సాక్షి, న్యూఢిల్లీ: ఆపిల్ కంపెనీకి 2020సంవత్సరం మంచి సంవత్సరం అని చెప్పవచ్చు. ఐఫోన్ ఎస్ఈ2ని అందుబాటులో తీసుకొచ్చి విజయం సాధించింది. దీంతో త్వరలోనే తీసుకురానున్న ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 5జీ టెక్నాలజీతో పాటు, ఇంట్రస్టింగ్ డిజైన్ తో ఐఫోన్12, ఐఫోన్12 ప్రో, ఐఫోన్ 12 మాక్స్, ఐఫోన్ 12 ప్రో మాక్స్ ను తీసుకురానుంది.
తాజా నివేదికల ప్రకారం ఐపాడ్ 2020 మోడల్స్ లోని కెమెరాను తన రాబోయే హైఎండ్ ఐఫోన్లలో జోడించనుందని తెలుస్తోంది. ఎప్పటినుంచో ప్రయతిస్తున్న సోనీ లిడార్ డెప్త్ కెమెరాను ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎట్టకేలకు ఆపిల్ పొందుపరుస్తోంది. అక్టోబర్‌లో జరగనున్న ఐఫోన్ 12 మోడళ్ల విడుదలకు ముందే దీనికి సంబంధించిన అనేక లీక్‌లు, పుకార్లు ఐఫోన్ ప్రియులను ఊరిస్తున్నాయి. ఆపిల్ అక్టోబర్‌లో ఐఫోన్ 12 సిరీస్‌ను ఆవిష్కరిస్తుందని, ఇందులో నాలుగు మోడళ్లు ఉంటాయని అంచనా. ప్రముఖ లీకర్ జోన్ ప్రాసెసర్ ప్రకారం, ఐఫోన్ 12 ఇటీవలి సంవత్సరాలలో ఇతర బేస్ మోడళ్ల మాదిరిగానే ఆకర్షణీయమైన ధరలనే నిర్ణయించనుంది. 5జీతో పాటు, తక్కువ బ్యాటరీ టెక్నాలజీతో ద్వారా పెరిగిన ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తోంది.
I’ll just leave this here in case... https://t.co/9umqJqSzwq
— Jon Prosser (@jon_prosser) September 1, 2020
Comments
Please login to add a commentAdd a comment