బీఎస్‌–4 వాహనం పట్టుబడితే భారీ జరిమానా | Huge fine If a BS-4 vehicle is caught without registration | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ లేకపోతే వెహి‘కిల్‌’!

Published Sun, Mar 15 2020 4:46 AM | Last Updated on Sun, Mar 15 2020 4:46 AM

Huge fine If a BS-4 vehicle is caught without registration - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెలాఖరులోగా బీఎస్‌–4 వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేయించకపోతే యజమానులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ వాహనాలను స్క్రాప్‌గా పరిగణించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఏప్రిల్‌ నుంచి వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని ఆ శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాన్సీ నంబర్‌ కోసం ఎదురు చూస్తూ మార్చి 31లోగా రిజిస్ట్రేషన్‌ చేయించని బీఎస్‌–4 వాహనం పట్టుబడితే భారీగా జరిమానా విధించాలని, ఆ వాహనాన్ని స్క్రాప్‌గా పరిగణించాలన్నారు. 

- ఈ నెల 25లోగా బీఎస్‌–4 వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఇప్పటికే రవాణా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
- ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేస్తారు. 
- యజమానులు తమ పేరిట ఉన్న  రెండో వాహనానికి అదనపు ట్యాక్స్‌ కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రవాణా అధికారులు గుర్తించారు. 
- అలాంటి యజమానులకు వాహన డీలర్లు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 
- దీంతో వాహన డీలర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని కమిషనర్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. 
రెండో వాహనం ఉన్న యజమానులు ఈ నెల 25లోగా అదనపు ట్యాక్స్‌ చెల్లించాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement