The Matrix Resurrections OTT Release Date And Platform Details In Telugu - Sakshi
Sakshi News home page

The Matrix Resurrections OTT Release Date: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?

Published Tue, Apr 26 2022 9:29 AM | Last Updated on Tue, Apr 26 2022 10:48 AM

Keanu Reeves The Matrix Resurrections OTT Release Date Is Here - Sakshi

Keanu Reeves The Matrix Resurrections OTT Release Date Is Here: హాలీవుడ్‌ బ్లాక్‌ బ్లస్టర్‌ చిత్రం 'ది మ్యాట్రిక్స్‌'. స్కై-ఫై, యాక్షన్‌ తరహాలో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలో మంచి ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. 1999లో వచ్చిన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీని తర్వాత వచ్చిన చిత్రాలు కూడా అంతే ఆదరణ పొందాయి. ఈ మ్యాట్రిక్స్‌ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగో చిత్రం 'ది మ్యాట్రిక్స్‌: రిసరెక్షన్స్‌'. ఇందులో కీను రీవ్స్‌, క్యారీ-అన్నే మోస్‌తోపాటు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాకం చోప్రా ప్రధాన పాత్రల్లో అలరించారు. ఈ సినిమా డిసెంబర్‌ 22, 2021న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 

తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మే 6 నుంచి భారతదేశంలో ప్రసారం కానుంది. లానా వాచోస్కీ దర్శకత్వ వహించిన ఈ మూవీ మే 6 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. లానా వాచోస్కీ తన సోదరి లిల్లీ వాచోవస్కీతో కలిసి ఈ ఫ్రాంచైజీలో ఇంతకుముందు వచ్చిన 'ది మ్యాట్రిక్స్‌' (1999), 'ది మ్యాట్రిక్స్‌: రీలోడెడ్‌' (2003), 'ది మ్యాట్రిక్స్‌: రివల్యూషన్స్‌' (2003) సినిమాలను డైరెక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: మళ్లీ థియేటర్లలోకి హాలీవుడ్ బ్లాక్‌ బ్లస్టర్‌ 'ది మ్యాట్రిక్స్‌'.. కారణం ?


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement