ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలలో ఒకటి అయిన యమహా తన ప్రత్యర్థులతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఆలస్యంగా అడుగుపెట్టింది. కంపెనీ కొంతకాలం క్రితం తీసుకొచ్చిన ఈ-వినో ఎలక్ట్రిక్ స్కూటర్ అంత పాపులర్ కాలేదు. అందుకు ముఖ్య కారణ ఆ స్కూటర్ ఛార్జ్, దీనిని ఒకసారి చార్జ్ చేస్తే కేవలం 29 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ అందిస్తుంది. ఆ తర్వాత గోగోరో భాగస్వామ్యం కింద తీసుకొచ్చిన ఈసీ-05 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం తైవాన్ లో అమ్మకానికి ఉంది. అయితే, ఈ జపనీస్ టూ వీలర్ బ్రాండ్ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తోంది.
ఈ స్కూటర్‌ని ఈ01 అనే పేరుతో మార్కెట్లోకి తీసుకొని రావాలని చూస్తోంది. ఈ01ని మొదటిసారి 2019 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించింది. ఈ స్కూటర్‌ని త్వరలో మార్కెట్లోకి తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యమహా ఈ01 ప్రోటోటైప్ 2019లో వెల్లడించిన కాన్సెప్ట్ మోడల్ డిజైన్ కు దగ్గరగా ఉంది. కాబట్టి, ఈ01లో మాక్సీ-స్కూటర్ స్టైలింగ్, విండ్ స్క్రీన్ ఫ్రంట్ ఏప్రాన్, ఫ్లోటింగ్ రియర్ సెక్షన్, వైడ్ హ్యాండిల్ బార్లు ఉంటాయి. అయితే, ప్రొడక్షన్ రెడీ మోడల్ లో రీడిజైన్ చేయబడ్డ స్టెప్ అప్ సీటు ఉంది.
జపనీస్ బ్రాండ్ ఈ01కి చెందిన పూర్తి స్పెసిఫికేషన్ లను వెల్లడించలేదు. అయితే దీనిని సింగిల్ ఛార్జ్ చేస్తే సుమారు 120 కిలోమీటర్ల రేంజ్ అందించే 4 కెడబ్ల్యుహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ 125సీసీ స్కూటర్ కి సమానంగా దూసుకెళ్లనున్నట్లు సంస్థ తెలిపింది. ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. ఈ01 ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ గల ఎల్‌సిడి డిస్ప్లే కలిగి ఉంటుంది.
(చదవండి: వినియోగదారులకు భారీ షాక్, వీటి ధరలు పెరగనున్నాయ్)
Comments
Please login to add a commentAdd a comment