న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య ఉద్గారాలను నియంత్రించడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ స్టేజ్ (బీఎస్)–4 ప్రమాణాలతో దేశంలో తయారయ్యే వాహనాల రిజిస్ట్రేషన్‌ను 2020, జూన్ 30 నాటికి నిలిపివేస్తామని కేంద్రం తెలిపింది. 2020, ఏప్రిల్ 1 వరకు తయారైన వాహనాలన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు మోటార్ వాహనాల చట్టంలో మార్పులు చేపట్టేందుకు ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం బీఎస్–4 ప్రమాణాల నుంచి 2020 నాటికి ఏకంగా బీఎస్–6 ప్రమాణాలను అందుకోవాలని కేంద్రం ఇంతకుముందు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన ముసాయిదాపై ప్రజలు, సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను డిసెంబర్ 20లోగా తెలియజేయాలని కేంద్రం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment