
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి భారత మార్కెట్లో తన దూకుడును మరింత పెంచేంది. తాజాగా వై1 సిరీస్‌లో సరికొత్త బిగ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఇ-తరాన్ని లక్ష్యంగా చేసుకుని, బ్రాండ్ కొత్త సిరీస్‌ను ప్రత్యేకంగా భారత మార్కెట్లో ఆవిష్కరించింది వై 1 సిరీస్‌లో మూడు వైవిధ్యమైన డివైస్‌లను ఆకర్షణీయమైన ఫీచర్లు, ఆకట్టుకునే ధరలో, వినూత్న రంగుల్లో విడుదల చేసింది. అలాగే నవంబర్ మధ్యనాటికి ఎంఐయుఐ అప్‌గ్రేడ్ కూడా లభించనుందని ప్రకటించింది. అంతేకాదు వీటికి బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. కత్రీనా సైన్ చేసిన రెడ్ మి వై1 మొబైల్స్‌ను ప్రత్యేకంగా అందించనుంది.
రెడ్ మి వై 1, 3జీబీ/ 32 జీబీ వేరియంట్ రూ .8,999, 4జీబీ /64జీబీ వేరియంట్ కోసం రూ. 10,999లుగా నిర్ణయించింది. అలాగే రెడ్‌మి వై 1 లైట్ పేరుతో బడ్జెట్‌ధరలో రూ .6,999 కే అందిస్తోంది.
నవంబరు 8 మధ్నాహ్నం 12గంటలనుంచి ఎంఐ, అమెజాన్‌లలో విక్రయానికి లభిస్తుందని తెలిపింది. ఈ డివైస్‌తో ఇన్‌ఫ్రారెడ్ రిమోట్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది.
రెడ్ మి వై 1 ఫీచర్స్
5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్లాష్ సెల్ఫీ కెమెరా
3080ఎంఏహెచ్ బ్యాటరీ
రెడ్ మి వై1 లైట్ ఫీచర్స్
5.5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్,
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్
2జీబీ ర్యామ్
16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
3080 ఎంఏహెచ్ బ్యాటరీ
Presenting Katrina Kaif as the face of our brand new series – Redmi Y1. RT to win a personally signed #Redmi Y1 by Katrina Kaif. pic.twitter.com/L05X0bcnhc
— Redmi India (@RedmiIndia) November 2, 2017