
కియాను రీవ్స్
హాలీవుడ్ యాక్షన్ క్యారెక్టర్స్‌లో జాన్ విక్‌ని ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. నటుడు కియాను రీవ్స్ టైటిల్ రోల్‌లో అలరించిన సూపర్ హిట్ యాక్షన్ చిత్రాల ఫ్రాంచైజీ ‘జాన్ విక్’. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా 4వ భాగం తెరకెక్కుతోంది. ఇందులోనూ కియాను రీవ్సే హీరో. ముందుగా ఈ సినిమాను 21 మే 2021లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ మొత్తం తారుమారైంది. దాంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాను 27 మే 2022లో విడుదల చేస్తున్నట్లు చిత్రబందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment