంటికి పంపిస్తున్నారా..? కొత్త వాహనాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే.. మీ పేరుపై ఇప్పటికే ఒక వాహనం ఉందని, రెండో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయాలంటే అదనపు మొత్తం చెల్లించాలని చెబుతున్నారా..? అయితే, వెంటనే మీరు అప్రమత్తం కావాల్సిందే. మీ పాత వాహనాన్ని విక్రయించిన సమయంలో కొనుగోలు చేసిన వ్యక్తి అతని పేరుపై వాహన రిజిస్ట్రేషన్‌ను మార్చుకోకపోవడం, ఆ వాహనం ఇప్పటికీ మీ పేరుతోనే ఉండటమే అందుకు కారణం. దీనిపై ట్రాఫిక్ పోలీస్, ఆర్టీఏ అధికారుల కార్యాలయాల్లో సంప్రదించి జాగ్రత్తపడటం ఉత్తమం. సాక్షి, ఒంగోలు: మార్కెట్లోకి కొత్త వాహనం వస్తే చాలు.. పాత బైక్ ఇచ్చేసి కొత్తది కొనుగోలు చేయడం వాహనప్రియులకు పరిపాటి. అయితే ఈ విధానమే నేడు వారికి తిప్పలు తెచ్చిపెడుతోంది. అమ్మిన పాత బైక్‌లు ఇంకా వారి పేరు మీద ఉండటంతో ఇటీవల ఈ చలానాల పరంపర మోత మోగిస్తోంది. తాము విక్రయించిన వాహనం ఎవరి వద్ద ఉందో కూడా తెలియని స్థితిలో ఉన్నవారు కొందరైతే, కొన్నవారు రిజిస్ట్రేషన్‌కు వెనుకాడుతుండటంతో మరికొందరు ఈ చలానాల మోతతో తిప్పలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో గత ఎనిమిది నెలల్లోనే దాదాపు 40 లక్షలకుపైగా ఈ చలానాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమ అయింది. ఈ మొత్తంలో కనీసంగా రూ.పది లక్షలకు పైగా మొత్తం పాత వాహనాలకు సంబంధించిన మొత్తమే అని అంచనా. వాహన విక్రేతలు బెంబేలు గతంలో వాహనాలను విక్రయించిన వారు నేడు బెంబేలెత్తుతున్నారు. సెకండ్ హ్యాండ్ షోరూముల్లో లేదా తెలిసిన వారికి వాహనాలను ఇవ్వడం, వారు మరొకరికి విక్రయించడం జరిగినా మరోమారు రిజిస్ట్రేషన్ జరగక పోవడంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా అనే విషయమై జిల్లా పోలీసు అధికారులతోపాటు రవాణా శాఖ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా వారు స్పెషల్ డ్రైవ్, రిజిస్ట్రేషన్ రద్దు, ఫిర్యాదు చేయడం తదితర మార్గాలను సూచించారు. సమస్యలు ఇలా.. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బుల్లెట్ వాహనం కొన్నాడు. రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి చేరుకున్నాడు. అయితే ‘గతంలోనే ఒక వాహనం మీ పేరు మీద ఉంది. కొత్త వాహన రిజిస్ట్రేషన్‌కు రూ.17 వేలు అదనంగా చెల్లించాలి’ అని చెప్పారు. తనకు వాహనమే లేదంటూ సుబ్రహ్మణ్యం అధికారులతో వాదించాడు. తీరా కంప్యూటర్లో పరిశీలిస్తే 1986లోనే అతని పేరుపై ఒక బైక్ రిజిస్ట్రేషన్ అయినట్లు స్పష్టమైంది. దీంతో తాను ఆ బైకును అప్పట్లోనే వేరేవారికి విక్రయించానని, తనవద్ద ఎటువంటి బైక్ లేదన్నా అధికారులు మాత్రం ‘నో యూజ్.. రూ.17 వేలు కట్టాల్సిందే’ అని స్పష్టం చేయడంతో అడిగినంత చెల్లించి కొత్త బైక్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే పాత వాహనం ఎవరివద్ద ఉందన్నది సుబ్రహ్మణ్యంను నిద్రపట్టనీయకుండా చేస్తోంది. # రామారావు ఒక వాహనం కొనుగోలు చేశాడు. కొత్త వాహనంపై ఆశపడి పాత వాహనాన్ని తెలిసిన స్నేహితునికి విక్రయించాడు. స్నేహితుడి వద్ద డబ్బులు తీసుకుని అతనికి సి–బుక్‌తోపాటు ఫారం 29, ఫారం 30పై సంతకాలు చేసి ఇచ్చేశాడు. అయితే రామారావు తాజాగా కొనుగోలు చేసిన బైక్ రిజిస్ట్రేషన్‌కు అధిక మొత్తంలో ఫీజు కట్టాలనడంతో పాత బైక్ వ్యవహారం చర్చకు వచ్చింది. ఆ బైక్ కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మార్చుకోకపోవడంతో ఈ దుస్థితి దాపురించినట్లు స్పష్టమైంది. # నాలుగేళ్లుగా ఒకే బైకు వాడటం నాగేంద్రం అనే వ్యక్తికి నచ్చలేదు. దీంతో తన పాత బైకును ఒక సెకండ్ హ్యాండ్ వాహనాల షాపులో విక్రయించాడు. వారు ఇతను బండి విక్రయించినట్లు ఫారం 29, ఫారం 30పై సంతకాలు చేయించుకున్నారు. కానీ కొన్నది ఎవరనే స్థానంలో ఎవరి పేరూ రాయలేదు. ఆ వాహనాన్ని వేరే వ్యక్తులకు విక్రయించే సమయంలో అక్కడ కొనుగోలు చేసిన వ్యక్తి పేరు రాయాలనేది వారి ఉద్దేశం. ఈ క్రమంలో వారు ఆ వాహనాన్ని అమ్మినప్పటికీ దానిని వారు రికార్డుపరంగా తమ వద్ద ఉంచుకోలేదు. వాహనం కొన్న వ్యక్తి మూడేళ్లు గడిచినా తన పేరు మీదకు రిజిస్ట్రేషన్ మార్చుకోలేదు. ఎలాగూ బండికి రిజిస్ట్రేషన్ ఉంది కదా అని దాంతోనే సరిపెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బండికి సంబంధించి ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ఓవర్‌స్పీడ్, సిగ్నల్ జంపింగ్‌కు సంబంధించి ఆధునిక సాంకేతికత ద్వారా జారీ అయిన చలానాలు పాత యజమానికి చేరుతున్నాయి. ఇదేమని అధికారులను అడిగితే ‘బైక్ ఇంకా మీ పేరు మీదే ఉంద’ని సమాధానం ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తాం ఈ చలానాల విధానం మొదలైన తర్వాత బైక్ రిజిస్ట్రేషన్ సమస్య ఎక్కువగా వస్తోంది. వాస్తవానికి వాహన యజమాని తన వాహనాన్ని విక్రయించేటపుడు సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినపుడే అందజేయాలి. కానీ అలా చేయకపోతుండటంతో సమస్య ప్రారంభమైంది. ఈ చలానా పొందిన వారు ఎవరైనా తమ వాహనాన్ని ఫలానా వ్యక్తికి విక్రయించినట్లు స్పష్టంగా తెలిసి ఉంటే, తమకు ఫిర్యాదు చేస్తే చలానాను అతని పేరు మీదకు బదిలీ చేస్తాం. అయితే ఇందుకు కనీసం అతనికి విక్రయించినట్లు ఆధారం తప్పనిసరి. గతంలో వాహనం విక్రయించినప్పటికీ ఆ వాహనం ఏదైనా నేర ఘటనలో చిక్కుకుంటే ఆ కేసు వాహనం ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో ఆ వ్యక్తి మీద నమోదవుతుంది. అయితే ఈ సమస్యకు జిల్లా వ్యాప్తంగా ఈ చలానాలు కావచ్చు లేదా వాహనం విక్రయించినా తమ పేరుమీదే ఇంకా ఉందని భావించేవారు ఎవరైనా తమకు ఫిర్యాదు చేసేలా ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలనే ఆలోచన ఉంది. సాధ్యపడుతుందనేది పరిశీలిస్తున్నాం. తద్వారా ఇరువర్గాల వారు ముందుకు వస్తే సమస్యలు తొలగిపోతాయి. అలా కాకుండా నేరం చేయాలనే తలంపుతో ఎవరైనా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నట్లు గనుక తమ దృష్టికి వస్తే వాహనాన్ని నడిపిన వ్యక్తిని కూడా వదిలే ప్రశ్న ఉండదు. ఈ చలానాల వ్యవహారం పక్కనబెట్టి ఎవరైనా తమ పాత వాహనాన్ని గతంలో విక్రయించి ఉంటే వారు ఆన్లైన్లో వెరిఫై చేసుకుని పేరు మారిందో లేదో చూసుకోవాలని విజ్ఞప్తి. – సత్య యేసుబాబు, ప్రకాశం జిల్లా ఎస్పీ వాహనం రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసుకోవడమే బెటర్ వాహనానికి సంబందించి ఈ చలానాల బెడద ఆగాలన్నా లేక భవిష్యత్తులో ఆ వాహనం ద్వారా జరిగే ఎటువంటి నేరమైనా తమ మీదకు రాకుండా ఉండాలన్నా వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవడం ఒక్కటే మార్గం. ఇందుకు వాహనం గతంలోనే తమ వద్ద కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తెలిస్తే అతనిపై ఫిర్యాదు చేయవచ్చు. తద్వారా సమస్య పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే దానికంటే గతంలోనే వాహనం కొని కాగితాలు అన్నింటిపైనా సంతకం చేసినందువల్ల లీగల్‌గా సమస్యలు రాకుండా ఉండాలంటే ఫలానా నంబర్‌గల వాహనానికి తాను యజమానినని, దానిని తాను ఫలానా సమయంలో ఫలానా వ్యక్తికి లేదా సెకండ్ హ్యాండ్ షోరూం వారికి విక్రయించినట్లు పేర్కొంటూ పత్రికలో ఒక ప్రకటన ఇవ్వాలి. అందులో వారం రోజుల్లోగా సంబంధిత వాహనం కలిగి ఉన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేని పక్షంలో రిజిస్ట్రేషన్‌ను తాను రద్దు చేయించడం జరుగుతుందని పేర్కొనాలి. ఈ ప్రకటన ఇచ్చిన వారం రోజుల్లో కూడా స్పందించకపోతే సంబంధిత వాహనాన్ని రద్దు చేయాలని కోరుతూ వాహనం ఏ కార్యాలయంలో అయితే రిజిస్ట్రేషన్ చేశారో అక్కడికే వెళ్లి రద్దు చేయాలని విజ్ఞప్తి చేయవచ్చు. పత్రికలో ప్రచురితమైన ప్రకటన కాపీ, వాహనం యజమానిని తానే అని నిరూపించేందుకు వీలుగా స్వయంగా రాసిన ఒక పత్రం, బండికి సంబంధించిన నకలు కాపీ(నకలు కాపీ లేని పక్షంలో అడ్వకేట్ ధ్రువీకరించిన అఫిడవిట్ జత చేయాలి. తద్వారా వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. అయితే ఈ ప్రక్రియ జరగాలంటే ఇప్పటి వరకు ఆ వాహనంపై ఉన్న బకాయిలు మొత్తం ముందుగా చెల్లించక తప్పదు. ఆ తర్వాత తాను ప్రకటన చూడలేదని, అందువల్ల తనకు అన్యాయం జరిగిందంటూ కొనుగోలు చేసిన వ్యక్తి వస్తే.. సంబంధిత వాహన బదిలీ ఫీజు, ఇంతవరకు వాహనాన్ని తన పేరుమీదకు మార్చుకోనందుకు అపరాధ రుసుం రవాణా శాఖకు జమ చేసి వాహనాన్ని అతనిపేరు మీదకు మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే ఇదంతా గతంలో జరిగిన విక్రయానికి సంబంధించింది. ప్రస్తుతం మాత్రం ఎవరైనా తన వాహనాన్ని విక్రయించాలనుకుంటే కామన్ సర్వీస్ సెంటర్లో తమ వేలిముద్ర ద్వారా సంతకం పెట్టడంతోపాటు కొనుగోలు చేసిన వ్యక్తి కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది. అయితే అమ్మిన వ్యక్తి వేలిముద్ర వేసినపుడు ఒక టోకెన్ నంబర్ వారికి వస్తుంది. ఆ టోకెన్ నంబర్ ఆధారంగా దానిని కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ కొనుగోలుదారుడు రిజిస్ట్రేషన్‌కు రావడం లేదంటే పేరు మార్పుకు అతను వచ్చేంత వరకు వాహనం లేదా పత్రాలు కానీ ఇవ్వనని కరాఖండీగా చెప్పాలి. కొనుగోలు చేసిన వ్యక్తి ఎప్పుడో వేలిముద్ర వేస్తాడని ఎవరైనా చెబితే నమ్మవద్దు. దీనిపై సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసే షోరూం యాజమాన్యాలకు కూడా ప్రస్తుతం అవగాహన కల్పిస్తున్నాం. ముందుగా వారు వాహనాలను ఎలా కొనుగోలు చేయాలి, ఎలా విక్రయించాలనే దాంతోపాటు వారి వద్ద ప్రస్తుతం ఉన్న స్టాకును కూడా పరిశీలించి సంబంధిత ఫైనాన్స్ సంస్థ ఆధీనంలో ఉన్నట్లు రికార్డు చేస్తున్నాం. అంతే కాకుండా ఫైనాన్స్ సంస్థలు తాము గతంలో వాహనాలను విక్రయించిన వారికి కూడా అవగాహన కల్పించి వారు కూడా పేరు మార్చుకునేలా ఒత్తిడి తీసుకువస్తున్నాం. వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగినప్పటికీ.. ప్రస్తుతం అతి తక్కువ అపరాధ రుసుం మాత్రమే ఉన్నందున కొనుగోలుదారులు స్వయంగా ముందుకు వచ్చి తమ పేరు మీదకు మార్చుకుంటే మంచిది. – సీహెచ్‌వీకే సుబ్బారావు, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ -
పన్ను ఎగవేత అంత వీజీ కాదు
సాక్షి, సిటీబ్యూరో: పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాల నమోదులో అక్రమాలను అరికట్టేందుకు రవాణాశాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వాహనాల జీవితకాల పన్నుపైన ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయాల ఆదాయానికి గండి కొట్టే విధంగా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దళారులతో కుమ్మక్కై వాహనాల జీవితకాల పన్ను ఎగ్గొడుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించేందుకు జాతీయ సమాచార కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్)లోని ‘వాహన్ సారధి’ తో మొత్తం వాహనాలను అనుసంధానించాలని నిర్ణయించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినా వాటి వివరాలు వెంటనే వాహన్ సారథిలో నిక్షిప్తమవుతాయి. అలాగే వాహనాల ఖరీదు, వాటిపైన ప్రభుత్వానికి చెల్లించవలసిన జీవితకాల పన్ను మొత్తం కూడా నమోదవుతుంది. దీంతో ప్రాంతీయ రవాణా అధికారి నుంచి కిందిస్థాయి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, క్లర్క్‌లు ఎలాంటి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉండదు. మరోవైపు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ద్వారా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాలను కూడా వెంటనే తెలుసుకొని జీవితకాల పన్నును కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇటీవల నగరంలోని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో కొందరు అధికారులు దళారులతో కుమ్ముక్కై సుమారు 800 వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో సుమారు రూ.1.5 కోట్ల మేర ప్రభుత్వాదాయానికి గండి పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారి, మరో ముగ్గురు క్లర్క్‌లను సస్పెండ్ చేయడంతో పాటు, సదరు ప్రాంతీయ రవాణా అధికారిని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. బండ్లగూడ తరహాలో మరోసారి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఎన్ఐసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. బండ్లగూడ అక్రమాలపై విచారణ .. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన 500 నుంచి 1000 వాహనాలు రోజూ గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదవుతాయి.ఈ సమయంలో వాహనాల ఇన్వాయీస్, వాహనాల వయస్సును పరిగణనలోకి తీసుకొని జీవితకాల పన్ను వసూలు చేయాలి. ఉదాహరణకు కర్ణాటకకు చెందిన రూ.6.5 లక్షల మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు హైదరాబాద్‌కు బదిలీ అయినప్పుడు 12 శాతం పన్ను వసూలు చేయాలి. ఒకవేళ అది రెండేళ్ల కిందటి వాహనం అయితే 10 శాతం చొప్పున తీసుకోవాలి. కానీ బండ్లగూడలో ఇలాంటి లెక్కలు లేకుండా, ఇన్వాయిస్ నమోదు చేయకుండా ఏకంగా 800 వాహనాలపైన అతి తక్కువ జీవితకాల పన్ను విధించారు. ఒక్కో వాహనంపై సగటున రూ.55000 ఆదాయం రావలసి ఉండగా, అందులో రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకే ప్రభుత్వ ఆదాయానికి జమ చేశారు. మిగతా సొమ్మును దళారులు, అధికారులు కాజేసినట్లు గుర్తించారు.అలా రూ.కోటి 50 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టింది. ఈ ఉదంతంపై ప్రస్తుతం రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావును ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. ఎన్ఐసీతో అనుసంధానం ఇలా... కేంద్ర జాతీయ సమాచార వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్ఐసీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్ఐసీలో ‘వాహన్,సారధి’ ఒక ప్రత్యేక ఆప్షన్. ఇందులో ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదయ్యే వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సుల వివరాలను నిక్షిప్తం చేస్తారు. అలాగే పొరుగు రాష్ట్రాల వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సుల సమాచారాన్ని కూడా ఈ ఆప్షన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ఐసీతో రవాణాశాఖ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అనుసంధానం కాకపోవడం వల్ల ఆ లోపా న్ని అవకాశంగా మార్చుకొని కొంతమంది అధికారులు సొమ్ము చేసుకున్నారు. వాహనాలపై రావలసిన జీవితకాల పన్నును ఎగ్గొట్టారు. ఎన్ఐసీతో అనుసంధానం కావడం వల్ల పొరు గు రాష్ట్రాల వాహనాలను హైదరాబాద్‌లో, తెలంగాణ లో ఎక్కడ నమోదు చేసినా వాటి వాస్తవ ధరలు, వివరాల ప్రకారమే నమోదు చేయాల్సి ఉంటుంది. -
బండి లేకపోయినా..
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ పౌరుడు ఓ వాహనం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే... సవాలక్ష ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ స్లాట్ నుంచి ఆధార్ కార్డు వరకు వివిధ రకాలైన పత్రాలను జత చేసి, వాహ నం తీసుకుని యజమానే స్వయంగా వెళ్లి, కనీసం మూడునాలుగు గంటలు వెచ్చిస్తే తప్ప రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాదు. ఆ తర్వాత ఆర్సీ చేతికి రావడానికి మరో వారం పది రోజులు పడుతుంది. హితేష్ నేతృత్వంలోని ముఠా రంగంలోకి దిగితే కేవలం ‘ఫార్మాలిటీస్’ తప్ప ఇంకేం అవసరం లేదు. వాహనాన్ని, దానికి సంబంధించిన పత్రాలను దాఖలు చేయాల్సిన పని లేదు. కేవలం స్లాట్ బుక్ చేసి, ఫామ్–20 లేదా ఫామ్–25 సమర్పిస్తే చాలు. గంటలోనే ఆర్సీ సిద్ధమైపోయి వీరి చేతికి వచ్చేస్తుంది. అసలు వాహనం లేకపోయినా పర్వాలేదు... భవిష్యత్తులో ‘ఖరీదు చేసే’ ఆలోచన ఉంటే చాలు రిజిస్ట్రేషన్ పూర్తయి ఆర్సీ వీరి చేతిలో ఉంటుంది. బండ్లగూడలోని సౌత్‌జోన్ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిన ‘బోగస్ రిజిస్ట్రేషన్ల దందా’ నేపథ్యమిదీ. 2015 నుంచి సాగిన ఈ అడ్డగోలు వ్యవహారంలో ఆర్టీఏ అధికారులకు పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్టీఓ నుంచి క్లర్క్ వరకు మొత్తం నలుగురు అధికారులు/సిబ్బంది దళారి విఠల్‌రావుతో కుమ్మక్కైనట్లు ప్రాథమికంగా నిర్థారించారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన ఐదుగురు సభ్యుల ముఠా 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలకు రిజిస్ట్రేషన్లు సృష్టించి విక్ర యించింది. ఆలుగడ్డబావికి చెందిన మెకానిక్ వద్ద దొరికిన ‘తీగ’ లాగిన టాస్క్ఫో ర్స్ ఈ ము ఠా గుట్టును రట్టు చేసింది. ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి హితేష్ పటేల్ వాహనాన్ని చూసి దాని మోడల్, ఏ ఏడాదిలో తయారయ్యిందో చెప్పగల నేర్పరి కావడం కొసమెరుపు. ఒక్కో వాహనానికి రూ.80 వేలు... ఓఎల్ఎక్స్ ద్వారా కాలం చెల్లిన వాహనాలను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఖరీదు చేసే హితేష్ వాటిని తొలుత మెకానిక్‌లకు అప్పగిస్తాడు. రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేసి వీటిని కొత్తగా తయారు చేయిస్తాడు. ఆపై ఒక్కో వాహనం కోసం ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ నుంచి కొన్ని నెంబర్లను ఎంపిక చేసి, ఇంజన్‌తో పాటు ఛాసిస్ నెంబర్లు సృష్టించి ఆర్టీఏ దళారి విఠల్‌రావుకు అందించేవాడు. వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయించడానికి ఇతను రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇలా మొత్తమ్మీద గరిష్టంగా ఒక్కో వాహనానికీ రూ.80 వేల వరకు ఖర్చు చేసున్న హితేష్ గ్యాంగ్ దాన్ని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. 2015 నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 వాహనాలను ఈ పంథాలో విక్రయించగా... వాటిలో అత్యధికం ఎన్ఫీల్డ్, యమహా బైక్‌లే కావడం గమనార్హం. మార్కెట్లో వీటికి ఎక్కువ క్రేజ్ ఉండటంతో హితేష్ వీటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. పత్రాలు ఇస్తే చాలు... ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని విఠల్‌రావు బండ్లగూడలోని సౌత్‌జోన్ ఆర్టీఏ కార్యాలయం కేంద్రంగా సాగిస్తున్నాడు. ఒక్కో వాహనంపై ఆర్సీ సృష్టించడానికి గరిష్టంగా రూ.5 వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆర్టీఓకు రూ.1500, ఎంవీఐకి రూ.1000, సూపరింటెండెంట్‌కు రూ.1000, ఓ మహిళా క్లర్క్‌కు రూ.500లతో పాటు కొందరు కానిస్టేబుళ్లకు రూ.500 చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ మామూళ్లు తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది వాహనం, ఇతర పత్రాలు తీసుకురాకపోయినా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. రీ–అసైన్‌మెంట్‌కు ఫామ్–20, రీ–రిజిస్ట్రేషన్‌కు ఫామ్–25 ఇస్తే చాలు ఆర్సీలు జారీ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఎలాంటి వాహనాలు లేనప్పటికీ 14 ఆర్సీలు ఈ ముఠా వద్ద సిద్ధంగా ఉండటం. మరో 75 నెంబర్లను ఆర్సీల జారీ కోసం సిద్ధం చేసి ఉంచడం. అందరూ నకిలీ వ్యక్తులే... ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి యజమాని, వాహనం తప్పనిసరి. అయితే అధికారులను మేనేజ్ చేస్తున్న ఈ ముఠా వాహనాలు అసలే తీసుకువెళ్లట్లేదు. యజమానులుగా పరిచయస్తులైన మెకానిక్‌లతో పాటు ఇతరుల్ని తీసుకువెళ్తోంది. వీరితోనే వేలి ముద్రలు వేయించి, వీరే ఫొటోలు దిగిన తర్వాత డిజిటల్ సంతకాలు సైతం చేయించేస్తోంది. కొన్ని సందర్భాల్లో హితేష్ స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 35 ఆర్సీల్లో ఆరు హితేష్ పేరుతో, ఐదు అబు నాసిర్, మరో ఐదు రాజ్‌కుమార్, ఐదు మహ్మద్ సలీం పేరుతో మిగిలినవి గుర్తుతెలియని వ్యక్తుల పేర్లతో ఉండటం గమనార్హం. వీరే పదేపదే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్తూ తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేసుకుని వాహనాలను అమ్మేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు... ఈ ముఠా విక్రయించిన వాటిలో కొన్ని కాలం చెల్లిన వాహనాలు, మరికొన్ని చోరీ వాహనాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా జరుగుతున్న రిజిస్ట్రేషన్లతో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఒకటికి మించి వాహనాలు తిరిగేస్తుంటాయి. ఫలితంగా హిట్ అండ్ రన్‌తో పాటు ఇతర నేరాలు జరిగినప్పుడు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసినా.. బాధ్యులను పట్టుకోవడంతో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చిక్కినా వీటికి ఇన్సూరెన్స్ ఉండవు. మరోపక్క చోరీ వాహనాలకు సైతం కొత్త నెంబర్ల వచ్చేస్తున్న నేపథ్యంలో ఎలా దర్యాప్తు చేసినా వీటిని పట్టుకోవడం కష్టం. దీంతో బాధితులు నష్టపోవాల్సి వస్తోంది. చిన్న ఆధారంతో ముందుకు.. మూడేళ్లుగా సాగుతున్న హితేష్ ముఠా దందాపై ఆలుగడ్డబావిలో టాస్క్‌ఫోర్స్‌కు ఆధారం దొరికింది. అక్కడి మెకానిక్ మైఖేల్ మోదీ ఇటీవల ఓ వాహనానికి ఇదే పంథాలో ఆర్సీ సృష్టించి విక్రయించాడు. అవే రిజిస్ట్రేషన్, ఛాసిస్, ఇంజిన్ నెంబర్లు మరో వాహనానికి తగిలించి తిరుగుతున్నాడు. ఈ ‘డబుల్ రిజిస్ట్రేషన్’ వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావుకు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా... దందా మొత్తం వెలుగులోకి వచ్చి హితేష్, మోదీ సహా ఐదుగురు కటకటాల్లోకి చేరారు. ఈ ముఠాకు సహకరించిన ఇతర మెకానిక్‌లు ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఆర్టీఏ అధికారులను ఆధారాలతో సహా గుర్తించడానికీ ప్రయత్నాలు చేస్తున్నారు. -
కాలం చెల్లినా బేఫికర్
సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్ఎక్స్ నుంచి కాలం చెల్లిన ఆక్షన్డ్ వాహనాలను ఖరీదు చేయడం... మెకానిక్‌ల సాయంతో వీటికి ఇంజన్, ఛాసిస్ నెంబర్లు వేయించడం... ఆర్టీఏ దళారులు, అధికారుల సాయంతో కొత్తగా ఆర్సీలు సృష్టించడం... వీటి సాయంతో వాహనాలను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం... 2015 నుంచి ఈ పంథాలో దందా చేస్తున్న ముఠా గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారితో సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని, వీరిలో ఒకరు బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం దళారిగా డీసీపీ రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. ఈ వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆ విభాగానికి లేఖ రాయనున్నామన్నారు. ఉత్తరాదిలో వాహనాల వేలం.. గుజరాత్‌కు చెందిన యు.హితేష్ పటేల్ నగరానికి వలసవచ్చి మిఠాయిల వ్యాపారం చేసేవాడు. కవాడిగూడ, నాగోల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వీట్ షాప్‌లు నష్టాలు మిగల్చడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో ఇతడి దృష్టి కాలం చెల్లిన వాహనాలపై పడింది. ఉత్తరాదికి చెందిన పోలీసు విభాగాలతో పాటు ఆర్మీ సైతం 15 ఏళ్లకు మించిన వాహనాలను కాలం చెల్లినవిగా పరిగణిస్తాయి. వీటి ఆర్సీలు ఇతర పత్రాలు ధ్వంసం చేయడంతో పాటు ఇంజన్, ఛాసిస్ నెంబర్లు సైతం తుడిచేసి వేలంలో విక్రయిస్తారు. ఇలాంటి వాటిని ఉత్తరాదికి చెందిన దళారులు పెద్ద మొత్తంలో ఖరీదు చేస్తారు. ఆపై వీటిని స్క్రాప్‌గా, విడి భాగాలు విక్రయించడానికి ఓఎల్ఎక్స్లో పెడుతున్నారు. వెబ్సైట్లో సెర్చ్ చేసి నంబర్లు... హితేష్ ఈ వాహనాలను ఓఎల్ఎక్స్ ద్వారా రూ.10 వేల నుంచి రూ.15 వేలు వెచ్చించి ఖరీదు చేస్తున్నాడు. వీటిని హైదరాబాద్‌కు తెప్పించిన తర్వాత తనకు పరిచయస్తులైన దాదాపు 20 మంది మెకానిక్‌లకు సమాచారం ఇచ్చేవాడు. యథాతథంగా వాహనం కావాలంటూ రూ.25 వేలకు విక్రయించేస్తున్నాడు. ఎవరైనా తమకు రిజిస్ట్రేషన్‌తో సహా కావాలని కోరితే అసలు కథ ప్రారంభిస్తున్నాడు. ఆర్టీఏ కార్యకలాపాలపై పట్టున్న హితేష్ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ విభాగంలోకి ప్రవేశిస్తాడు. తమ దగ్గర ఉన్న వాహనం ఏ మోడల్‌కు చెందినదో గుర్తిస్తాడు. అప్పట్లో ఉండే రిజిస్ట్రేషన్ సిరీస్‌కు చెందిన ఏదో ఒక నెంబర్ అందులో ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాడు. ఆ నెంబర్ దాదాపు 15 ఏళ్లకు పూర్వానిది కావడంతో ‘నో డేటా ఫౌండ్’ అంటూ వస్తుంది. ఈ నెంబర్ నోట్ చేసుకునే హితేష్... మెకానిక్స్ సాయంతో ఆయా వాహనాలపై తనకు తోచిన ఇంజన్, ఛాసిస్ నెంబర్లను ప్రత్యేక ఉపకరణాల ద్వారా ముద్రించేస్తాడు. ఆర్టీఏ దళారి సాయంతో... ఇలా సిద్ధమైన వాహనాలకు సంబంధించిన నెంబర్లను ఓ చీటీపై రాసే హితేష్ దాన్ని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం ఏజెంట్ ఎ.విఠల్‌రావుకు అందిస్తాడు. ఒక్కో వాహనానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసే విఠల్‌రావు ఈ వివరాల ఆధారంగా ఆర్టీఏ అధికారుల సాయంతో ఆర్సీలు జారీ చేయిచేస్తాడు. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వచ్చే వాహనాలకు రీ–అసైన్మెంట్ పద్దతిలో, కాలం చెల్లినప్పటికీ ఫిట్నెస్తో ఉన్న వాహనాలకు రీ–రిజిస్ట్రేషన్ పద్దతిలో ఆర్టీఏ అధికారులు కొత్తగా వేరే నెంబర్లు లేదా పాత నెంబర్లు కేటాయిస్తారు. ఈ రెండు పద్దతుల్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్న విఠల్‌రావు ఆర్సీలు జారీ చేయించి హితేష్‌కు అప్పగించేవాడు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఏ కార్యాలయంలో తన పరిచయస్తులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తూ నకిలీ యజమానులుగా ప్రవేశపెడుతున్నాడు. వీరితోనే వేలిముద్రలు వేయించడం, ఫొటోలు దిగేలా చేయడం, డిజిటల్ సంతకాలు పెట్టించడం చేస్తున్నాడు. భారీ మొత్తాలకు అమ్మేసుకుంటూ... ఇలా ‘తయారైన’ వాహనాలను హితేష్ తన ముఠాలోని మెకానిక్‌ల సాయంతో భారీ మొత్తాలకు విక్రయించేస్తున్నాడు. 1962 మోడల్‌కు చెందిన ‘ఏబీడీ 1’ రిజిస్ట్రేషన్‌తో కూడిన వాహనాన్ని ఏకంగా రూ.1.5 లక్షలకు అమ్మారు. విక్రయించేది సైతం మెకానిఖలే కావడం, వాహనాలు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసుకుని ఉండటం, ఆర్టీఏ రికార్డుల్లోనూ వివరాలు ఉంటుండటంతో ఖరీదు చేసే వారికీ ఎలాంటి అనుమానాలు రావడం లేదు. మరోపక్క హితేష్, విఠల్‌రావు ఏలాంటి వాహనాలు లేకుండానే 14 ఆర్సీలు వివిధ పేర్లు, నెంబర్లతో జారీ చేయించి సిద్ధంగా ఉంచారు. ఏవైనా వాహనాలు దొరికితే వాటిపై ఈ నెంబర్లు వేసి విక్రయించాలని భావించారు. మరోపక్క ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ సహాయంతో 72 నెంబర్లను సిద్ధం చేసి ఉంచారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం దాడి చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. క్రేజ్ ఉన్న వాహనాలే ఎక్కువగా... ప్రధాన సూత్రధారి హితేష్, ఆర్టీఏ దళారి విఠల్‌రావులతో పాటు సహకరించిన మెకానిక్స్ మైఖేల్ మోది (ఆలుగడ్డబావి), హకీం అబు నాసిర్ (శాస్త్రిపురం), మహ్మద్ ఆరిఫ్‌లను (వారాసిగూడ) అరెస్టు చేసింది. వీరి నుంచి, వీరు విక్రయించిన 15 రాయల్ ఎన్ఫీల్డ్, 2 యమహా బైక్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ గ్యాంగ్ ఎక్కువగా క్రేజ్ ఉన్న వాహనాలకే రిజిస్ట్రేషన్లు సృష్టించి విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఆర్టీఏ అధికారుల వివరాలు ఆరా తీయడానికి పోలీసు కమిషనర్ ద్వారా ఆర్టీఏ కమిషనర్‌కు లేఖ రాయనున్నామని డీసీపీ పేర్కొన్నారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం బోయిన్పల్లి, గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. -
కాగితాల కష్టాలు!
మణుగూరు : అతి పెద్ద వైశాల్యం గల భద్రాద్రి జిల్లాలో నూతన వాహనాల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కోసం పాట్లు పడాల్సి వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం కొత్తగూడెం, భద్రాచలంలో మాత్రమే ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు, నంబర్ ప్లేట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం ఈ కార్యాలయాల్లో ఏదో ఒక చోటకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని 23 మండలాల్లో నెలకు సుమారు 2 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. దీంతో పనుల్లో జాప్యంతో పడిగాపులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రిజిస్ట్రేషన్లతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకునేవారు, గతంలో తీసుకున్నవి రెన్యూవల్ చేయించుకునే వారు.. ఇలా నిత్యం ఎంతోమంది వస్తుంటారు. వీటి ద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.30 లక్షల మేర ఆదాయం కూడా సమకూరుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, టాటా ఏస్‌లు, లారీలు, జీపులు, గూడ్స్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు 9 నుంచి 14 శాతం మేర పన్ను వసూలు చేస్తారు. ప్రయాణం.. ఆపై పడిగాపులు... జిల్లాలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, లారీలతో పాటు నాన్‌ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, మిషన్లు భారీస్థాయిలో కొనుగోళ్లు జరుగుతుంటాయి. నూతన వాహనం కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే, ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించడం మరో ఎత్తుగా మారింది. ముఖ్యంగా పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల వారు కొత్తగూడెం లేదా భద్రాచలం వెళ్లాలంటే ప్రయాణం భారంగా మారుతోంది. కరకగూడెం, పినపాక, గుండాల, ఆళ్లపల్లి మండలాల వారికి మరీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఒకసారి వెళ్తే ఆన్లైన్ సమస్య ఏర్పడితే మరోసారి వెళ్లాల్సి ఉంటుంది. వస్తుంది. కరకగూడెం మండలం నుంచి భద్రాచలానికి సుమారు 75 కిలోమీటర్లు, ఆళ్లపల్లి నుంచి 40 కిలోమీటర్లు, గుండాల నుంచి 65 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక అశ్వారావుపేట నుంచి కొత్తగూడేనికి 70, దమ్మపేట నుంచి 50 కిలోమీటర్లు వెళ్తేనే రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుంది. మణుగూరులో ఏర్పాటు చేయాలి... పినపాక నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మణుగూరులో ఆర్టీఏ కార్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతమైన మణుగూరులో ద్విచక్ర వాహనాల, ఆటోలు, కార్లు, ట్రాక్టర్ల వినియోగం ఎక్కువ. పినపాకలో బీటీపీఎస్, మణుగూరులో సింగరేణి గనులు, అశ్వాపురంలో హెవీవాటర్ ప్లాంట్, సారపాకలో ఐటీసీ పరిశ్రమలు ఉండడంతో రవాణాకు ఉపకరించే వాహనాలతో పాటు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం అధికంగా ఉండటంతో మూలంగా ట్రాక్టర్ల వంటివి కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, సింగరేణిలో గనుల విస్తరణతో భారీ యంత్రాల వినియోగం పెరుగుతోంది. వీటన్నింటి రిజిస్ట్రేషన్‌కు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మణుగూరులో రవాణా శాఖ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
గోల్మాల్ రవాణా
తిరుపతి మంగళం: రవాణా శాఖలో ఏదైనా వాహనాన్ని విక్రయించాలంటే యజమాని వేలిముద్రలు తప్పనిసరి. అయితే ఇక్కడ ఏజెంట్లు లైన్లో నిలబడి మొదట్లో వాహన రిజిస్ట్రేషన్ కోసం అసలు యజమాని ఇచ్చిన ఆధార్‌ను తీసుకుని వాహన యజమానిగా అవతారమెత్తుతున్నారు. వచ్చిన వ్యక్తి వాహన యజమాని కాదని రవాణాశాఖ సిబ్బందికి కూడా తెలుసు. అయినప్పటికీ ఏజెంట్లతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా పని కానిచ్చేస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల్లోని రవాణాశాఖ కార్యాలయాల్లో ఈ నకిలీ రిజిస్ట్రేషన్ల వ్యవహారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం వివిధ ఫైనాన్స్ కంపెనీలతో ముందుగానే అటు ఏజెంట్లు, ఇటు రవాణాశాఖ సిబ్బంది చేతులు కలిపి వ్యవహారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో రిజిస్ట్రేషన్‌కు రూ.2 వేలు నుంచి రూ.5 వేల వరకు లాగుతున్నారు. ఏజెంట్ల మాయాజాలం నకిలీ రిజిస్ట్రేషన్లను రవాణా శాఖలో ఏజెంట్లు దగ్గరుం డి నడిపిస్తున్నారు. వాహనదారుడు ఫైనాన్స్‌లో బైక్‌ను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఆరునెలలు, ఏడాది పాటు వాడుకుని ఫైనాన్స్ సంస్థకు డబ్బులు చెల్లించని వాహనాన్ని సంస్థ నిర్వాహకులు సీజ్ చేస్తారు. అలాంటి వాహనాలకు వారు తిరిగి వేలం నిర్వహిస్తుంటారు. వీటికి రిజిస్ట్రేషన్ చేయాలంటే పాత యజమాని రాడు. దీంతో రోడ్డు పక్కన వాహనాలను విక్రయించే వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయంలోని సిబ్బంది, ఏజెంట్లతో కుమ్మక్కై ఎవరో ఒకరి వేలిముద్రలతో రిజిస్ట్రేషన్ చేయించేసి వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. అందుకు నజరానాగా అటు ఫైనాన్స్ సంస్థల నుంచి ఒక్కో రిజిస్ట్రేషన్‌కు ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. వాహనాన్ని బట్టి రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. పాత తేదీలతో వ్యవహారం ప్రస్తుతం రవాణా శాఖలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో నేరుగా డీలర్ల వద్దనే అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 24గంటల్లో శాశ్వత నెంబర్ వాహన యజమానికి అందుతోంది. అయితే నూతన విధానం కొన్ని వాహనాలకు మాత్రమే వర్తిస్తోంది. గతంలో కొన్ని వాహనాలను మాత్రం పాత విధానాన్ని రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ సంస్థలు సీజ్ చేసిన వాహనాలన్నీ పాతవి కావడంతో వీరి పని సులువుగా మారుతోంది. వాహనాన్ని ఇతరులకు అమ్మి.. అతని పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలంటే కచ్చితంగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే. అప్పుడే వాహనాన్ని ఇతరులకు బదలాయిస్తారు. అయితే జిల్లాలో మాత్రం వాహన యజమాని లేకుండానే నకిలీ యజమాని వేలిముద్రలతో ఇతరుల పేరిట పని కానిచ్చేస్తున్నారు. ప్రధానంగా ఫైనాన్స్ తీసుకుని సకాలంలో కంతులు చెల్లించకుండా సీజ్ చేసిన వాహనాలను ఇతరులకు విక్రయించేస్తున్నారు. అది కూడా మొదట ఫైనాన్స్ తీసుకున్న యజమాని లేకుండానే. ఏజెంట్ల మాయాజాలంతో ఈ తంతు నిరాటంకంగా కొనసాగుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులొస్తే చర్యలు యజమాని లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా రిజిస్ట్రేషన్ చేయకూడదు. ముందుగా వాహన దారుడి ఆధార్‌ను కంప్యూటర్లో నమోదు చేస్తాం. అలా చేసుకోకుంటే వాహనాన్ని కొనుగోలు చేసినవారు నేరుగా మా వద్దకు రావాలి. అప్పుడు ఆ వాహన రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో సూచిస్తాం. అలా కాకుండా ఏజెంట్లతో కుమ్మౖక నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకుని, మోసపోవద్దు. ఈ వ్యవహారంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాం. – వివేకానందరెడ్డి, తిరుపతి ఆర్టీఓ -
లైసెన్స్ కావాలా...మొక్క నాటండి
♦ కొత్త వాహనం రిజిస్ట్రేషన్‌కు రెండు మొక్కలు.. ♦ ఆర్టీఏ వినూత్న ప్రచారం ♦ హరితహారానికి ఊతం సాక్షి, సిటీబ్యూరో : డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల్లో హరితస్ఫూర్తిని నింపేందుకు ఆర్టీఏ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వాహనదారుడు లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొనే సమయంలో తప్పనిసరిగా ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని, వాహనదారుడిగా తమ అనుభవంతో పాటే మొక్క కూడా పెరిగి పెద్దదవుతుందని, డ్రైవింగ్ లైసెన్స్‌కు గుర్తుగా ఉండిపోతుందని ఆర్టీఏ ప్రచారం చేపట్టింది. అలాగే ‘కొత్త వాహనం కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రెండు మొక్కలు నాటండి. కొత్త వాహనం కొనుగోలు చేసిన మీ సంతోషం రెట్టింపవుతుంది.’ అని పేర్కొంటూ పోస్టర్లు, రేడియం స్టిక్కర్లను రవాణా అధికారులు విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు స్కూల్ పిల్లలు తమ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కను నాటాలనే సందేశాన్నిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్ నేతృత్వంలో మెహదీపట్నంలోని గోల్కొండ కేంద్రీయ విద్యాలయం–2లో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టారు. సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్, ఎంవీఐ టీవీ రావు, టీఎన్జీవోస్ తెలంగాణ రవాణా ఉద్యోగుల ఫోరమ్ ప్రధాన కార్యదర్శి సామ్యూల్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్ధులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్ధి తన పుట్టిన రోజు కానుకగా ఒక మొక్కను నాటాలని ప్రియాంక వర్గీస్ పిలుపునిచ్చారు. హరిత హారంపై వివిధ రూపాల్లో ప్రచారం చేపట్టిన ఆర్టీఏ కృషిని ఆమె అభినందించారు. ఆర్టీఏ రూపొందించిన రేడియం స్టిక్కర్లు, ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. -
వాహనాల రిజిస్ట్రేషన్‌కు కొత్త కోడ్స్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో వాహనాల రిజిస్ట్రేషన్‌కు కొత్త కోడ్స్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు విడుదల చేశారు. జిల్లాల వారీగా కొత్త కోడ్స్ వివరాలు... అనంతపురం (ఏపీ 01) చిత్తూరు (ఏపీ 02) కడప (ఏపీ 03) తూర్పు గోదావరి (ఏపీ 04) గుంటూరు (ఏపీ 05) కృష్ణా (ఏపీ 06) కర్నూలు (ఏపీ 07) నెల్లూరు (ఏపీ 08) ప్రకాశం (ఏపీ 09) శ్రీకాకుళం (ఏపీ 10) విశాఖ (ఏపీ 11) విజయనగరం (ఏపీ 12) పశ్చిమగోదావరి (ఏపీ 13)