సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభం నుంచి పాజిటివ్‌గా ఉన్న సూచీలు చివరివరకూ అదే జోరును కంటిన్యూ చేశాయి. ఆఖరి గంటలో పుంజుకున్న కొనుగోళ్లతో జనవరి డెరివేటివ్ సీరిస్ తొలిరోజును ఉత్సాహవంతంగా ముగించాయి. సెన్సెక్స్ 411 పాయింట్లు జంప్ చేసి 41575 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 12245 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్ రంగ లాభాలో బ్యాంకు నిఫ్టీ కూడా 424 పాయింట్లు లాభపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలో ముగిసాయి. కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, బీపీసీఎల్, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. యస్ బ్యాంకు, విప్రో, బ్రిటానియీ, కోటక్ కమహీంద్ర, టీసీఎస్ తదితర షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment