Keanu Reeves
-
స్టైలిష్ లుక్‌లో మహేశ్.. సీతక్కకు ఫ్యాన్ అంటున్న నమ్రత (ఫోటోలు)
-
ఎప్పుడూ చావు గురించే ఆలోచిస్తున్నా..
చావు గురించి ఆలోచించడం మంచిదే అంటున్నాడు హాలీవుడ్ యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కెను రీవ్స్. అవును, తను చెప్తోంది నిజమేనని, మరణం గురించి ఆలోచించడం ఒకరకంగా మంచి విషయమేనంటోంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. 21వ శతాబ్దంలో నాలుగో గ్రేటెస్ట్ యాక్టర్‌గా కీర్తి గడించిన కెను రీవ్స్.. ద బుక్ ఆఫ్ ఎల్స్వేర్ అనే నవల రాశాడు. దీన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాడు. మరణం గురించే ఆలోచనఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మరణంపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. నేను చావు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాను. దానివల్ల మనం ఊపిరి తీసుకున్నంతకాలం బంధాలకు విలువనివ్వాలని, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పాజిటివ్ ఆలోచనలు వస్తాయి అని పేర్కొన్నాడు. అంటే మరణాన్ని తలుచుకుంటే బతికి ఉన్నంత కాలం ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని నటుడు చెప్తున్నాడు.సినిమాలు..ఇది కరెక్టే అనిపించడంతో సోనమ్ కపూర్ ఈ క్లిప్పింగ్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కాగా సోనమ్.. సావరియా సినిమాతో హీరోయిన్గా మారింది. ఢిల్లీ 6, ఐ హేట్ లవ్ స్టోరీస్, ఐషా, థాంక్యూ, బేవకూఫియాన్, భాగ్ మిల్కా భాగ్, ఖుబ్సూరత్, నీర్జ, ప్యాడ్ మ్యాన్, వీరు ది వెడ్డింగ్, సంజు, ద జోయా అక్తర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. గతేడాది వచ్చిన బ్లైండ్ సినిమాలో చివరగా కనిపించింది.చదవండి: మళ్లీ తల్లి కాబోతున్నాను -
స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్ ఠాకూర్!
సీతారామం చిత్రంతో తెలుగు తెరకు పరిచమైంది మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే యువ హృదయాలను కొల్లగొట్టడంతో పాటు ఓవర్‌నైట్ స్టార్డమ్ పొందింది. యూత్ అంత సీత పేరును కలవరించడం మొదలు పెట్టారు. అంతలా తన అందచందాలతో మెప్పించింది ఈ బాలీవుడ్ భామ. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. తెలుగులో నానితో నటించిన హాయ్ నాన్న త్వరలోనే విడుదల కాబోతుంది. ఆ తర్వాత సంక్రాంతికి విజయ్ దేవరకొండతో కలిసి నటించిన సినిమా రిలీజ్ కాబోతుంది. చిరంజీవి సినిమాలో కూడా చాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సంగతి ఇలా ఉంటే.. తాజాగా తన రిలేషన్ స్టేటస్ గురించి బయట పెట్టింది మృణాల్. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చింది. పెళ్లి విషయంలో ఫ్యామిలీ నుంచి ఒత్తిడి ఉందని, తను మాత్రం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టాటని చెప్పుకొచ్చింది. ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా అని మీడియా అడితే.. ‘హాలీవుడ్ హీరో కీను రీవ్స్ అంటే తనకు చాలా ఇష్టమని, చిన్నప్పుడే అతన్ని చూసి ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది. తనది వన్‌సైడ్ లవ్ మాత్రమేనని మృణాల్ పేర్కొంది. కీను రీవ్స్ లాంటి వ్యక్తి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. మృణాల్ వన్‌సైడ్ లవ్ స్టోరీ గురించి తెలిసి ఆమె అభిమానులు రిలాక్స్ అయిపోయారు. Follow the Sakshi TV channel on WhatsApp -
ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
Keanu Reeves The Matrix Resurrections OTT Release Date Is Here: హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ చిత్రం 'ది మ్యాట్రిక్స్'. స్కై-ఫై, యాక్షన్ తరహాలో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. 1999లో వచ్చిన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత వచ్చిన చిత్రాలు కూడా అంతే ఆదరణ పొందాయి. ఈ మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. ఇందులో కీను రీవ్స్, క్యారీ-అన్నే మోస్తోపాటు గ్లోబల్ స్టార్ ప్రియాకం చోప్రా ప్రధాన పాత్రల్లో అలరించారు. ఈ సినిమా డిసెంబర్ 22, 2021న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6 నుంచి భారతదేశంలో ప్రసారం కానుంది. లానా వాచోస్కీ దర్శకత్వ వహించిన ఈ మూవీ మే 6 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది. లానా వాచోస్కీ తన సోదరి లిల్లీ వాచోవస్కీతో కలిసి ఈ ఫ్రాంచైజీలో ఇంతకుముందు వచ్చిన 'ది మ్యాట్రిక్స్' (1999), 'ది మ్యాట్రిక్స్: రీలోడెడ్' (2003), 'ది మ్యాట్రిక్స్: రివల్యూషన్స్' (2003) సినిమాలను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: మళ్లీ థియేటర్లలోకి హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ 'ది మ్యాట్రిక్స్'.. కారణం ? choose your pill 💊#TheMatrixResurrectionOnPrime, May 12 in English, Hindi, Tamil, Telugu, Malayalam and Kannada pic.twitter.com/PGQTNRdKVs — amazon prime video IN (@PrimeVideoIN) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మళ్లీ థియేటర్లలోకి హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ 'ది మ్యాట్రిక్స్'.. కారణం ?
Hollywood Film The Matrix Re Releasing On December 3: హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ చిత్రం 'ది మ్యాట్రిక్స్'. స్కై-ఫై, యాక్షన్ తరహాలో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. 1999లో వచ్చిన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందులోని నియో (కీను రీవ్స్), ట్రినిటీ (క్యారీ-అన్నె మోస్), మార్ఫస్ (లారెన్స్ ఫిష్‌బర్న్) పాత్రలు ఇప్పటికీ గుర్తిండిపోతాయి. అంతలా ఆకట్టుకుంటాయి ఆ పాత్రలు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించింది వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్. ఈ చిత్రాన్ని మళ్లీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది నిర్మాణ సంస్థ. అయితే మ్యాట్రిక్స్ సిరీస్‌లోని నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ సిరీస్‌లో కథానాయకుడి గతానికి సంబంధించిన కథతో వస్తోంది 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'. మొదటి చిత్రం విడుదలకు నాలుగో సినిమా విడుదలకు మధ్య 12 ఏళ్లు గ్యాప్ ఉంది. అయితే నాలుగో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికే ఈ ఫ్రాంచైజీలోని మొదటి చిత్రమైన 'ది మ్యాట్రిక్స్' రిలీజ్ చేయనున్నారో తెలియాల్సి ఉంది. మ్యాట్రిక్స్ చిత్రానికి లానా వాచోస్కీ, లిల్లీ వాచోస్కీ దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ నాలుగో చిత్రానికి మాత్రం లానా వాచోస్కీ ఒక్కరే రచన, దర్శకత్వం వహించారు. 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' చిత్రంలో గ్లొబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్ -
నో బ్రేక్
లాక్డౌన్ సమయాన్ని భర్త నిక్ జోనస్‌తో కాలిఫోర్నియాలోనే గడిపారు ప్రియాంకా చోప్రా. ఈ మూడు నెలల బ్రేక్ తర్వాత మళ్లీ షూటింగ్‌కి సిద్ధమయ్యారామె. ‘మ్యాట్రిక్స్ 4’ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇందులో ప్రియాంక కీలక పాత్ర చేస్తున్నారు. కీయాను రీవెస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ‘మ్యాట్రిక్స్’ ఫ్రాంచైజీలో నాలుగో భాగం. ఆల్రెడీ లాక్డౌన్ ముందు నటీనటులందరూ యాక్షన్ సన్నివేశాల వర్క్‌షాప్‌లో పాల్గొని శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుత షెడ్యూల్ జర్మనీలో జరగనుందని సమాచారం. చిత్రబృందమంతా జర్మనీ చేరుకున్నట్టు తెలిసింది. -
జాన్ పోస్ట్‌పోన్
హాలీవుడ్ యాక్షన్ క్యారెక్టర్స్‌లో జాన్ విక్‌ని ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. నటుడు కియాను రీవ్స్ టైటిల్ రోల్లో అలరించిన సూపర్ హిట్ యాక్షన్ చిత్రాల ఫ్రాంచైజీ ‘జాన్ విక్’. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా 4వ భాగం తెరకెక్కుతోంది. ఇందులోనూ కియాను రీవ్సే హీరో. ముందుగా ఈ సినిమాను 21 మే 2021లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ మొత్తం తారుమారైంది. దాంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాను 27 మే 2022లో విడుదల చేస్తున్నట్లు చిత్రబందం పేర్కొంది. -
న్యూ బిగినింగ్..!
మనసు పారేసుకోవడానికి వయసుతో పనిలేదని చెప్పకనే చెప్పాడు హాలీవుడ్ స్టార్ కీను రీవ్స్. యాభై ఏళ్ల ఈ హీరో బ్రిటిష్ మోడల్ బ్రూక్‌తో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఇటీవల కాలిఫోర్నియాలోని ఓ జిమ్‌లో తారసపడ్డ వీరిద్దరూ కళ్లూ.. కళ్లూ కలిపి.. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని.. డేటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసుకున్నారట. ఇక అక్కడి నుంచి ‘సందడే సందడి’ అని ఓ ఆంగ్ల పత్రిక కథనం. రీసెంట్గా బాయ్‌ఫ్రెండ్ డేవిడ్ మాకింతోష్కు గుడ్‌బై చెప్పి మెంటల్‌గా కాస్త అప్సెట్ అయిన బ్రూక్‌కు రీవ్స్‌తో రొమాన్స్ ఎంతో రిలీఫ్నిస్తుందట!