న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) కోల్‌కతా అనుమతుల నేపథ్యంలో ఎస్‌అండ్‌టీ మైనింగ్ విలీనాన్ని పూర్తి చేసినట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజా గా వెల్లడించింది. డిసెంబర్1 నుంచి విలీనం అమలులోకి వచి్చనట్లు తెలియజేసింది. విలీన పథకంలో భాగంగా ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ను మూసివేయకుండా కంపెనీలో కలిపేసుకున్న ట్లు వివరించింది.
టాటా స్టీల్ ఇటీవల కొంతకాలంగా అనుబంధ సంస్థలను విలీనం చేసుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లోఅనుబంధ సంస్థల విలీనం పూర్తికానున్నట్లు ఇంతక్రితం కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment