ఈ వారం గేమింగ్ ప్రియులను ఆకట్టుకునే వీడియో గేమ్స్‌లో ‘గాడ్ ఆఫ్ వార్ అండ్ మాన్‌స్టర్ హంటర్స్ రైజ్’ ఒకటి. ‘గాడ్ ఆఫ్ వార్’ సిరీస్ ఎంత పాపులరో మనకు తెలిసిందే. ఈ పరంపర లో వచ్చిన తాజాగేమ్ ఇది. దీనిలో విజువల్స్ ఇంప్రూవ్ చేశారు. 4కె రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. యుద్ధానికి సంబంధించిన నక్కజిత్తులు, సాంకేతికజ్ఞానానికి ఆలవాలమైన కముర గ్రామంలో జరిగే ఈ గేమ్ మొదటిసారి పీసీకి వస్తుంది.
‘కొత్త రకం రాక్షసులు, కొత్తరకం యుద్ధవిద్యలు, న్యూ బ్రాండ్ స్టోరీతో వస్తుంది’ అనే వూరింపులు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఈ గేమ్‌కు సంబంధించి ‘హౌ టూ చేంజ్ వెపన్స్’ ‘హౌ టు షార్పెన్ వెపన్’ ‘హౌ టు గెట్ టు వెపన్ ట్రైనింగ్ ఏరియా’....మొదలైన దారి సూచికలు కూడా నెట్‌లో కనిపిస్తున్నాయి. నిన్‌టెండో స్విచ్ ప్లేస్టేషన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇది అలరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment