యూత్‌ కోసం యమహా కొత్త సూపర్‌ బైక్‌ | Yamaha launches new MT-09 superbike priced at Rs 10.88 lakh | Sakshi
Sakshi News home page

యూత్‌ కోసం యమహా కొత్త సూపర్‌ బైక్‌

Published Fri, Nov 24 2017 2:31 PM | Last Updated on Fri, Nov 24 2017 4:55 PM

Yamaha launches new MT-09 superbike priced at Rs 10.88 lakh - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్  కొత్త సూపర్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. కొత్తగా అభివృద్ధి చెందిన 847 సిసి, 3-సిలిండర్ ఇంజన్‌తో  యూత్‌ ను ఆకట్టుకునేలా ఎంటీ-09లో కొత్త వెర్షన్‌  ను రూపొందించింది   యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) టెక్నాలజీ తమ బైక్‌ ప్రత్యేకత అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ధరను  రూ. 10.88 లక్షల (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్) గా  నిర్ణయించింది.

ఉన్నతమైన నైపుణ్యంతో భారతదేశంలో అందించే యమహా ఈ కొత్త వెర్షన్‌తో తన  నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని  యమహా మోటార్స్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్  సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రాయ్ కురియన్  తెలిపారు.  చురుకైన హ్యాండ్లింగ్ పనితీరు,  పవర్ డెలివరీలో అద్భుతమైన దృఢత్వంతో దీన్ని విడుదల చేశామన్నారు.  600 సి.సి. స్పోర్ట్స్ మోడల్ నుంచి అప్‌గ్రేడ్‌ అవుతున్న యువతను లక్ష్యంగా పెట్టుకుని ఇండియాలో పూర్తిగా నిర్మించిన యూనిట్‌గా దిగుమతి చేసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement