New 150cc Classic Yamaha GT150 Fazer Bike Launched, Check Price And Features - Sakshi
Sakshi News home page

Yamaha GT150: క్లాసీ, స్టయిలిష్‌ లుక్‌లో ‘జీటీ150 ఫేజర్‌ బైక్‌’: వివరాలు ఇలా..

Published Mon, Jan 23 2023 4:28 PM | Last Updated on Mon, Jan 23 2023 5:42 PM

New150cc classic Yamaha GT150 Fazer bike launched  - Sakshi

సాక్షి,ముంబై:  జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీదారు బ్రాండ్ యమహా  కొత్త బైక్‌ను విడుదల చేసింది. యమహా ఆర్ ఎక్స్ 149 మోడల్ కు లేటెస్ట్ వెర్షన్‌గా ‘జీటీ 150 ఫేజర్’ పేరుతో  చైనా మార్కెట్లోకి విడుదల చేసింది.  క్లాసిక్‌ లుక్‌లో   స్టయిలిష్‌గా  యూత్‌ను ఆకట్టుకునేలా లాంచ్‌ చేసింది.  చైనాలో ఈ బైక్ ప్రారంభ ధరను 13,390 యువాన్‌లు అంటే  ఇది భారతీయ రూపాయలలో దాదాపు రూ. 1.60 లక్షలు. త్వరలోనే ఇండియా మార్కెట్లోకి  లాంచ్‌ చేయనున్నట్టు సమాచారం. 

యమహా జీటి 150 ఫేజర్ ఇంజీన్‌ 
ఇందులోని 150సీసీ ఇంజన్ 7,500 ఆర్ పీఎం వద్ద 12.3 హార్స్ పవర్, 12.4 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వైట్, గ్రే, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో  లభిస్తుంది . ఇక ఫీచర్ల విషయానికి వస్తే అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్ ఇంజన్, సిగ్నేచర్ రెట్రో బిట్స్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, ఫోర్క్ గైటర్‌లు, ఫెండర్‌లతో కూడిన ఫ్రంట్, రియర్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో  బజాజ్ పల్సర్ పి150కి  గట్టి  పోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement