Yamaha Motor
-
క్లాసీ, స్టయిలిష్ లుక్‌లో ‘జీటీ150 ఫేజర్ బైక్’: వివరాలు ఇలా..
సాక్షి,ముంబై: జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీదారు బ్రాండ్ యమహా కొత్త బైక్‌ను విడుదల చేసింది. యమహా ఆర్ ఎక్స్ 149 మోడల్ కు లేటెస్ట్ వెర్షన్‌గా ‘జీటీ 150 ఫేజర్’ పేరుతో చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. క్లాసిక్ లుక్‌లో స్టయిలిష్‌గా యూత్‌ను ఆకట్టుకునేలా లాంచ్ చేసింది. చైనాలో ఈ బైక్ ప్రారంభ ధరను 13,390 యువాన్లు అంటే ఇది భారతీయ రూపాయలలో దాదాపు రూ. 1.60 లక్షలు. త్వరలోనే ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేయనున్నట్టు సమాచారం. యమహా జీటి 150 ఫేజర్ ఇంజీన్ ఇందులోని 150సీసీ ఇంజన్ 7,500 ఆర్ పీఎం వద్ద 12.3 హార్స్ పవర్, 12.4 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వైట్, గ్రే, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది . ఇక ఫీచర్ల విషయానికి వస్తే అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్ ఇంజన్, సిగ్నేచర్ రెట్రో బిట్స్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, ఫోర్క్ గైటర్లు, ఫెండర్లతో కూడిన ఫ్రంట్, రియర్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ పి150కి గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఎన్ని ఉన్నా ఈ బైక్ క్రేజ్ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్ మళ్లీ వస్తోంది!
యూత్‌లో బైక్‌లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో బోలెడన్ని బైకులు దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్ని ఉన్నా మార్కెట్లో యమహా ఆర్ఎక్స్ 100కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 దశకంలో యువతని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఈ బైక్‌లను నిలిపేసి 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అవి రోడ్లపై దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మోడల్ బైక్ కోసం కలలు కనే వారి కోసం తాజాగా యమహా కంపెనీ ఓ శుభవార్త తీసుకువచ్చింది. ఆర్ఎక్స్ 100 బైక్‌ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యువత కలల బైక్ రానుంది యమహా ఇండియా చైర్మన్ ఐషిన్ చిహానా మాట్లాడుతూ.. కొత్తగా రాబోతున్న యమహా RX100 ఆధునిక డిజైన్ , స్టైలిష్ లుక్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ బైక్ పాత మోడల్‌కి మార్కెట్లో ఇప్పటికీ డిమాండ్ ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకుని బైక్ లవర్స్‌ని ఆకట్టుకునేలా డిజైన్, తయారీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2026 తర్వాత మార్కెట్లోకి కొత్త వెర్షన్ ఆర్ఎక్స్100 బైక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే వచ్చే మూడేళ్లలో యమహా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోందని చిహానా పేర్కొన్నారు. ప్రస్తుతానికి, రాబోయే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం యమహాకు భారత్‌లో గ్రేటర్ నోయిడా, చెన్నైలో ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే వాటితో 30 దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. కాగా యమహా కంపెనీ 1985 నుంచి ఉత్పత్తి ప్రారంభించి ఆర్ఎక్స్100బైక్‌ను 1996 వరకు కొనసాగించారు. చదవండి: 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
వాహనాల ‘రెంటల్’ బిజినెస్‌లోకి యమహా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న యమహా మోటార్ కో ఆటోమొబైల్ అసెట్ మేనేజ్మెంట్, సర్వీసెస్‌లోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో ఉన్న కంపెనీలకు వాహనాలను సరఫరా చేస్తుంది. ఇందుకోసం కొత్త, పాత వాహనాలను కొనుగోలు చేయనుంది. సర్వీస్, విడిభాగాల కేంద్రాలు సైతం ఏర్పాటవుతాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఆసరాగా డెలివరీ సేవలు అందిస్తున్న కంపెనీలతో ప్రధానంగా చేతులు కలుపనున్నట్టు యమహా ప్రకటించింది. షేర్డ్, రెంటల్ మొబిలిటీ విభాగంలో వాడకం పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యమని వివరించింది. -
అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎంతో తెలుసా?
ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలలో ఒకటి అయిన యమహా తన ప్రత్యర్థులతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఆలస్యంగా అడుగుపెట్టింది. కంపెనీ కొంతకాలం క్రితం తీసుకొచ్చిన ఈ-వినో ఎలక్ట్రిక్ స్కూటర్ అంత పాపులర్ కాలేదు. అందుకు ముఖ్య కారణ ఆ స్కూటర్ ఛార్జ్, దీనిని ఒకసారి చార్జ్ చేస్తే కేవలం 29 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ అందిస్తుంది. ఆ తర్వాత గోగోరో భాగస్వామ్యం కింద తీసుకొచ్చిన ఈసీ-05 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం తైవాన్ లో అమ్మకానికి ఉంది. అయితే, ఈ జపనీస్ టూ వీలర్ బ్రాండ్ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తోంది. ఈ స్కూటర్ని ఈ01 అనే పేరుతో మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తోంది. ఈ01ని మొదటిసారి 2019 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది. ఈ స్కూటర్ని త్వరలో మార్కెట్లోకి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యమహా ఈ01 ప్రోటోటైప్ 2019లో వెల్లడించిన కాన్సెప్ట్ మోడల్ డిజైన్ కు దగ్గరగా ఉంది. కాబట్టి, ఈ01లో మాక్సీ-స్కూటర్ స్టైలింగ్, విండ్ స్క్రీన్ ఫ్రంట్ ఏప్రాన్, ఫ్లోటింగ్ రియర్ సెక్షన్, వైడ్ హ్యాండిల్ బార్లు ఉంటాయి. అయితే, ప్రొడక్షన్ రెడీ మోడల్ లో రీడిజైన్ చేయబడ్డ స్టెప్ అప్ సీటు ఉంది. జపనీస్ బ్రాండ్ ఈ01కి చెందిన పూర్తి స్పెసిఫికేషన్ లను వెల్లడించలేదు. అయితే దీనిని సింగిల్ ఛార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్ల రేంజ్ అందించే 4 కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ 125సీసీ స్కూటర్ కి సమానంగా దూసుకెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ గల ఎల్సిడి డిస్ప్లే కలిగి ఉంటుంది. (చదవండి: వినియోగదారులకు భారీ షాక్, వీటి ధరలు పెరగనున్నాయ్) -
సరికొత్త లుక్‌తో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్స్..!
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం యమహా మోటార్స్ మిలాన్‌లో జరుగుతున్న ఇక్మాషో (EICMA)లో యమహా ఎమ్టీ 10, ఎమ్టీ 10 ఎస్పీ బైక్‌లను ఆవిష్కరించింది. రివైజ్డ్ స్టైలింగ్‌తో ఈ బైక్స్ రానున్నాయి. ఈ బైక్ యూరో 5 స్పెసిఫికేషన్ మోటార్‌తో అధిక పవర్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన ఎలక్ట్రానిక్స్ ప్యాకేజ్‌తో సిక్స్-యాక్సిస్ ఐఎంయూను కలిగి ఉంది. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ 650 లిమిటెడ్ ఎడిషన్ ..! ఈ బుల్లెట్ బండ్లను చూస్తే ఫిదా అవాల్సిందే..! ఎంటీ 10 ఎస్పీ కూడా లేటెస్ట్ ఫీచర్లతో రానుంది.మునుపటి మోడల్ కంటే అధికంగా 5బీహెచ్పీ శక్తిని అందించనుంది. ఈ బైక్‌ల పీక్ పవర్ 162బీహెచ్పీకు చేరనుంది. వీటిలో అదనంగా సిక్స్-యాక్సిస్ ఐఎమ్‌యూ పొందుతుంది. బ్రేకింగ్ వ్యవస్థలో సరికొత్త రేడియల్ బ్రెంబో మాస్టర్ సిలిండర్‌ను అమర్చారు. డ్యూయల్ 320ఎమ్ఎమ్ డిస్క్‌లతో జత చేయబడింది. ఎమ్టీ 10లో అప్‌గ్రేడ్‌గా యమహా ఎమ్టీ 10 ఎస్పీ రానుంది. దీనిలో సెమీ-యాక్టివ్ సస్పెన్షన్, త్రీ-పీస్ బెల్లీ పాన్ , స్టీల్డ్ బ్రేక్ లైన్లను అమర్చారు. యమహా ఎంటీ 10 బైక్ ధర సుమారు రూ. 14 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి: మార్కెట్లోకి షియోమీ ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చేది అప్పుడే..? -
హీరో ప్లస్ యమహా.. త్వరలో ఈ సైకిల్ డ్రైవ్
న్యూఢిల్లీ: వాహన విడిభాగాల తయారీలో ఉన్న హీరో మోటార్స్ తాజాగా జపాన్‌కు చెందిన యమహా మోటార్‌తో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఈ–సైకిల్ డ్రైవ్ మోటార్స్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇరు సంస్థలు కలిసి పంజాబ్‌లో నెలకొల్పుతాయి. 2022 నవంబర్ నుంచి ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలు కానుంది. వీటిని అంతర్జాతీయ మార్కెట్‌కు సరఫరా చేస్తారు. ఏటా 10 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో ఈ ఫెసిలిటీ రానుంది. ఈ–సైకిల్ రంగంలో పనిచేసేందుకు ఇరు సంస్థలు ఇప్పటికే 2019 సెప్టెంబర్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. -
ఫెస్టివల్ ఆఫర్, ఈ బైక్ కొంటే లక్ష వరకు..
బైక్ లవర్స్‌కు యమహా ఇండియా మోటార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా పలు వాహనాలపై గిఫ్ట్ ఓచర్లు, రూ.1లక్ష విలువైన బంపర్ ఫ్రైజ్లను అందిస్తున్నట్లు యమహా ప్రకటించింది. యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా ఫాసినో 125ఎఫ్ఐ వాహనాలపై ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్లు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల యమహా ఇండియా లాంఛ్ చేసిన ఐబ్రిడ్ వెర్షన్ టూవీలర్స్ ఫాసినో 125ఎఫ్ఐ, రెడ్జేఆర్ 125ఎఫ్ఐ వాహనాలపై తమిళనాడు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో వివిధ ఆఫర్లను పొందవచ్చు. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో యమహా ఫాసినో 125 ఎఫ్ఐ (నాన్ ఐబ్రిడ్),యమహా రేజడ్ఆర్ ఎఫ్ఐ(నాన్ ఐబ్రిడ్)వెర్షన్ వెహికల్స్ పై రూ.3,786 ఇన్సూరెన్స్ బెన్ఫిట్స్,రూ.999కే లో డౌన్ పేమెంట్స్ తో బైక్ ను సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను అందిస్తుంది. తమిళనాడులో యమహా బైక్ కొనుగోలుపై బంపర్ ఆఫర్ కింద రూ.1లక్ష రూపాయల్ని సొంతం చేసుకోవడమే కాదు...ఇన్య్సూరెన్స్ బెన్ఫిట్ కింద రూ.3,876, రూ.999కే డౌన్ పేమెంట్, రూ .2,999 విలువైన బహుమతుల్ని అందిస్తున్నట్లు యమహా ఇండియా ప్రకటించింది. కాగా ఈ ఆఫర్ సెప్టెంబర్ 30వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. -
కళ్లు చెదిరే ఆఫర్, ఈ బైక్ కొంటే రూ.1లక్ష వరకు..!
బైక్ లవర్స్‌కు యమహా ఇండియా మోటార్ కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.ఇండిపెండెన్స్ డే సందర్భంగా పలు వాహనాలపై గిఫ్ట్ ఓచర్లు, రూ.1లక్ష విలువైన బంపర్ ఫ్రైజ్లను అందిస్తున్నట్లు యమహా ప్రకటించింది. కరోనా కారణంగా చతికిల పడ్డ ఆటోమోబైల్ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కష్టమర్లు లేక ఇబ్బందులు పడ్డ పలు ఆటో మొబైల్ సంస్థలు ఆఫర్లు ప్రకటించి సేల్స్‌ను పెంచుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ, నాన్ ఐబ్రిడ్ వెహికల్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ వెహికల్స్ ను ఆగస్ట్ 31లోగా కొనుగోలు చేస్తే రూ.2,999 గిఫ్ట్ ఓచర్స్, రూ.20వేల వరకు అడిషనల్ బెన్ ఫిట్స్ పొందవచ్చని యమహా ఇండియా మోటార్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఒక్క తమిళనాడు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ, నాన్ ఐబ్రిడ్ వెహికల్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ వెహికల్స్ కొనుగోలు చేసిన వాహనదారులకు రూ.3,876 ఇన్స్యూరెన్స్ బెన్ ఫిట్స్, రూ.999కే లో డౌన్ పేమెంట్స్ తో బైక్ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను అందిస్తుంది. తమిళనాడులో యమహా బైక్ కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా రూ.30వేల విలువైన గిఫ్ట్ తో పాటు బంపర్ ఆఫర్ కింద రూ.1లక్ష రూపాయల్ని సొంతం చేసుకోవడమే కాదు..అడిషనల్ బెన్ ఫిట్స్ కింద రూ.20 వేలు దక్కించుకోవచ్చు. ఇక మిగిలిన అన్నీ మోడల్స్ పై రూ. 2,999 విలువైన బహుమతులు, రూ.20వేల అడిషనల్ బెన్ ఫిట్స్‌ను పొందవచ్చు. చదవండి: ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది -
టూ వీలర్ తర్వాత వచ్చే కొత్త మోడల్ బైక్స్ ఇవేనా
పెద్ద పెద్ద కంపెనీలు త్రీ–వీలర్ మోటర్సైకిల్స్పై దృష్టి సారించాయి. ‘యమహా’ కూడా ఇదే దారిలో నడుస్తుంది. త్రీ–వీలర్ స్కూటర్ డిజైన్ కోసం ఎప్పుడో పేటెంట్‌ను రిజిస్టర్ చేయించింది. నెక్ట్స్ జెనరేషన్ పర్సనల్ మొబిలిటీ కాన్సెప్ట్‌లో భాగంగా మల్టీ–వీల్ టెక్నాలజీతో రకరకాల మోడల్స్‌కు రూపకల్పన చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నది ‘యమహా ఎండబ్ల్యూ–విజన్’ మోడల్. -
ఎలక్ట్రిక్ వాహనల కోసం ప్రణాళికలు రచిస్తున్న యమహా!
జపాన్ ద్విచక్ర వాహన సంస్థ యమహా భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొనిరావడానికి ప్రణాళికలను రచిస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీలో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్దం అవుతున్నట్లు తెలిపింది. ఈ-మొబిలిటీలో పెట్టుబడులు భారత ప్రభుత్వ విధానంపై, స్పష్టమైన రోడ్ మ్యాప్ పై ఆధారపడి ఉంటుందని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఫేమ్ 2 పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని భారీగా పెంచింది. కానీ, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలను ఇంకా పరిష్కరించాల్సిన అవసరం ఉందని యమహా అభిప్రాయపడింది. జపాన్ లోని నిపుణుల బృందం భారతదేశం, ప్రపంచంలోని ఇతర మార్కెట్ల కోసం ఈవి వేదికను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్లు యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ మోటోఫుమి షితారా తెలిపారు. "ఇప్పటికే మా జపాన్ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేక బృందం భారతదేశం, ఇతర ప్రపంచ మార్కెట్ల అవసరాల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ వాహనలను తీసుకొని రావడానికి పనిచేస్తుంది" అని పేర్కొన్నారు. ఈవీ బ్రాండ్ గోగోరోతో కలిసి పనిచేస్తోందని, గత రెండు సంవత్సరాలుగా తైవాన్ కర్మగరంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోందని కూడా ఆయన తెలియజేశారు. ఇండియాకి విషయానికి వస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి గణనీయమైన సవాళ్లు ఎదుర్కొంటున్నామని షితారా తెలియజేశారు. "ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించిన పెద్ద సవాళ్లు ఉన్నాయి. భారత ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్, స్థిరమైన విధానాన్ని రూపొందించకపోతే దీనిని పరిష్కరించలేము" అని ఆయన అన్నారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల సంబందించిన సమస్యలను పరిష్కరించగలిగితే సామాన్య ప్రజలు ఈవిలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని ఆయన నొక్కి చెప్పారు. "కాబట్టి పైన పేర్కొన్న అన్నీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిన తర్వాత, మేము భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడమే కాకుండా తయారు చేస్తాము" అని షితారా పేర్కొన్నారు. యమహా ఇటీవల ఫాసినో 125 ఫై హైబ్రిడ్ స్కూటర్ లాంఛ్ చేసింది. -
అదిరిపోయిన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్
యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ గుర్తుందా? జపనీస్ ద్విచక్ర వాహన తయారీ దారి దిగ్గజం కొన్ని సంవత్సరాల క్రితం టోక్యో మోటార్ షోలో 2019 ఎడిషన్ సందర్భంగా ఈ బైక్ ప్రోటో టైపుని విడుదల చేసి ఆశ్చర్య పరిచింది. సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి సిద్దం అవుతుంది. యమహా మోటార్ త్వరలో తీసుకురాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ నమూనాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో యమహా ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ పేటెంట్లను కూడా దాఖలు చేసిన మాట వాస్తవం. లీకైన యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా ఉంది. డిజైన్ పరంగా అన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంటే చాలా బాగుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చిత్రాలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. దీని ముందు భాగంలో పెద్ద హెడ్‌ల్యాంప్, వెనుక భాగంలో స్ట్రీమ్లైన్డ్ డిజైన్ వంటివి దీన్ని ప్రీమియం స్కూటర్‌గా నిలుపుతాయి. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. యమహా రాబోయే ఈ–స్కూటర్లో ఆల్-ఎల్ఈడి లైటింగ్ సెటప్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన వాటిని అందిస్తుంది. ఇక్కడ గమనించదగ్గ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీని బ్యాటరీని రైడర్ లెగ్స్ మధ్యలో చేర్చారు. ఇక స్కూటర్ మోటారును బ్యాటరీ వెనుక అమర్చారు. ఇవి డిస్క్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంటాయి. E01 ఎలక్ట్రిక్ స్కూటర్ రిటైల్ కోసం ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయంపై యమహా స్పష్టతనివ్వలేదు. అంతర్జాతీయ మార్కెట్(ల)లో స్కూటర్ ప్రారంభించబడటానికి ఎక్కువ సమయం పట్టదని అంచనా. నిజంగా చెప్పాలంటే, రాబోయే దశాబ్ద కాలం మాత్రం ఇండియాదే అనిపిస్తుంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల రోజు రోజుకి పెరిగిపోతుంది. చదవండి: రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధర -
మోస్ట్ ఎవైటెడ్ బైక్స్ లాంచ్
సాక్షి, న్యూ ఢిల్లీ : ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కొత్త బైక్ మోడళ్లను ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఇండియా యమహా మోటార్ లాంచ్ చేసింది. ఎంటీ-15 పేరుతో సరికొత్త 155సీసీ బైక్‌ను కంపెనీ శుక్రవారం విడుదల చేసింది. దీని ధర రూ. 1.36లక్షలు(ఎక్స్ షోరూం న్యూఢిల్లీ)గా నిర్ణయించింది. ఎంటీ సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన ఎంటీ-15 బైక్‌లో లిక్విడ్ కూల్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), వేరియబుల్ వ్యాల్యూ యాక్చుయేషన్ తదితర అధునాతన ఫీచర్లు ఈ కొత్త బైక్‌లో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మెటాలిక్ బ్లాక్, డార్క్ మ్యాట్ బ్లూ కలర్స్‌లో ఇది లభ్యం కానుంది. అలాగే ట్యాంక్ ప్యాడ్, సీట్ కవర్, మొబైల్ హోల్డర్, పోలో షర్ట్స్, స్టికర్, కీ రింగ్ లాంటి యాక్సెసరీస్ ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఏడాది 60వేల ఎంటీ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియా యమహా మోటార్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర సింగ్ తెలిపారు. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ఎంటీ-03 లాంటి బైక్‌లను కూడా భారత్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. యమహా ఇప్పటికే పలు మోడళ్లను తయారుచేసింది. అయితే భారత్‌లో ఎంటీ-09 మోడల్‌ను మాత్రమే విడుదల చేసింది. 2015 నుంచి ఈ మోడల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. దాని తర్వాత మళ్లీ ఎంటీ సిరీస్‌లో ఇప్పుడు ఎంటీ-15 బైక్‌ను తీసుకొచ్చింది. -
మార్కెట్లోకి యమహా కొత్త ‘ఎంటీ–09’
న్యూఢిల్లీ: యమహా మోటార్ ఇండియా తాజాగా తన సూపర్‌బైక్ ‘యమహా ఎంటీ–09’లో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.10.88 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన 847 సీసీ, 3 సిలిండర్, లిక్విడ్ కూల్డ్, 4 స్ట్రోక్, డీఓహెచ్సీ, 4 వాల్వ్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. యాంటి–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ఫీచర్ కూడా ఉంది. -
యూత్ కోసం యమహా కొత్త సూపర్ బైక్
సాక్షి, న్యూఢిల్లీ: యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. కొత్తగా అభివృద్ధి చెందిన 847 సిసి, 3-సిలిండర్ ఇంజన్‌తో యూత్ ను ఆకట్టుకునేలా ఎంటీ-09లో కొత్త వెర్షన్ ను రూపొందించింది యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) టెక్నాలజీ తమ బైక్ ప్రత్యేకత అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ధరను రూ. 10.88 లక్షల (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ఉన్నతమైన నైపుణ్యంతో భారతదేశంలో అందించే యమహా ఈ కొత్త వెర్షన్‌తో తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని యమహా మోటార్స్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రాయ్ కురియన్ తెలిపారు. చురుకైన హ్యాండ్లింగ్ పనితీరు, పవర్ డెలివరీలో అద్భుతమైన దృఢత్వంతో దీన్ని విడుదల చేశామన్నారు. 600 సి.సి. స్పోర్ట్స్ మోడల్ నుంచి అప్‌గ్రేడ్ అవుతున్న యువతను లక్ష్యంగా పెట్టుకుని ఇండియాలో పూర్తిగా నిర్మించిన యూనిట్‌గా దిగుమతి చేసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. -
యమహా కొత్త బీఎస్–4 వాహనాలు
న్యూఢిల్లీ: టూవీలర్ కంపెనీ యమహా మోటార్ తాజాగా బీఎస్–4 నిబంధనలకు అనువుగా ఉండేటా తన బైక్స్, స్కూటర్ల పోర్ట్‌ఫోలియోను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో ఎఫ్‌జెడ్ 25, వైజెడ్ఎఫ్–ఆర్15, వైజెడ్ఎఫ్–ఆర్15ఎస్, ఎఫ్‌జెడ్–ఎస్ ఎఫ్ఐ, ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ, ఫజిర్ ఎఫ్ఐ, ఎస్జెడ్ ఆర్ఆర్ బైక్స్ ఉన్నాయి. ఇక ఇది ఇప్పటికే సెల్యుటో 125, సెల్యుటో ఆర్ఎక్స్ బైక్స్‌లో కొత్త వెర్షన్లను మార్కెట్లోకి తెచ్చింది. కంపెనీ అలాగే సైగ్నస్ రే జెడ్ఆర్, సైగ్నస్ రే జెడ్, సైగ్నస్ ఆల్ఫా, ఫాసినో వంటి స్కూటర్లను కూడా బీఎస్–4 నిబంధనలకు అనువుగా అప్‌గ్రేడ్ చేసింది. అన్ని కొత్త వేరియంట్లలో ఆటో హెడ్‌ల్యాంప్–ఆన్ (ఏహెచ్ఓ) ఫీచర్‌ను పొందుపరిచామని కంపెనీ పేర్కొంది. -
యమహా ‘సిగ్నస్ ఆల్ఫా’లో డిస్క్ బ్రేక్ వేరియంట్
ధర రూ.52,556 న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్ కంపెనీ ‘యమహా మోటార్’ తన స్కూటర్ ‘సిగ్నస్ ఆల్ఫా’లో డిస్క్ బ్రేక్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.52,556 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. గత కొన్నేళ్లుగా స్కూటర్ మార్కెట్ బాగా వృద్ధి చెందుతోందని, అందుకే ఆ విభాగంపై తాము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని యమహా మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ తెలిపారు. ఈ ఏడాది చివరకు స్కూటర్ మార్కెట్లో 10 శాతం మార్కెట్ వాటాను సాధించడం లక్ష్యమని చె ప్పారు. అదనపు భద్రతా ఫీచర్లను కోరుకుంటున్న కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చామని తెలిపారు. -
యమహా నుంచి ‘సెల్యూటో ఆర్ఎక్స్’ బైక్
ధర రూ.46,400 న్యూఢిల్లీ: జపాన్ టూవీలర్ తయారీ కంపెనీ ‘యమహా మోటార్’ తాజాగా ఎంట్రీ లెవెల్ బైక్ ‘సెల్యూటో ఆర్ఎక్స్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.46,400 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ప్రధానంగా నలుపు, ఎరుపు, బ్లూ రంగుల్లో లభ్యంకానున్న ఈ బైక్‌లో 4 స్ట్రోక్ 110 సీసీ 2 వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, స్పోర్టీ ఎక్స్టీరియర్ బాడీ డిజైన్, 4 స్పీడ్ గేర్ బాక్స్, టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, యమహా బ్లూ కోర్ టెక్నాలజీ, లైట్ వెయిట్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. సెల్యూటో బైక్ లీటరుకు 82 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని పేర్కొంది. తక్కువ ధరల్లో అధిక మైలేజ్‌ను ఆశిస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ బైక్‌ను తయారుచేసింది.