సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో వాహనాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. బైక్‌లు, కార్లు కొనేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క హైదరాబాద్‌దే కాదు.. మిగతా ఉమ్మడి జిల్లాల పరిధిలోనూ వాహనాల పెరుగుదల ఘననీయంగా నమోదైంది. హైదరాబాద్ కాక మిగతా జిల్లాల పరిధిలో 2014లో 9 జిల్లాల పరిధిలో దాదాపు 35 లక్షల వాహనాలుండగా, 2019 (ఆగస్టు 2) వరకు ఈ సంఖ్య 60 లక్షలకు చేరింది. ఏటా వీటి సంఖ్య పెరుగుతూపోతోంది.
2014 నుంచి 2019 (ఆగస్టు 12) వరకు గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. మెదక్ జిల్లాలో అత్యధికంగా వాహనాల సంఖ్య రెట్టింపు అయ్యింది. నల్లగొండలో తక్కువగా దాదాపు 25 శాతమే పెరగడం విశేషం. రోజూ 500 వాహనాల రిజిస్ట్రేషన్లతో వరంగల్ టాప్‌లో ఉండగా, 139 వాహనాల రిజిస్ట్రేషన్లతో ఖమ్మం అత్యల్పస్థానంలో ఉంది. ఇక అత్యధికంగా కార్లు ఉన్న జిల్లాల్లో 2,65,000 వాహనాలతో రంగారెడ్డి నంబర్ వన్‌గా ఉండగా, 24,141 వాహనాలతో నల్లగొండ చివరి స్థానంలో ఉంది. పెరుగుతున్న అవసరాలతో ప్రతిఒక్కరూ ఇంట్లో ఏదో ఓ వాహనం ఉండాలని భావిస్తున్నారు. వాహనాల కొనుగోలుపై లోన్ల సదుపాయం, పలు సందర్భాల్లో ఆఫర్ల ప్రకటనలు కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment