BS-4 vehicles
-
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌కు బిగ్ షాక్..
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. బీఎస్-IV వాహనాల మనీలాండరింగ్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది.ఈడీ ఛార్జ్‌షీట్‌లో భాగంగా.. హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. బీఎస్-4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ. గోపాల్ రెడ్డితో పాటుగా పలువురు అశోక్ లేల్యాండ్ లిమిటెడ్ నుంచి బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేశారు.ఈ క్రమంలో జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సీ.గోపాల్ రెడ్డి అండ్ కో పేరుతో భారీ తగ్గింపుతో బీఎస్-3 వాహనాలను కొనుగోలు చేసి, మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ పత్రాల ఆధారంగా బీఎస్-4 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లలో ఎక్కువ కొనుగోళ్లు నాగాలాండ్‌లో జరుగగా.. కొన్ని కర్ణాటక, ఏపీలో కూడా జరిగాయని ఈడీ తెలిపింది.జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 50 వాహనాలు, సి.గోపాల్ రెడ్డి పేరిట 104 వాహనాలు రిజిస్టర్ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ వాహనాల్లో చాలా వరకు వాటిని బీఎస్-4 వాహనాలుగా ఉపయోగించడం ద్వారా వారి రవాణా వ్యాపారంలో వారు మరింత ఉపయోగించుకున్నారు. అలాంటి కొన్ని వాహనాలను బీఎస్-4 వాహనాలుగా చూపి విక్రయించారు. ఈ వాహనాలను సొంతం చేసుకోవడం, నడపడం, విక్రయించడం ద్వారా 38 కోట్ల రూపాయలు ఆర్జించినట్టు ఈడీ పేర్కొంది. అంతకుముందు, జేసీ ప్రభాకర్ రెడ్డి, సీ గోపాల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు చెందిన 68 కోట్ల చరాస్తులు.. 28.6 కోట్ల రూపాయల స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. -
ఆ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: సుప్రీం ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసుకున్న బీఎస్–4 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) జరిగిన వాటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని రవాణా అధికారులు సూచించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 30న పెండింగ్‌లో ఉన్న బీఎస్–4 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే వీటిలో కొన్ని వాహనాలకు వాహన యజమాని సెకండ్ వెహికల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. వీటి రిజిస్ట్రేషన్ కార్డు, ఈ వాహనాలపై ఇతర ట్రాన్సాక్షన్స్‌ను రవాణా అధికారులు నిలిపి ఉంచారు. మళ్లీ ఇప్పుడు టీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని శాశ్వత రిజిస్ట్రేషన్ లేని బీఎస్–4 వాహనాలకు ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. ► సెకండ్ వెహికల్ ట్యాక్స్‌ను ్చpట్ట్చఛిజ్టీజ్డీ్ఛn. ్ఛpట్చజ్చ్టజిజీ.ౌటజ ద్వారా చెల్లించాలి. ► ట్యాక్స్ చెల్లించిన వెంటనే ఈ వివరాలు రవాణా అధికారులకు తెలియజేస్తే ఆ వాహనంపై పెట్టిన లాక్ రిలీజ్ చేసి రవాణా అధికారులు ఆర్సీ పంపుతారు. ► రవాణా శాఖ అన్ని రకాల సేవల్ని గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. -
బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు సుప్రీం బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. లాక్డౌన్ సమయంలో మార్చిలో పెద్ద సంఖ్యలో ఈ వాహనాల అమ్మకంపై కూడా అత్యున్నత కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. అసాధారణ సంఖ్యలో బీఎస్-4 వాహనాలు అమ్ముడు కావడం పట్ల జస్టిస్ అరుణ్‌శర్మ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై ఆగస్టు 13న విచారణ చేపడతామని ప్రకటించింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత 10 రోజుల పాటు బీఎస్-4 వాహనాలను విక్రయించడానికి కార్ల డీలర్లకు కోర్టు అనుమతినిచ్చింది. జూన్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఆటో డీలర్లకు(ఫాడా) సడలింపునిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే బీఎస్-4 వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్టు తమ దృష్టికి వచ్చిందని కోర్టు తెలిపింది. మార్చి 27 తర్వాత 2.55 లక్షల బీఎస్-4 వాహనాలు అమ్ముడయ్యాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో 1.05 లక్షల బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రమే కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో లాక్డౌన్ ముగిసిన తరువాత 15 రోజుల పాటు బీఎస్-4 వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ గడువును పొడిగించాలని ఫాడా ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. బీఎస్-4 వాహన విక్రయాల వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు ధృవీకరణ కోసం సమర్పించాలని జూలై 8న కార్ల డీలర్ల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. 17,000 వాహనాల వివరాలను మాత్రమే వాహన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: జైడస్ వెల్నెస్- ఇప్కా ల్యాబ్స్ భలే జోరు -
హీరో మోటో బైక్స్‌పై భారీ డిస్కౌంట్
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. హీరో బీఎస్-4 ద్విచక్రవాహనాలపై 15 వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. పలు మోటారు సైకిళ్లపై రూ.10వేలు, స్కూటర్లపై రూ.15 వేల డిస్కౌంట్లను అందిస్తున్నట్లు హీరో మోటో కార్ప్ బుధవారం తెలిపింది. లాక్డౌన్ కారణంగా షోరూమ్‌లు మూసివేసిన కారణంగా స్టాక్‌ను క్లియర్ చేసుకునే క్రమంలో ఆన్లైన్ కొనుగోళ్లపై ఈ డిస్కౌంట్లను అందించనుంది. హీరో మోటోకార్ప్ సుమారు రూ. 600 కోట్ల విలువైన 1.5 లక్షల యూనిట్ల బీఎస్-4 వాహనాలను కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అంచనా ప్రకారం భారతదేశ మంతటా వివిధ డీలర్ల వద్ద కనీసం 7లక్షల అమ్ముడుపోని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల విలువ రూ .3,850 కోట్లు. 2020 ఏప్రిల్ 1 నుండి బీఎస్-4 వాహనాల విక్రయాలను, రిజిస్టేషన్లను సుప్రీంకోర్టు 2018లో నిషేధించింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమలవుతున్న 21 రోజుల లాక్ డౌన్ కారణంగా బీఎస్-4 వాహనాల విక్రయాలపై సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆంక్షలు ఎత్తివేసిన తరువాత మరో 10 రోజులు విక్రయించడానికి సుప్రీంకోర్టు మార్చి 27న అనుమతించిన సంగతి తెలిసిందే. -
బీఎస్–4 వాహనం పట్టుబడితే భారీ జరిమానా
సాక్షి, అమరావతి: ఈ నెలాఖరులోగా బీఎస్–4 వాహనాలు రిజిస్ట్రేషన్ చేయించకపోతే యజమానులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ వాహనాలను స్క్రాప్‌గా పరిగణించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి వాహన తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని ఆ శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాన్సీ నంబర్ కోసం ఎదురు చూస్తూ మార్చి 31లోగా రిజిస్ట్రేషన్ చేయించని బీఎస్–4 వాహనం పట్టుబడితే భారీగా జరిమానా విధించాలని, ఆ వాహనాన్ని స్క్రాప్‌గా పరిగణించాలన్నారు. - ఈ నెల 25లోగా బీఎస్–4 వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇప్పటికే రవాణా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. - ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేస్తారు. - యజమానులు తమ పేరిట ఉన్న రెండో వాహనానికి అదనపు ట్యాక్స్ కట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రవాణా అధికారులు గుర్తించారు. - అలాంటి యజమానులకు వాహన డీలర్లు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. - దీంతో వాహన డీలర్లతో కూడా సమావేశాలు నిర్వహించాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. - రెండో వాహనం ఉన్న యజమానులు ఈ నెల 25లోగా అదనపు ట్యాక్స్ చెల్లించాలన్నారు. -
బీఎస్–6 వాహనాలతో కాలుష్యానికి చెక్
పార్వతీపురం: భారతస్టాండర్ట్కు సంక్షిప్త రూపమే బీఎస్. వాహనం నుంచి వెలువడే వాయు ఉద్గారాలను అనుసరించి ఈ స్థాయిని నిర్ణయిస్తారు. 2010 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన బీఎస్–3 వాహనాలు 2017 మార్చి 31 వ తేదీ వరకు విస్తరించాయి. 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–4 వాహన శ్రేణి అందుబాటులోకి వచ్చింది. వాహన కాలుష్యాన్ని తగ్గించే దిశగా తాజాగా బీఎస్–6 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మేలుకుంటే మంచిది... ఆర్థిక మందగమనం ప్రమాద హెచ్చరికలు వినిపిస్తున్నా కొత్త వాహనాల క్రయ విక్రయాలు బాగానే సాగుతున్నాయి. జిల్లాలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల వినియోగం అధికంగానే ఉంది. ఈ వాహనాల నుంచి వెలువడే పొగ పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఫలితంగా ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే బీఎస్–4 (భారత్ స్టాండర్డ్) వాహనాల రిజిస్టేషన్ నిలిపివేసే చర్యలు చేపట్టింది. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే బీఎస్–4 వాహనాలను రిజిస్టేషన్ చేస్తారు. ఆ తర్వాత రిజి్రస్టేషన్ చేసే అవకాశాలు లేవని రవాణా శాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 ప్రమాణాలు కలిగిన వాహనాలను మాత్రమే రిజి్రస్టేషన్ చేయనున్నారు. బీఎస్–4 వాహనాల్లో వాయు కాలుష్య కారకాలు ఉన్నాయని భావిస్తూ వాటిని తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బీఎస్–6 వాహనాలకు అనుమతి ఇచ్చింది. మోటారు కంపెనీలు కూడా బీఎస్–6 వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు లేకుంటే సీజ్.... ఏప్రిల్ ఒకటి నుంచి బీఎస్–4 వాహనాల రిజిస్టేషన్ నిలిపివేస్తున్న నేపథ్యంలో కొనుగోలుదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వాహ నం కొనే సమయంలో అది ఏ ప్రమాణాలతో కూడిన వాహనమో పరిశీలించి తీసుకుంటే మేలు. ఇతర వ్యక్తు ల నుంచి వాహనాలు కొనే సమయంలో సంబంధిత పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలి. పొరపాటున మార్చి తర్వాత బీఎస్–4 వాహనాలు కొత్తవి తీసుకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్–4 వాహనాలను రిజిస్ట్రేషన్ లే కుండా రోడ్లప తిప్పితే రవాణా శాఖ అధికారులు సీజ్ చేస్తారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్నా అదే పరిస్థితి. ఆఫర్ల వల.... మార్చి 31లోగా వాహనాల డీ లర్లు బీఎస్–4 వాహనాలను తప్పనిసరిగా విక్రయించాలి. లేదంటే తమ బంధువులు, ఇ తరుల పేరుతో రిజిస్ట్రేషన్ చే సుకోవాలి. లేదంటే వాటిని విక్రయించే అవకాశం లేదు. దీంతో లాభాలు లేకున్నాసరే తమ వద్ద ఉన్న బీఎస్ –4 వాహనాలను వదిలించుకునేందుకు రూ.10 వేలు నుంచి రూ.15వేల వ రకు ఆఫర్లు ఇస్తూ కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నారు. శాశ్వత రిజిస్ట్రేషన్ తప్పనిసరి బీఎస్–4 వాహనాలు తప్పనిరిగా ఈ నెలాఖరులోగా శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే వాహనాలు సీజ్ చేస్తాం. గడువు దాటితే షోరూమ్‌లో ఉన్న వాహనాలు కూడా బయట తిరిగే అవకాశం ఉండదు. డీలర్లకు ఇప్పటికే సూచనలిచ్చాం. వాహనదారులు ఈ విషయమై అవగాహన పెంపొందించుకోవాలి. కాలుష్య కారకాలను తగ్గించేందుకే ప్రభుత్వం బీఎస్–6 వాహనాల అమ్మకానికి ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో బీఎస్–7, బీఎస్–8 వాహనాలుకూడా వచ్చే అవకాశం ఉంది. – ఎంవీఐ గంగాధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, పార్వతీపురం ఆఫర్లు వచ్చి అమ్ముతున్నాం... లాభాల లేక చాలా రోజులైంది. ప్రస్తుతం బీఎస్–4 వాహనాలను ప్రత్యేక ఆఫర్లతో అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. బీఎస్–4 వాహనాలు ఇప్పటికే సాంకేతికంగా ఆదరణ పొందాయి. మరింత కాలుష్య నివారణకు బీఎస్–6 వాహనాలను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వినియోగదారులపై వాహన రేట్లు కొంతమేర అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. కార్బరేటర్ లేకుండా కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే షోరూంలలో మాత్రమే బాగుచేసుకోవాల్సిన పరిస్థితి వినియోగదారులకు ఉంటుందే తప్ప ఇతరత్రా అవకాశం ఉండదు. ఏది ఏమైనా బీఎస్–6 వాహనాలతో కాలుష్య నివారణతో పాటు వాతావరణ సమతుల్యత కొంతమేర మెరుగుపడి భావితరాలకు ఉపయుక్తం కాగలదు. – శ్రీనివాసరావు, టీవీఎస్ షోరూం యజమాని, పార్వతీపురం -
2020 నాటికి బీఎస్–4 రిజిస్ట్రేషన్లు బంద్
న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య ఉద్గారాలను నియంత్రించడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ స్టేజ్ (బీఎస్)–4 ప్రమాణాలతో దేశంలో తయారయ్యే వాహనాల రిజిస్ట్రేషన్‌ను 2020, జూన్ 30 నాటికి నిలిపివేస్తామని కేంద్రం తెలిపింది. 2020, ఏప్రిల్ 1 వరకు తయారైన వాహనాలన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టంలో మార్పులు చేపట్టేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బీఎస్–4 ప్రమాణాల నుంచి 2020 నాటికి ఏకంగా బీఎస్–6 ప్రమాణాలను అందుకోవాలని కేంద్రం ఇంతకుముందు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన ముసాయిదాపై ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను డిసెంబర్ 20లోగా తెలియజేయాలని కేంద్రం సూచించింది. -
యమహా కొత్త బీఎస్–4 వాహనాలు
న్యూఢిల్లీ: టూవీలర్ కంపెనీ యమహా మోటార్ తాజాగా బీఎస్–4 నిబంధనలకు అనువుగా ఉండేటా తన బైక్స్, స్కూటర్ల పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో ఎఫ్‌జెడ్ 25, వైజెడ్ఎఫ్–ఆర్15, వైజెడ్ఎఫ్–ఆర్15ఎస్, ఎఫ్‌జెడ్–ఎస్ ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ, ఫజిర్ ఎఫ్ఐ, ఎస్జెడ్ ఆర్ఆర్ బైక్స్ ఉన్నాయి. ఇక ఇది ఇప్పటికే సెల్యుటో 125, సెల్యుటో ఆర్ఎక్స్ బైక్స్‌లో కొత్త వెర్షన్లను మార్కెట్లోకి తెచ్చింది. కంపెనీ అలాగే సైగ్నస్ రే జెడ్ఆర్, సైగ్నస్ రే జెడ్, సైగ్నస్ ఆల్ఫా, ఫాసినో వంటి స్కూటర్లను కూడా బీఎస్–4 నిబంధనలకు అనువుగా అప్‌గ్రేడ్ చేసింది. అన్ని కొత్త వేరియంట్లలో ఆటో హెడ్‌ల్యాంప్–ఆన్ (ఏహెచ్ఓ) ఫీచర్‌ను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది.