
సీతారామం చిత్రంతో తెలుగు తెరకు పరిచమైంది మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే యువ హృదయాలను కొల్లగొట్టడంతో పాటు ఓవర్‌నైట్ స్టార్‌డమ్ పొందింది. యూత్ అంత సీత పేరును కలవరించడం మొదలు పెట్టారు. అంతలా తన అందచందాలతో మెప్పించింది ఈ బాలీవుడ్ భామ. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులు చేస్తోంది. తెలుగులో నానితో నటించిన హాయ్ నాన్న త్వరలోనే విడుదల కాబోతుంది. ఆ తర్వాత సంక్రాంతికి విజయ్ దేవరకొండతో కలిసి నటించిన సినిమా రిలీజ్ కాబోతుంది. చిరంజీవి సినిమాలో కూడా చాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది.
ఈ సంగతి ఇలా ఉంటే.. తాజాగా తన రిలేషన్ స్టేటస్ గురించి బయట పెట్టింది మృణాల్. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని చెప్పుకొచ్చింది. పెళ్లి విషయంలో ఫ్యామిలీ నుంచి ఒత్తిడి ఉందని, తను మాత్రం కెరీర్‌పైనే ఫోకస్ పెట్టాటని చెప్పుకొచ్చింది.
ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా అని మీడియా అడితే.. ‘హాలీవుడ్ హీరో కీను రీవ్స్ అంటే తనకు చాలా ఇష్టమని, చిన్నప్పుడే అతన్ని చూసి ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది. తనది వన్‌సైడ్ లవ్ మాత్రమేనని మృణాల్ పేర్కొంది. కీను రీవ్స్ లాంటి వ్యక్తి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నానని చెప్పింది. మృణాల్ వన్‌సైడ్ లవ్ స్టోరీ గురించి తెలిసి ఆమె అభిమానులు రిలాక్స్ అయిపోయారు.
Follow the Sakshi TV channel on WhatsApp
Comments
Please login to add a commentAdd a comment