చావు గురించి ఆలోచించడం మంచిదే అంటున్నాడు హాలీవుడ్ యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కెను రీవ్స్. అవును, తను చెప్తోంది నిజమేనని, మరణం గురించి ఆలోచించడం ఒకరకంగా మంచి విషయమేనంటోంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. 21వ శతాబ్దంలో నాలుగో గ్రేటెస్ట్ యాక్టర్‌గా కీర్తి గడించిన కెను రీవ్స్.. ద బుక్ ఆఫ్ ఎల్స్‌వేర్ అనే నవల రాశాడు. దీన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాడు.
మరణం గురించే ఆలోచన
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మరణంపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. నేను చావు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటాను. దానివల్ల మనం ఊపిరి తీసుకున్నంతకాలం బంధాలకు విలువనివ్వాలని, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పాజిటివ్ ఆలోచనలు వస్తాయి అని పేర్కొన్నాడు. అంటే మరణాన్ని తలుచుకుంటే బతికి ఉన్నంత కాలం ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని నటుడు చెప్తున్నాడు.
సినిమాలు..
ఇది కరెక్టే అనిపించడంతో సోనమ్ కపూర్ ఈ క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కాగా సోనమ్.. సావరియా సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఢిల్లీ 6, ఐ హేట్ లవ్ స్టోరీస్, ఐషా, థాంక్యూ, బేవకూఫియాన్, భాగ్ మిల్కా భాగ్, ఖుబ్సూరత్, నీర్జ, ప్యాడ్ మ్యాన్, వీరు ది వెడ్డింగ్, సంజు, ద జోయా అక్తర్ వంటి పలు చిత్రాల్లో నటించింది. గతేడాది వచ్చిన బ్లైండ్ సినిమాలో చివరగా కనిపించింది.
చదవండి: మళ్లీ తల్లి కాబోతున్నాను
Comments
Please login to add a commentAdd a comment