న్యూఢిల్లీ: వాహనాల నెలవారీ అమ్మకాల సమాచారాన్ని రిజిస్ట్రేషన్ల ఆధారంగా రూపొందించాలని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్)ను కోరింది. ఇందుకోసం హోల్‌సేల్స్‌ను కాకుండా, రహదారి మంత్రిత్వ శాఖకు వాహన్ ప్లాట్‌ఫాం సమాచారాన్ని వినియోగించుకోవాలని సియామ్‌కు లేఖరాసింది. ఈ విధానం ద్వారా మెరుగైన సమాచారం అందుతుందని ఎఫ్‌ఏడీఏ అధ్యక్షుడు ఆశిష్ హర్షరాజ్ కాలే అన్నారు. ఇక తాజాగా సియామ్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఆటో పరిశ్రమ అమ్మకాలు కనిష్ట స్థాయిలను నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు 31.57 శాతం క్షీణించాయని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment