నూతన సర్వర్ ద్వారా రవాణా సేవలు | Transportation services through the new server | Sakshi
Sakshi News home page

నూతన సర్వర్ ద్వారా రవాణా సేవలు

Published Tue, Jun 3 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

Transportation services through the new server

చిత్తూరు(జిల్లాపరిషత్) న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణా శాఖ సోమవారం నుంచి నూతన సర్వర్ ద్వారా ప్రజలకు సేవలను ప్రారంభించింది. నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇతర సేవలను నూతన సర్వర్ ద్వారా అందించినట్టు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. నూతన రాష్ట్రానికి సం బంధించి ఏపీ జిల్లా సీరీస్ త్వరలో మారుతుందన్నారు. తెలంగాణ రా ష్ట్రానికి ఇచ్చిన టీజీ కోడ్‌ను టీఎస్‌గా మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో కొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకా శం ఉందని ఆయన పేర్కొన్నారు.
 
పాత పర్మిట్లు చెల్లుతాయి
 
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తీసుకు న్న పర్మిట్లు రెండు రాష్ట్రాల్లో చెల్లుబాటవుతాయని, దీనికి సంబంధించి ప్రభుత్వం జూన్ 1న 46 జీవోను జారీ చేసిందని ఎం.బసిరెడ్డి తెలిపా రు. దీంతో పర్మిట్ ఉన్నంత వరకు రెండు రాష్ట్రాల్లో సంబంధిత వాహనా లు తిరగవచ్చన్నారు. జూన్ 1వ తేదికి ముందు జీవితకాలం పన్ను చెల్లించి న వాహనాలు తెలంగాణలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, తెలంగాణ  పరిధిలో చెల్లించిన వారు ఆంధ్రప్రదేశ్‌లో చెల్లించాల్సిన అవసరం లేద ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం దన్నారు.

ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధిం చి ఇప్పుడున్న పర్మిట్లు అలాగే కొనసాగించనున్నట్టు తెలిపారు. నూతన రాష్ట్రంలో జరిగే లావాదేవీలు ఆయా రాష్ట్రాలకు పరిమితం కానున్నాయని, మన రాష్ట్రంలో పర్మిట్ తీసుకున్న వాహనాలు అక్కడకు వెళితే అక్కడ తప్పనిసరిగా పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement