మళ్లీ తల్లి కాబోతున్నాను | Actress Pranitha is expecting a second child | Sakshi
Sakshi News home page

మళ్లీ తల్లి కాబోతున్నాను

Jul 26 2024 6:23 AM | Updated on Jul 26 2024 6:23 AM

Actress Pranitha is expecting a second child

‘ఏం పిల్లో ఏం పిల్లడో’, ‘బావ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం’ వంటి సినిమాల్లో నటించిన ప్రణీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే... 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజుతో ప్రణీత వివాహం జరిగింది. 2022 జూన్‌లో  ప్రణీత ఓ పాపకు జన్మనిచ్చారు.

కొన్ని నెలలు సినిమాలకు విరామం తీసుకున్నాక ఆమె కన్నడలో చేసిన ఒక సినిమా, మలయాళంలో చేసిన ఒక సినిమా ఈ ఏడాది విడుదలయ్యాయి. కాగా తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు పేర్కొన్నారు. ‘రౌండ్‌ 2.. ఇప్పటి వరకూ నేను వాడిన పాంట్స్‌ ఇక నాకు ఫిట్‌ కావు’’ అంటూ బేబీ బంప్‌ ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ప్రణీత.

Advertisement
 
Advertisement
Advertisement