![75 percent of school buses do not have fitness - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/10/11VJPAGESCHOOLBUSES.jpg.webp?itok=Sgbbt4CX)
సాక్షి, అమరావతి: స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) రెన్యువల్ చేయించుకునే విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాసక్తంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో 75 శాతం స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. కరోనా పరిస్థితులతో దాదాపు ఏడాదిన్నర తరువాత పాఠశాలలను ఇటీవల పునఃప్రారంభించారు. గత ఏడాది కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించడంతో స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకునే విషయంపై కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాగా, రెన్యువల్ గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుంది. కానీ ఇప్పటికీ చాలా యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల రెన్యువల్‌పై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కరోనా మూడో వేవ్ వస్తుందా, రాదా అనేదానిపై స్పష్టత వచ్చేవరకు ఈ విషయంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి.
6,444 బస్సులకు ఎఫ్‌సీలు
రాష్ట్రంలో మొత్తం 25,236 స్కూల్ బస్సులు ఉన్నాయి. కాగా వాటిలో సెప్టెంబర్ 30 నాటికి కేవలం 6,444 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించారు. 18,792 బస్సులకు ఇంతవరకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయలేదు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందిన స్కూల్ బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment