సరికొత్త లుక్‌తో యమహా ఎమ్‌టీ 10, ఎమ్‌టీ 10 ఎస్పీ బైక్స్‌..! | Yamaha Showcases The Yamaha MT 10 And MT 10 SP | Sakshi
Sakshi News home page

Yamaha: సరికొత్త లుక్‌తో యమహా ఎమ్‌టీ 10, ఎమ్‌టీ 10 ఎస్పీ బైక్స్‌..!

Published Thu, Nov 25 2021 10:12 PM | Last Updated on Thu, Nov 25 2021 10:14 PM

Yamaha Showcases The Yamaha MT 10 And MT 10 SP - Sakshi

ప్రముఖ జపనీస్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం యమహా మోటార్స్‌ మిలాన్‌లో జరుగుతున్న ఇక్మాషో (EICMA)లో యమహా ఎమ్‌టీ 10, ఎమ్‌టీ 10 ఎస్‌పీ బైక్లను ఆవిష్కరించింది. రివైజ్డ్‌ స్టైలింగ్‌తో ఈ బైక్స్‌ రానున్నాయి. ఈ బైక్ యూరో 5 స్పెసిఫికేష‌న్ మోటార్‌తో అధిక ప‌వ‌ర్‌ను క‌లిగి ఉంటుంది. మెరుగైన ఎల‌క్ట్రానిక్స్ ప్యాకేజ్‌తో సిక్స్‌-యాక్సిస్ ఐఎంయూను క‌లిగి ఉంది.
చదవండి: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 650 లిమిటెడ్‌ ఎడిషన్‌ ..! ఈ బుల్లెట్‌ బండ్లను చూస్తే ఫిదా అవాల్సిందే..!


ఎంటీ 10 ఎస్‌పీ కూడా లేటెస్ట్ ఫీచ‌ర్ల‌తో రానుంది.మునుపటి మోడల్‌ కంటే అధికంగా 5బీహెచ్‌పీ శక్తిని అందించనుంది. ఈ బైక్ల  పీక్ పవర్ 162బీహెచ్‌పీకు చేరనుంది. వీటిలో అదనంగా  సిక్స్-యాక్సిస్ ఐఎమ్‌యూ పొందుతుంది.  బ్రేకింగ్‌ వ్యవస్థలో సరికొత్త రేడియల్ బ్రెంబో మాస్టర్ సిలిండర్‌ను అమర్చారు.  డ్యూయల్ 320ఎమ్ఎమ్ డిస్క్‌లతో జత చేయబడింది. ఎమ్‌టీ 10లో అప్‌గ్రేడ్‌గా యమహా ఎమ్‌టీ 10 ఎస్‌పీ రానుంది. దీనిలో సెమీ-యాక్టివ్ సస్పెన్షన్, త్రీ-పీస్ బెల్లీ పాన్ , స్టీల్డ్‌ బ్రేక్ లైన్‌లను అమర్చారు. యమహా ఎంటీ 10 బైక్‌ ధర సుమారు రూ. 14 లక్షలుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 
చదవండి:  మార్కెట్లోకి షియోమీ ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చేది అప్పుడే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement