Fitness certificates
-
ఇక పక్కాగా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అందుకోసం వాహనాల ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించే దిశగా కార్యాచరణకు ఉపక్రమించింది. రోడ్డు ప్రమాదాలకు కారణాల్లో వాహనాలు తగిన ఫిట్నెస్తో లేకపోవడం ఒకటని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు రవాణా శాఖ అధికారులు వాహనాలను స్వయంగా పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేకపోయినా సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉంటున్నాయి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే వ్యవస్థను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 26 ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు (ఏటీసీ)లు ఏర్పాటుకు ఉపక్రమించింది. పుణెలోని ఆటో మోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) ప్రమాణాల మేరకు ఈ ఏటీసీలను డిజైన్ చేశారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్: రాష్ట్రంలో మొదటి ఏటీసీని విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేశారు. రూ. 18.50 కోట్లతో అక్కడ ఏటీసీ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి రవాణా శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. మొదటి దశలో 15 ఏటీసీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. వాటిలో శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం ఏటీసీల నిర్మాణానికి త్వరలోనే బిడ్లను ఖరారు చేయనున్నారు. మిగిలిన జిల్లా కేంద్రాల్లో ఏటీసీల నిర్మాణానికి ఫిబ్రవరి మొదటివారం నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. ఏటీసీల టెండర్లు ఖరారు అయిన తరువాత ఏడాదిలోగా వాటిని ప్రారంభించాలన్నది రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఏటీసీలను ప్రభుత్వం నెలకొల్పుతోంది. తద్వారా వాహనాల ఫిట్నెస్ను శాస్త్రీయంగా పరీక్షించి సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఏడాదిలోగా ఈ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. – ఎంకే సిన్హా, రవాణా శాఖ కమిషనర్ ఏటీసీల స్వరూపం ఇలా.. జిల్లా కేంద్రానికి గరిష్టంగా 30 కి.మీ. దూరంలో ఏటీసీలను నెలకొల్పుతారు. కనీసం 3 వేల చ.గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తారు. అధునాతన సెన్సార్లు, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక డ్రైవింగ్ ట్రాకులను ని ర్మిస్తారు. విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఏటీసీలో నాలుగు లేన్లతో కూడిన డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు రెండు ట్రాక్‌లు, లైట్ వెహికిల్స్‌ను రెండు డ్రైవింగ్ ట్రాక్‌లను కేటాయించారు. కాగా మిగిలిన 25 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఏటీసీలలో రెండేసి చొప్పున డ్రైవింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తారు. హెవీ వెహికిల్స్‌కు ఒక ట్రాక్, లైట్ వెహికిల్స్‌కు ఒక ట్రాక్‌ను కేటాయిస్తారు. ఫిట్‌నెస్‌కు వచ్చే వాహనాలు ఆ డ్రైవింగ్ ట్రాక్‌లలో ప్రయాణిస్తే... సెన్సార్ల ద్వారా వాటి ఫిట్నెస్ను పరీక్షిస్తారు. బ్రేకుల పనితీరు, ఇంజిన్ కండిషన్, ఇతర ప్రమాణాలను ఆటోమేటెడ్ విధానంలో నిర్ధారిస్తారు. దాంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ విధానాన్ని అమలులోకి తీసుకువస్తారు. -
అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: అమర్నాథ్ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్ సర్టిíఫికెట్లు జారీ చేయాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమర్నాథ్ 2022 యాత్ర జూన్ 30 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఉంటుంది. యాత్రకు వెళ్లేందుకు నిర్దేశించిన మెడికల్ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, వయసును ధ్రువీకరించే ఇతర సర్టిఫికెట్లతో దగ్గర్లోని ప్రభుత్వ బోధనాసుపత్రికి యాత్రికులు వెళ్లాలి. అక్కడి రిసెప్షన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత వరుస క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించే తేదీని నిర్ణయిస్తారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు దరఖాస్తు చేసుకున్న వారి వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తుంది. (క్లిక్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మెడికల్ సర్టిఫికెట్లు..) -
అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు.. దరఖాస్తు ఇలా..
సాక్షి, హైదరాబాద్: అమర్నాథ్ వెళ్లే యాత్రికులకు అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో వైద్యపరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు నిర్ధేశించిన మెడికల్ బోర్డు నుంచి తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ పత్రం పొందాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర నిలిపివేశారు. ఈ కారణంగా ఈ ఏడాది యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రతివారం 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని, ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికే వరుస క్రమంలో వైద్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. మెడికల్ బోర్డు కమిటీ ఎంపిక చేశామని, నితిన్‌కాబ్రా (కార్డియాలజీ) సత్యనారాయణ (ఆర్ధోపెడిక్), కృష్ణమూర్తి(ఫల్మనాలజీ), రవీందర్ (జనరల్ మెడిసిన్) వైద్యులు బోర్డు సభ్యులుగా కొనసాగుతారని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. దరఖాస్తు ఇలా... యాత్రికులు ఆథార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో గాంధీ మెడికల్ రికార్డు సెక్షన్లో సంప్రదించాలి. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత వరుస క్రమంలో వచ్చే తేదీని నిర్ణయిస్తారు. సదరు తేదీ రోజు గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తు ఎంఆర్డీ సెక్షన్ కార్యాలయంలో మెడికల్ బోర్డు వైద్యుల నిర్వహించే వైద్య పరీక్షలకు నేరుగా హాజరుకావాలి. (క్లిక్: సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు) చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవీ.. కంప్లీట్ బ్లడ్ ప్రొఫిల్లింగ్ (సీబీపీ), ఆర్థరైటీ సెడిమెంటేషన్ రేట్ (ఈఎస్ఆర్), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (సీయు ఈ), గ్లూకోజ్ ర్యాండమ్ బ్లడ్ సుగర్ (జీఆర్బీఎస్) బ్లడ్ యూరియా, సీరం క్రియేటిన్, ఎలక్టోకార్డియా గ్రామ్(ఈసీజీ), ఎక్స్‌రే చెస్ట్ వైద్యపరీక్షల నివేదికలను కమిటీ ముందుంచాలి. యాభై ఏళ్ల వయసు పైబడినవారు పై నివేదికలతోపాటు రెండు మోకాలి (బోత్ నీస్) ఎక్స్‌రేలు జతచేయాలి. మెడికల్ బోర్డు సభ్యులు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. (క్లిక్: చింత చెట్టుపై వింత ఇల్లు .. 20 ఏళ్ల క్రితమే!) -
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు 75 శాతం
సాక్షి, అమరావతి: స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) రెన్యువల్ చేయించుకునే విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాసక్తంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో 75 శాతం స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. కరోనా పరిస్థితులతో దాదాపు ఏడాదిన్నర తరువాత పాఠశాలలను ఇటీవల పునఃప్రారంభించారు. గత ఏడాది కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకునే విషయంపై కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాగా, రెన్యువల్ గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుంది. కానీ ఇప్పటికీ చాలా యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యువల్‌పై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కరోనా మూడో వేవ్ వస్తుందా, రాదా అనేదానిపై స్పష్టత వచ్చేవరకు ఈ విషయంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. 6,444 బస్సులకు ఎఫ్‌సీలు రాష్ట్రంలో మొత్తం 25,236 స్కూల్ బస్సులు ఉన్నాయి. కాగా వాటిలో సెప్టెంబర్ 30 నాటికి కేవలం 6,444 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించారు. 18,792 బస్సులకు ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయలేదు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన స్కూల్ బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. -
క్యాష్ కొట్టు.. ఫిట్నెస్ పట్టు
పారదర్శకపాలన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పరితపిస్తున్నారు. అవినీతిలేని సమాజాన్ని సృష్టించాలని తపన పడుతున్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజలకు నీతివంతమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ ఇంకా రవాణాశాఖ కార్యాలయంలో మాత్రం ఆ జాఢ్యం వీడటం లేదు. ఆఫీసులోకి రాకున్నా... ఏజెంట్లు బయటినుంచే దందా నడిపిస్తున్నారు. నేరుగా వాహన యజమానులు వెళ్తే జరగని పనులు దళారుల ద్వారా చిటికెలో అయిపోతున్నాయన్న ప్రచారం సాగుతోంది. సాక్షి, విజయనగరం : జిల్లాకేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఇంకా దళారీలే చక్రం తిప్పుతున్నారు. ప్రతి పనికీ వారిని ఆశ్రయించి... ఎంతోకొంత సొమ్ము ముట్టజెబితే చిటికెలో పనులు జరిగిపోతున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ నుంచి లైసెన్సులు వంటివి జారీ చేయడానికి చేతులు తడిపితే చాలు పనులు జరిగిపోతున్నట్టు విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆటో, ట్రాక్టర్, లారీ, బస్సు, గూడ్సు వాహనాలకు ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఫిట్ నెస్ సర్టిఫికెట్(సామర్థ్య ధ్రువీకరణ పత్రం) జారీ చేస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి పూర్తి స్థాయి కండిషన్‌తో తీసుకుని వెళ్లాలి. సీట్లు, టైర్లు, పెయింటింగ్, ఇంజిన్ అన్నీ కండిషన్లో ఉండాలి. రవాణా శాఖ కార్యాలయంలో వెహికల్ ఇన్స్పెక్టర్ ఆ వాహనానికి ఫొటో తీసి పూర్తి స్థాయి కండిషన్ ఉన్నట్టు గుర్తిస్తే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలి. అయితే ఈ సర్టిఫికెట్ కావాల్సిన వాహనయజమానులు నేరుగా వెళితే అధికారులు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ ద్వారా వెళితే వాహనం కండిషన్ కాస్త అటు, ఇటుగా ఉన్నా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. వాహనం కండిషన్‌గా ఉన్నప్పటికీ నేరుగా వెళ్తే ఏదో ఒక వంక పెట్టి తిప్పి పంపుతున్నట్టు ఆరోపిస్తున్నారు. వాట్సాప్ ద్వారానే ఫిట్నెస్ సర్టిఫికెట్ విజయనగరంలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కార్యాలయం ఉంది. సాలూరు, పార్వతీపురంలో వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. కొంతమంది అధికారులు వాహనం కార్యాలయానికి తీసుకుని రాకపోయినా వాట్సాప్ ద్వారా గానీ, దళారీ ద్వారా గానీ పత్రాలు పంపిస్తే ఫిట్నెస్ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు దళారులను లోపలికి రానివ్వడం లేదని చెబుతున్నా... వారు కార్యాలయం బయటినుంచే దందా కొనసాగిస్తున్నారు. ప్రతీ ఎజెంట్‌కు ఒక కోడ్ పెట్టుకుని వాహనయజమాని దరఖాస్తుపై ఆ కోడ్ వేసి అధికారుల దగ్గరకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెంట్ల కోడ్ చూసి వాహనయజమానులకు ఎల్ఎల్ఆర్, ఫిట్ నెస్ సర్టిఫికెట్ , డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరు, ఇద్దరు ఏజెంట్లు మాత్రం కార్యాలయంలో తిరుగుతూ తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. వసూళ్లలోనూ రెట్టింపే... రవాణా శాఖ కార్యాలయంలో ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్సు, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి వాటికోసం ప్రభుత్వానికి చెల్లించే ఫీజుల కంటే ఏజెంట్లు రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఎందు కంత ఇవ్వాలని వాహనయజమాని అడిగితే అధికారులకు ఇచ్చుకోవాలి కదా అంటూ దర్జాగా చెబుతున్నారు. ఆటోకు, ట్రాక్టర్‌కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.760లే. కాని ఏజెంట్లు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు. స్కూలు బస్సులు, లారీలు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.960లు ఏజెంట్లు రూ.4 వేల నుంచి రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. టూవీలర్ ఎల్‌ఎల్‌ఆర్‌కు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు రూ.260లు అయితే ఏజెంట్లు రూ.600ల నుంచి రూ.800లు వసూలు చేస్తున్నారు. ఫోర్ వీలర్ ఎల్ఎల్ఆర్ ఫీజు రూ. 310లు కాగా వసూలు చేస్తున్నది రూ.500 నుంచి రూ.900లు. టూ వీలర్ లైసెన్సు ఫీజు రూ. 960లు కాగా రూ. 1600 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఫోర్ వీలర్ లైసెన్సుకు రూ.1260లు ఫీజు కాగా రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు వసూలు చేస్తున్నారు.హెవీ లైసెన్సుకు ఫీజు రూ.1260లు కాగా రూ. 4 వేలు వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న మూడు రవాణా శాఖ కార్యాలయాలకు ఎల్ఎల్ఆర్ కోసం 150 మంది, డ్రైవింగ్ లైసెన్సుల కోసం 100 మంది వరకు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం 100 మంది, ఇతర పనులు నిమత్తం 100 నుంచి 120 మంది వరకు వస్తారు. దళారులను కట్టడి చేశాం ఏజెంట్లను కార్యాలయంలోకి రానివ్వకుండా కట్టడి చేశాం. వాహన యజమానుల కోసం హెల్ప్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఏ పనికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నామో కరపత్రాల ద్వారా తెలియజేస్తున్నాం. కార్యాలయానికి వాహనం రాకుండా వాట్సాప్ ద్వారా పేపర్లు తెప్పించి ఎఫ్‌సీలు జారీ చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.శ్రీదేవి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ -
ఆర్టీఏలో..అలజడి!
జిల్లా ఆర్టీఏలో రోజురోజుకు ముసలం ముదురుతోంది. ఎంవీఐలు మొదలు ఇతర ఉద్యోగులు సైతం ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపడంలేదు. ఇప్పటికే అధికారులు, సిబ్బంది కొరతతో సతమతమవుతుండగా.. అందుబాటులో ఉన్నవారిలో పలువురు అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. దీంతో మిగతా అధికారులు, ఉద్యోగులు సైతం ఒక్కొక్కరుగా జిల్లా దాటివెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా ఆర్టీఏ సేవలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. లైసెన్సులు, ఆర్సీబుక్లు, రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్, ట్యాక్సుల వసూలు తదితర రెగ్యులర్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికే స్కూల్ బస్సులన్నింటికీ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. స్కూళ్లు మొదలై వారం కావస్తున్నా ఈ విషయంపై ఇప్పటికీ దృష్టిసారించడం లేదు. ఒక్కోసారి పరిగిలో నిర్వహించాల్సిన ఫిట్నెస్ టెస్టులు, ఇతర సేవలకు సైతం వికారాబాద్ రప్పించుకుంటున్నారు. జిల్లాలో కేవలం పరిగిలో మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉండగా.. వికారాబాద్‌లో ఎలాంటి చోదక పరీక్షలు నిర్వహించకుండానే లైసెన్స్‌లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిగి: జిల్లా పరిధిలో పని చేసేందుకు ఆర్టీ ఏ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరులో ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ మూడింటికీ కలిపి ఒకే ఎంవీఐ పోస్టు ఉంది. పరిగి ఆర్టీఏ యూనిట్ కార్యాలయంలో ఎంవీఐ పోస్టు ఉండగా.. వికారాబాద్, తాండూరుకు సైతం ఇన్చార్జ్ ఎంవీఐగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవలి వరకు మూడు ఆర్టీఏ కార్యాలయాల్లో ఎంవీఐగా విధులు నిర్వహించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఎవరూ రాకపోవటంతో చెకింగ్ ఎంవీఐ కిషోర్ బాబుకు మూడు కార్యాలయాల ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడులతో జంకిన ఈయన లాంగ్‌లీవ్‌పై వెళ్లిపోయారు. జిల్లాకు చెందిన మరికొందరు ఉద్యోగులు సైతం ఇక్కడ ఇమడలేక జిల్లా దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో వారం రోజులుగా ఆర్టీఏ సేవలు స్తంభించాయి. ఈ విషయంలో వికారాబాద్ ఆర్టీఓ వాణిని వివరణ కోరగా ఇటీవల రెండు మూడు రోజులు సేవలు స్తంభించిన మాట వాస్తవమేనని, సాధ్యమైనంత వరకు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పక్క జిల్లాకు చెందిన జూనియర్ ఎంవీఐలకు జిల్లాలో ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అధికారులకు అవినీతి మరకలు... జిల్లాలో ఆర్టీఏ ఉద్యోగుల అవినీతి హద్దులు దాటుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.500 చేయాల్సిన పనికి రూ.2 వేలు, రూ.వెయ్యికి పూర్తయ్యే పని కోసం రూ.5 వేలు వసూలు చేస్తున్నారని సమాచారం. రూ.2 వేలలోపు ఖర్చయ్యే హెవీ లైసెన్స్‌కు ఏకంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు దండుకుంటున్నారు. ఇటీవల ఓ ఆర్టీఏ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. దీంతో ఆర్టీఏ అధికారుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. గతేడాది జిల్లాలో విధులు నిర్వహించే ఓ అధికారి అవినీతి నిర్వాకం రాష్ట్ర సరిహద్దులు దాటిన విషయం తెలిసిందే. ఏకంగా విజయవాడలో లారీలకు బాడీ ఫిట్టింగ్ జరుగుతుండగానే అక్కడికే వెళ్లి ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ ఘటనతో సదరు అధికారిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా అవినీతి మరకలంటించుకున్న అధికారికి మళ్లీ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చి.. కొన్ని నెలల పాటు జిల్లాకు చెందిన మూడు కార్యాలయాల బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిచ్చింది. -
పగిలిన అద్దాలు.. విరిగిన డోర్లు
బస్సు ప్రయాణం భద్రత లేకుండా పోతోంది. ప్రమాదాలతో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. నివారణ చర్యలు చేపట్టాల్సిన ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పైనే దృష్టి పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. డ్రైవర్లకు పని ఒత్తిడి పెరగడం ప్రమాదాలకు ఒక కారణంగా చెబుతున్నారు. నిజామాబాద్‌నాగారం: ఘెరమైన బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ఆర్టీసీ యాజమాన్యం నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. పగిలిన అద్దాలు, ఊడి పోయిన డోర్లతో శిథిలా వస్థలో కనిపించే బస్సులను నడపడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.ఏడాదిన్నర కాలంలో ఉమ్మ డి జిల్లాలో 28 ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటు చేసుకోగా 31 మంది మరణించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని ఆర్టీసీ బస్సుల సామర్థ్యంపై సర్వ త్రా చర్చసాగుతోంది. నిజామాబాద్ రీజియన్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో నిజామాబాద్ డిపో–1, డిపో–2, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. మొత్తం 670 బస్సుల్లో 190 అద్దె బస్సులు ఉన్నాయి. గత రెండేళ్లలో ఆర్టీసీ ప్రమాదాల శాతం 0.05 శాతం నమోదైంది. ప్రస్తుతం 1లక్ష కిలోమీటర్‌కు 0.05 శాతం ప్రమాదాల రేటు ఉంది. ఇటీవల కమ్మర్పల్లి, డిచ్పల్లి, నస్రుల్లాబాద్, నందిపేట్ రూట్లలో ప్రమాదాలు జరిగాయి. ఫలితం లేని భద్రత వారోత్సవాలు... ప్రతి సంవత్సరం ఆర్టీసీలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే డిపోలో ఈ వారోత్సవాలు నామ మాత్రంగా నిర్వహిస్తున్నారు. ఇచ్చిన వారికే ఉత్తమ డ్రైవర్లుగా మళ్లీ అవార్డులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రతి డిపోలో 500 మందిపైగా కార్మికులు ఉంటే కేవలం యూనియన్ నాయకులకు, లేదంటే 10 మంది కార్మికులకు శిక్షణ పేరుతో మమ అనిపిస్తున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. డ్రైవర్లు నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. సెలవుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని అంటున్నారు. ఆదాయంపైనే దృష్టి... ఆర్టీసీ నష్టాల్లో ఉందని యాజమాన్యం ప్రతినిత్యం డ్రైవర్లను లాభాలు తేవాల్సిందేనని ఒత్తిడి పెంచుతోంది. కేవలం ఆదాయంపైనే అధికారులు దృష్టి పెట్టారని, డ్రైవర్లపై పెరుగుతున్న ఒత్తిడితో ప్రమాదాలకు దారితీస్తుందన్న విషయాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. బస్సుల సామర్థ్యం నామమాత్రమే... ఆర్టీసీ నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదు. బస్సుల సామర్థ్యం తగ్గిపోయిన విషయం తెలిసినా వాటిని దూరప్రాంతాలకు పంపిస్తున్నారు. డ్రైవర్లు నానా తిప్పలు పడుతూ బస్సులను నడిపిస్తున్నారు. ఈ బస్సులను నడపడం సాధ్యం కాదంటే ఇబ్బందులకు గురి చేసి సస్పెండ్ చేస్తారని, అందుకే ఇబ్బందులు ఎదురైనా నడిపిస్తున్నట్లు కార్మిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధాని (ఇంద్ర) బస్సులు సైతం చెడిపోయి రోడ్డు మ«ధ్యలో మొరాయించిన ఘటనలు ఉన్నాయి. కండిషనల్ లేని బస్సులను వరంగల్, నాందేడ్ రూట్లతో తిప్పుతున్నారు. ముఖ్యంగా నాన్‌స్టాప్ బస్సులో కేవలం 30 మంది ప్రయాణికులు మాత్రమే ఉండాలి. అయితే నందిపేట్ నుంచి నిజామాబాద్, ఆర్మూర్ నుంచి నిజామాబాద్, బోధన్ నుంచి నిజామాబాద్ నాన్‌స్టాప్ బస్సుల్లో సామర్థ్యానికి మించి సుమారు 60 మంది వరకు ప్రయాణికులను ఎక్కించి రాకపోకలు సాగిస్తున్నారు. అద్దె బస్సుల వైపు కన్నెత్తి చూడరు.. ఆర్టీసీలో అద్దె బస్సుల వైపు కన్నెత్తి చూడరు. కనీస నిబంధనలు పాటించకున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లకు సరైన శిక్షణ కూడా ఉండడం లేదు. అద్దె బస్సుల ప్రమదాలు జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అద్దె బస్సుల్లో తరుచు గా డ్రైవర్‌కు, ఆర్టీసీ కండక్టర్లకు సైతం గొడవలు జరిగిన ఘనలు ఉన్నాయి. కెపాసిటీకి మించి బస్సుల రాకపోకలు సాగిస్తున్నారు. నందిపేట్ నుంచి నిజామాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న ఒకే బస్సు ఆరు నెలల వ్యవధిలో డ్రైవర్లు అత్యంత వేగంగా నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుని ఇద్దరు ప్రయాణికులు మరణించారు. అయినా ఆ బస్సు యాథావిధిగా తిరుగుతోంది. తనిఖీలు చేపడుతున్నాం మేము ఖచ్చితంగా తనిఖీలు చేపడుతున్నాం. ఫిట్నెస్ లేని అద్దె బస్సులపై చర్యలు తీసుకుంటాము. ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఈ విషయంలో డిపో మేనేజర్లకు సైతం ఆదేశాలు ఉన్నాయి. నిబంధనలు అద్దె బస్సులు పాటించాలి. కా లం చెల్లిన బస్సులను లేకుండా చేస్తున్నాం. ప్రమాదాలు జరగకుండా సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకుంటునే ఉన్నాము. అనిల్‌కుమార్, డీవీఎం, నిజామాబాద్ -
పాతవాహనాలను రోడ్లపైకి రానీయొద్దు
జాతీయ హరిత ధర్మాసనం ఆదేశం - 15 ఏళ్లు దాటితే రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించొద్దు - ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా జారీ చేయొద్దు - ఎన్జీటీ ఆదేశాలతో మాయం కానున్న పది లక్షల వాహనాలు - పార్కింగ్ సమస్యనుంచి స్వల్ప ఉపశమనం సాక్షి, న్యూఢిల్లీ: 15 ఏళ్లు దాటిన వాహనాలను నగర రహదారులపైకి రానీయొద్దని జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) ఆదేశించింది. నగరంలో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతుండడం, వాయు నాణ్యత తగ్గిపోతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని పై విధంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాల కారణంగా 10 లక్షల వాహనాలు నగర రహదారులపైనుంచి మాయం కానున్నాయి. ఇందువల్ల నగరంలో పార్కింగ్ సమస్యకు కూడా కొంతమేర పరిష్కారం లభించనుంది. జాతీయ రాజధానిలో వాయుకాలుష్యంపై వర్థమాన్ కౌశిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించిన అనంతరం మొత్తం 14 ఆదేశాలు జారీచేసింది. 15 సంవత్సరాలు దాటిన అన్ని రకాల వాహనాలపై నిషేధం వాటిలో ఒకటి, ఇటువంటి వాహనాలను గుర్తించినప్పుడు సంబంధిత అధికారులు వాటిని మోటారు వాహన చట్టం నిబంధనల కింద స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. ఇటువంటి వాహనాలను బహిరంగ ప్రదేశాలలో నిలిపిఉంచినప్పుడు చలాన్ విధింపు, జప్తు చేసే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. 15 సంవత్సరాలు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించకూడదని, వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేయరాదని ఆదేశించింది. ఈ ఆదేశాల కారణంగా పాత వాహనాలు రహదారులపై ఇకమీదట కనుమరుగు కానున్నాయి. ఇందువల్ల కొత్తవాటికి డిమాండ్ పెరగనుంది. బహిరంగప్రదేశాలలో ప్లాస్టిక్, చెట్ల ఆకుల వంటివాటిని తగులబెట్టడాన్ని అనుమతించరాదని, అటువంటి చర్యలకు పాల్పడేవారిపై చట్టరీత్యా తగిన చర్య తీసుకోవాలని కూడా ఎన్జీటీ ఆదేశించింది. -
అక్కడ ప్రమాదం.. ఇక్కడ తనిఖీలు
మత్తువీడిన రవాణశాఖ అధికారులు రెండు రోజులుగా స్కూల్ బస్సుల తనిఖీలు ఒంగోలు క్రైం :మెదక్ జిల్లాలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురై విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లాలో రవాణాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా బస్సులను తనిఖీ చేయని అధికారులు.. మెదక్‌లో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పాఠశాలలు ప్రారంభానికి మందే బస్సులను ఆర్టీవో అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోకుండానే 150 బస్సులు విద్యార్థులను పాఠశాలలకు తీసుకెళ్లి తీసుకొస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1310 స్కూలు, కళాశాలలకు చెందిన బస్సులు ఉన్నాయి. ఇవి కళాశాలల యాజమాన్యాలు ఆర్టీవో అధికారులకు ఇచ్చిన లెక్కలు మాత్రమే. ఇవికాకుండా ఆటోలు, మినీ వ్యాన్లు, చిన్న చిన్నవాహనాలు వందల కొద్దీ ఉన్నా అవి ఆర్టీఏ అధికారుల లెక్కల్లో లేవు. రవాణశాఖ అధికారుల కళ్ల ముందు ఫిట్నెస్ చేయించుకోని వాహనాలు తిరుగుతున్నా వాటి వైపు కన్నెత్తి కూడా చూసిన పాపాన పోవడంలేదు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం 1099 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేశారు. మెదక్ సంఘటనతో జిల్లా రవాణాశాఖాధికారులు అప్పటికప్పుడు రోడ్లపైకి వచ్చారు. బస్సులను తనిఖీ చేసే కార్యక్రమాన్ని హడావుడిగా చేపట్టారు. ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం కూడా జిల్లావ్యాప్తంగా పాఠశాలల, కళాశాలల బస్సులపై దాడులు నిర్వహించారు. జిల్లాలో ఆర్టీవో పి.కృష్ణమోహన్‌తో కలిసి 16 మంది రవాణాశాఖాధికారులు ఉన్నారు. ఒక్క ఒంగోలులోనే 11 మంది బ్రేక్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కాకుండా కందుకూరు, చీరాల, మార్కాపురం, దర్శి కేంద్రాలుగా బ్రేక్ ఇన్స్పెక్టర్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతమంది అధికారులు ఉన్నా స్కూలు బస్సులపై కనీస నిఘా పెట్టకపోవడంతో అక్కడక్కడా పమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఒంగోలులోనే మంగమూరు రోడ్డు బైపాస్ సమీపంలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. టైరు పంక్చరై రోడ్డు మార్జిన్లోకి దూసుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడగలిగారు. అదే వెనుక నుంచి ఏదైనా వాహనం వేగంగా వచ్చి ఉంటే పెను ప్రమాదమే జరిగేది. -
తేలనున్న ‘బాలకృష్ణ’ లీలలు
నిజామాబాద్‌అర్బన్ : గతంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్)గా పనిచేసిన బాలకృష్ణ నిబంధనలు తుంగలో తొక్కి.. ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్రమ పదోన్నతులు, బదిలీలు చేపట్టారని, సంబంధిత అధికారులకు తెలుపకుండానే పనులు చేపట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈమేరకు నిబంధనలను తుంగలో తొక్కిన ఆ అధికారి లీలలు త్వరలో బయటకు రానున్నాయి. అక్రమ నియామకాలు డీసీహెచ్ఎస్గా ఉన్నప్పుడు బాలకృష్ణ నిబంధనలను పట్టించుకోకుండా ఎనిమిదిమంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిన నియమిచారు. కనీసం కలెక్టర్, వైద్యావిధాన పరిషత్ కమిషనర్ అనుమతి కూడా తీసుకోలేదు. బాన్సువాడలో నలుగురు, నిజామాబాద్‌లో ఇద్దరు, ఎల్లారెడ్డిలో ఇద్దరు చొప్పున నియమించారు. తన ఇంటి వద్దనే ఉత్తర్వులను ఏర్పాటు చేసుకొని సంతకాలు చేసి మరి నియమకాలు చేశారు. కొత్త డీసీహెచ్ఎస్ వారి వేతనాల కోసం కలెక్టర్‌ను సంప్రదించగా ఆయన ఈ నియామకాలపై ఆరా తీశారు. దీంతో బాలకృష్ణ చేసిన అక్రమ నియామకాలు బయటపడ్డాయి. ఈ వ్యవహరంపై ‘సాక్షి’ ఫిబ్రవరి 28న వైద్య‘విధానం’ లేదు.. శీర్షికన కథనం ప్రచురించింది. మెడికల్ కళాశాలకు సంబంధించిన వెంకటేశ్వర్లు, మరో వైద్యుడికి చెందిన ఫిట్నెస్ సర్టిఫికెట్లను తారుమారు చేశారు. వీరు ఫిట్‌గానే ఉన్నట్లు ఆసుపత్రి వైద్యాధికారులు నివేదికలు ఇచ్చారు. కానీ వీరు అన్‌ఫిట్ అంటూ బాలకృష్ణ వైద్యులు ఇచ్చిన నివేదికను చెరిపేసి.. తానే స్వయంగా సంతకం చేసి నివేదికలు ఇచ్చారు. వైద్యాధికారుల వద్ద డబ్బులు తీసుకొని ఈ తతంగం చేశారు. దీంతో నివేదిక ఇచ్చిన వైద్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణకు ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలో అక్రమంగా నలుగురికి పదోన్నతులు కల్పించారు. వీరికి కనీస అర్హతలు కూడా లేవు. నాల్గోతరగతి ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ఇందులో బోధన్‌కు చెందిన ఉద్యోగిని మద్నూరుకు, నిజామాబాద్‌కు చెందిన ఉద్యోగిని బాన్సువాడకు, బాన్సువాడకు చెందిన ఉద్యోగిని ఎల్లారెడ్డికి పంపుతూ పదోన్నతి కల్పించారు. ఇలా పదోన్నతి పొందిన ఉద్యోగులను సంబంధిత ఆస్పత్రుల అధికారులు అనుమతించలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. బోధన్ ఆస్పత్రిలో నిధులు మాయం బోధన్ ఏరియా ఆస్పత్రిలో నిధుల కుంభకోణం జరిగింది. దాదాపు రూ.32 లక్షలకు ఎలాంటి రికార్డులు లేవని ఉన్నతాదికారులు తేల్చిచెప్పారు. డీసీహెచ్ఎస్గా ఉన్న బాలకృష్ణారావు ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఈ నిధుల గందరగోళం జరిగింది. జనని సురక్ష యోజనకు సంబంధించి రూ. 4లక్షలు, ఆస్పత్రి అభివృద్ధి సంఘానికి సంబంధించి ఎలాంటి పనులు చేపట్టకుండానే రూ.22 లక్షలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఆస్పత్రి జూనియర్ అసిస్టెంట్, మరో అధికారితో కలిసి మత్తుమందు డాక్టర్ పేరిట బిల్లులు పెట్టి రూ.6 లక్షలను మింగేశారు. ఈ వ్యవహరం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అక్రమాలపై విచారణ కమిటీ డీసీహెచ్ఎస్గా బాలకృష్ణారావు చేసిన అక్రమాలపై అధికారులు సమర్పించిన నివేదికలపై స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణకు కమిటీ వేశారు. ఈ కమిటీలో ప్రస్తుత డీసీహెచ్ఎస్ శివదాస్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్ ఉన్నారు. గత డీసీహెచ్ఎస్ అక్రమ బదిలీలు, పదోన్నతులపై విచారణ చేపడుతున్నామని, ఇందులో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నామని డీసీహెచ్ఎస్ శివదాస్ తెలిపారు. డీసీహెచ్ఎస్గా బాలకృష్ణ చేసిన పనులపై త్వరలోనే విచారణ పూర్తిచేసి కలెక్టర్‌కు అందిస్తామని ఆయన చెప్పారు. -
నూతన సర్వర్ ద్వారా రవాణా సేవలు
చిత్తూరు(జిల్లాపరిషత్) న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రవాణా శాఖ సోమవారం నుంచి నూతన సర్వర్ ద్వారా ప్రజలకు సేవలను ప్రారంభించింది. నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇతర సేవలను నూతన సర్వర్ ద్వారా అందించినట్టు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. నూతన రాష్ట్రానికి సం బంధించి ఏపీ జిల్లా సీరీస్ త్వరలో మారుతుందన్నారు. తెలంగాణ రా ష్ట్రానికి ఇచ్చిన టీజీ కోడ్‌ను టీఎస్‌గా మార్చాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో కొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకా శం ఉందని ఆయన పేర్కొన్నారు. పాత పర్మిట్లు చెల్లుతాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తీసుకు న్న పర్మిట్లు రెండు రాష్ట్రాల్లో చెల్లుబాటవుతాయని, దీనికి సంబంధించి ప్రభుత్వం జూన్ 1న 46 జీవోను జారీ చేసిందని ఎం.బసిరెడ్డి తెలిపా రు. దీంతో పర్మిట్ ఉన్నంత వరకు రెండు రాష్ట్రాల్లో సంబంధిత వాహనా లు తిరగవచ్చన్నారు. జూన్ 1వ తేదికి ముందు జీవితకాలం పన్ను చెల్లించి న వాహనాలు తెలంగాణలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని, తెలంగాణ పరిధిలో చెల్లించిన వారు ఆంధ్రప్రదేశ్‌లో చెల్లించాల్సిన అవసరం లేద ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం దన్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధిం చి ఇప్పుడున్న పర్మిట్లు అలాగే కొనసాగించనున్నట్టు తెలిపారు. నూతన రాష్ట్రంలో జరిగే లావాదేవీలు ఆయా రాష్ట్రాలకు పరిమితం కానున్నాయని, మన రాష్ట్రంలో పర్మిట్ తీసుకున్న వాహనాలు అక్కడకు వెళితే అక్కడ తప్పనిసరిగా పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ప్రతి పనికిసెప ‘రేటు’
సాక్షి, సిటీబ్యూరో : అక్రమార్జనే లక్ష్యంగా మోటారు వాహన తనిఖీ అధికారులు, దళారులు కుమ్ముక్కై సాగిస్తున్న ఫిట్నెస్ పరీక్షల్లో నూటికీ 80 శాతం బోగస్ తనిఖీలతో రోడ్డెక్కుతున్నాయి. వాహనాల కండీషన్, నాణ్యతలపై ఎలాంటి శాస్త్రీయమైన పరీక్షలు నిర్వహించకుండా అధికారుల జేబులో డబ్బులు పడితే చాలు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోరిక్షాలు, క్యాబ్‌లు వంటి రవాణా వాహనాలన్నింటికి ఏడాదికోసారి ఆర్టీఏ తనిఖీలు తప్పనిసరి. ఆ వాహనాల పనితీరు సక్రమంగా ఉంటేనే రోడ్డుపై తిరిగేందుకు అనుమతించాలి. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా, నామమాత్రపు తనిఖీలు నిర్వహించి బ్రోకర్లు ఇచ్చే మామూళ్ల మాయలో పడి రోడ్డు భద్రతను విస్మరిస్తున్నారు. బస్సులోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరమే ఇవ్వాల్సిన ఫిట్నెస్ సర్టిఫికెట్లను రవాణా అధికారులు దళారుల చేతుల మీదుగా వాహనదారులకు విక్రయించేస్తున్నారు. ఇందుకోసం ఆటోరిక్షాలు, క్యాబ్‌లు వంటి వాహనాలను రూ.1000 నుంచి రూ.1500 చొప్పున, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులకు రూ.5000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఏ విధమైన తనిఖీలు లేకుండా, భద్రతా నిబంధనలు పాటించకుండా రహదారులపై తిరిగే వాహనాలు ప్రజల పాలిట మృత్యుశకటాలుగా మారుతున్నాయి. నిలువు దోపిడీ సాధారణంగా లర్నింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల చిరునామా బదిలీ, యాజమాన్య బదిలీ వంటి సేవల కోసం వాహన వినియోగదారులు రవాణా కార్యాలయాలను సంప్రదిస్తారు. రవాణా వాహనాలకు సంబంధించిన పన్నులు, పర్మిట్లు, జరిమానాలు వంటి కార్యక లాపాలు మినహాయించి రవాణాశాఖ నిర్దేశించిన అన్నిరకాల పౌరసేవలపైన ప్రభుత్వం విధించిన ఫీజు సాధారణంగా రూ.వంద నుంచి రూ. 600 వరకు ఉంటుంది. కానీ వాహనదారులు, అధికారులకు నడుమ మధ్యవర్తులుగా వ్యవహరించే దళారులు ఈ ఫీజులకు నాలుగు రెట్లు చొప్పున పెంచేసి వాహనదారులపై నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా వచ్చిన అక్రమార్జనలో సింహభాగం అధికారుల ఖాతాల్లో జమ అవుతుందనేది అక్షర సత్యం. మిగతా సొమ్ము దళారుల జేబుల్లోకి వెళుతుంది. కొరవడిన పర్యవేక్షణ రవాణా శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో జరిగే అక్రమ కార్యకలాపాలను నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా వాహనదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కింది నుంచి పై స్థాయి వరకు వసూల్ రాజాల స్వైరవిహారం, ఆర్టీఏ అధికారుల పనితీరు స్పష్టంగా తెలిసిన ప్పటికీ ఉన్నతాధికారులు దళారీ వ్యవస్థను నిరోధించకపోవడం గమనార్హం. జరుగుతున్నదిదీ.. వాహన వినియోగదారులు ప్రాథమికంగా తీసుకొనే లర్నింగ్ లెసైన్స్ కోసం చెల్లించవలసిన ఫీజు రూ.90. ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని, సమీప ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించి నేరుగా పరీక్షకు హాజరు కావొచ్చు. కానీ ఇలా వచ్చేవారిని సంబంధిత మోటారు వాహన తనిఖీ అధికారులు నిరుత్సాహపరుస్తారు. టెస్ట్‌లో ఫెయిల్ చేస్తారు. ఆ విషయం ముందే తెలుసు కాబట్టి వినియోగదారులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇలా వచ్చే వారి నుంచి లర్నింగ్ లెసైన్స్ కోసం రూ. 500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ కోసం ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజు రూ. 550 మాత్రమే. కానీ దళారుల ద్వారా ఆర్టీఏ వసూలు చేస్తున్న మొత్తం రూ.1500. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేందుకు ఇచ్చే తాత్కాలిక లర్నింగ్ లెసైన్స్, పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్ రెండింటి కోసం వచ్చే వారి నుంచి రూ. 3000 నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తారు. శాస్త్రీయమైన శిక్షణ లేకుండా డబ్బులు ఇచ్చి డ్రైవింగ్ లెసైన్స్ పొందే డ్రైవర్లు రవాణా వాహనాలను ఎలా నడుపుతారో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, తదితర కార్యకలాపాలపైనా ఇదే స్థాయిలో కాసుల పంట పండించుకుంటున్నారు.